హార్ట్ అటాక్ తర్వాత వారి రోజువారీ పనులను మొదలు పెడితే మంచిది. కార్డియక్ రిహబిలిటేషన్ ప్రిస్కిప్షన్ కూడా వారికి వైద్యులు అందిస్తారు. డైట్, లైఫ్‌స్టైల్, ఎమోషనల్ వంటివాటిపై వైద్యుల తగిన సూచనలు ఇస్తారు.
హార్ట్ అటాక్ తర్వాత వారి రోజువారీ పనులను మొదలు పెడితే మంచిది. కార్డియక్ రిహబిలిటేషన్ ప్రిస్కిప్షన్ కూడా వారికి వైద్యులు అందిస్తారు. డైట్, లైఫ్‌స్టైల్, ఎమోషనల్ వంటివాటిపై వైద్యుల తగిన సూచనలు ఇస్తారు.
సాధారణంగా ఎక్సర్సైజ్ Exercise ను ఆరోగ్యం మెరుగుపడటానికి చేస్తారు. అయితే, ప్రతిరోజు ఏ ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయాలన్న విషయం చాలా మందిలో ఉండే సందేహం. దీనిపై చాలా మందికి క్లారిటీ ఉండదు. మరికొంత మంది హార్ట్ అటాక్ Heart attack వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేయవచ్చా? అనే సందేహం కూడా ఉంటుంది. అయితే, గుండె పోటు వచ్చిన కొన్ని రోజులు మాత్రం ఎక్సర్సైజ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తారు. కానీ, కొన్ని స్టడీస్ ప్రకారం వైద్యుల సలహా మేరకు చేసే వ్యాయామం వారి ఆరోగ్య పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించాయి.
కొన్ని సూచనలు..
ఎక్సర్సైజ్ చేసే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి (హార్ట్ డిసీజ్, పనితీరు, ఇజెక్షన్ ఫ్రాక్షన్) వైద్యులు ఎక్సర్సైజ్ ప్రిస్కిప్షన్ ఇస్తారు.
ఏ వ్యాయామం అయినా ముందుగా చిన్నగా మొదలు పెట్టాల్సి ఉంటుంది. అంటే వాకింగ్ వంటివి చేస్తే, మీకు శ్వాసలో ఏమైన మార్పులు ఉంటే తక్కువ దూరం మాత్రమే నడక కొనసాగించాలి.
ఎక్సర్సైజ్ను 3 ఫేజ్‌ల్లో చేస్తారు. వార్మఅప్, పీక్ ఎక్సర్సైజ్, కూల్ డౌన్.
ప్రతిరోజూ 10 నిమిషాల సమయంతో మొదలు పెట్టి, క్రమంగా పెంచుతూ ఉండాలి. ఏ ఇబ్బంది లేని వారు నెల గడిచే సరికి 30 నిమిషాలు నడకకు కేటాయించడానికి ప్రయత్నించాలి.
నడక పూర్తయిన తర్వాత కచ్ఛితంగా కూల్ డౌన్‌కు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలి. ఓ 3 నిమిషాలు సరిపోతుంది.
నడక ప్రారంభించే ముందు ఓ గ్లాసు మంచినీరు తాగితే డీహైడ్రేషన్ Dehydration సమస్య రాదు.
మీరు ఏ వ్యాయామం ఈజీగా చేయగలరో అది చేయడం బెట్టర్. అంటే, సైక్లింగ్ cycling , వాకింగ్, ఎయిరోబిక్ aerobic.
ఎక్సర్సైజ్లో అధిక బరువు ఎత్తడానికి weight lifting వైద్యుల సలహా కచ్ఛితం.
కనీసం వారంలో 6 రోజుల వ్యాయామం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
ప్రతిరోజు ఒకే సమయంలో ఎక్సర్సైజ్ చేయడం మంచి అలవాటు. దీంతో ఆరోగ్యంపై ఏ ప్రభావం పడదు.
ఒకవేళ గుండెలో ఇబ్బంది, శ్వాస తగ్గడం, గుండె దడ ఉంటే ఎక్కడకు వెళ్లకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
గుండెపోటు తర్వాత శరీర శక్తి స్థాయిలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది వ్యాయామంపై ప్రభావం పడుతుంది.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.