SHOULD YOUR HAIR BE THICK AND SMOOTH THEN TRY THIS TIP WITH CASTOR OIL FOR BETTER RESULT PRV
Beauty tips: జుట్టు ఒత్తుగా, మృదువుగా ఉండాలా? అయితే ఆముదం నూనెతో ఈ చిట్కా ప్రయత్నించండి
ప్రతీకాత్మక చిత్రం
మహిళలు (women) కేశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో అనేక మందికి ఎదురవుతున్న సమస్య జుట్టు రాలడం. మహిళలు జుట్టు రాలడం (hair fall) భరించలేరు.
మహిళలు (women) కేశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో అనేక మందికి ఎదురవుతున్న సమస్య జుట్టు రాలడం. మహిళలు జుట్టు రాలడం (hair fall) భరించలేరు. ఇక పురుషుల్లో అయితే అనేక కారణాల వల్ల నేడు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా జుట్టు రాలడం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి చాలామంది రకరకాల షాంపూలు, హెయిర్ మాస్క్లు ట్రై చేస్తుంటారు. అయినా ఏం లాభం ఉండదు. ఈ సమస్య పరిష్కారానికి మూలం ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆహారపు అలవాట్లు (food habits) సరిచేసుకోవాలి. జన్యుపరమైన అంశాలు, చర్మ సమస్యల, మానసిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో గమనించుకోవాలి. వాటిని అధిగమించేలా చూసుకోవాలి. అయితే ముడి ఆముదంతో జుట్టును మృదువుగా ఒత్తుగా చేసుకోవచ్చంట.. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..
కొబ్బరి నూనెలో..
మనకు బయట దొరికే బాటిల్ నూనె కాకుండా ముడి ఆముదం (Castor oil) చూడటానికి తేనె రంగులో ఉంటుంది. దానిని తీసుకోవాలి. కొబ్బరి నూనె (Coconut oil) రెండు స్పూన్లు అముదం 1 స్పూన్ తీసుకోవాలి. దీనిని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేటి చేసి అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడెక్కాక ఇంకో గిన్నెలో ఆముదం కొబ్బరి నూనె నీటిలో పెట్టి అవి గోరువెచ్చగా (lukewarm) అయిన తర్వాత కాటన్ బాల్స్ తో తలలోని కుదుళ్లకు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీ జుత్తు ఒత్తుగా అవుతుంది. రాలడం కూడా తగ్గుతుంది.
ఆహారం విషయంలో..
మనం తీసుకునే ఆహారం (food) వల్ల మనకు అందం(beauty), ఆరోగ్యం రెండూ వస్తాయి. చర్మ సౌందర్యం, జుట్టుకు అవసరమైన పోషకాలను అందించేది ఆహారం. అయితే మీ జుట్టు అకస్మాత్తుగా రాలితే మీరు తినే ఆహారంలో కొన్ని పోషకాలు లేకపోవడమే కారణం. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా (distance) ఉంటే మంచిది.
చేపల్లో అత్యధికంగా ఉన్న పాదరసం నిల్వల కారణంగా చేపలు (fish) ఎక్కువగా తినేవారిలో కొందరికి ఉన్నట్టుండి జుట్టు ఊడిపోతుంది. కానీ కొన్ని చేపల వల్ల వెంట్రుకలు (hairs) బాగా పెరుగుతాయి. కానీ మీరు ఎలాంటి చేపలు తింటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీకు జుట్టు రాలడం ప్రారంభం అయితే చక్కెర (sugar)ను బాగా తగ్గించండి. కుదిరితే చక్కెరను తీసుకోవడం మానేయండి.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.