హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Strange Facts: ప్రపంచంలో 15 రకాల తిండి వ్యాధులు

Strange Facts: ప్రపంచంలో 15 రకాల తిండి వ్యాధులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

15 Bizarre Eating Disorders : కొత్తగా ఏదైనా తెలుసుకోవాలని ఉందా. తినే తిండి విషయంలోనూ రకరకాల వ్యాధులున్నాయని తెలుసా. తెలియకపోతే, తెలుసుకోండి మరి.

ఎవరు ఏం తినాలో మన ప్రకృతి ఎప్పుడో డిసైడ్ చేసింది. కోర దంతాలు ఉండే పులులు మాంసం తినాలి. అందుకు తగ్గ విధంగా వాటి పండ్ల (teeth)వరుస ఉంటుంది. పొట్టి ముక్కు ఉండే పక్షులు గింజలు తింటాయి. అదే పొడుగు ముక్కు ఉండే... కొంగలు, కాకుల వంటివి చేపలు, మాంసం తింటాయి. అలాగే మనుషులమైన మనం నిజానికి శాఖాహారులం. మన పండ్ల వరుసను బట్టి... మనం కూరగాయలు, కాయగూరలు మాత్రమే తినాలి. కానీ మనకు తెలివి తేటలు ఎక్కువ కదా... అందువల్ల మనం మాంసం తినడం కూడా అలవాటు చేసుకున్నాం. అక్కడవరకూ ఏ సమస్యా లేదు. కానీ... కొంత మంది తినే వస్తువులు, తినే విధానం అంతా చిత్రంగా ఉంటుంది. అలా కావాలని చెయ్యరు. అదో ఈటింగ్ డిజార్టర్. అలాంటి విపరీత తిండి పోకడల్ని తెలుసుకుందాం.

ఆక్యుఫాజియా (Acuphagia) - మొనదేలిన షార్ప్ వస్తువుల్ని తినాలని అనిపిస్తుంది.

అమిలోఫాజియా (Amylophagia) – ఈ వ్యాధి ఉంటే వాషింగ్ పౌడర్ తినాలనిపిస్తుంది.

కాటోపైరియోఫాజియా (Cautopyreiophagia) - ఇది ఉంటే కాలిపోయిన అగ్గిపుల్లల్ని తింటారు.

కోప్రోఫాజియా (Coprophagia) - మూత్రం తినాలనిపించే వ్యాధి ఇది.

జియోమెలోఫాజియా (Geomelophagia) – పచ్చి బంగాళా దుంపలు తినాలనిపించే వ్యాధి

జియోఫాజియా (Geophagia) – మట్టిని తినే వ్యాధి

గూబెర్‌ఫాజియా (Gooberphagia) - వేరు శనగ గింజల్ని అతిగా తినాలనిపిస్తుంది.

లిథోఫాజియా (Lithophagia) – రాళ్లు తినే వ్యాధి

మ్యూకోఫాగీ (Mucophagy) – కఫం తినే అలవాటు

ఆర్థోరెగ్జియా నెర్వోసా (Ortharexia Nervosa) – అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినే అలవాటు. ఆహారం ఏమాత్రం బాగోకపోయినా... అస్సలు తినరు.

పాగోఫాజియా (Pagophagia) – ఐస్ కనిపిస్తే తినకుండా ఉండలేకపోవడం.

పికా (Pica) – ఇది ఉన్నవాళ్లు రాళ్లు, ఇసుక, ఇతరత్రా తినకూడనివన్నీ తినేస్తుంటారు.

ప్లంబోఫాజియా (Plumbophagia) – లెడ్ (సీసం) తినే అలవాటు

ట్రైకోఫాజియా (Trichophagia) – జుట్టును తినే అలవాటు

ఇది కూడా చదవండి :Vastushastra: భోజనం చేసేటప్పుడు ఎటువైపు తిరిగి కూర్చోవాలో తెలుసా?

జైలోఫోబియా (Xylophobia) – కలపను తినే అలవాటు

First published:

Tags: Health, Trending, VIRAL NEWS, World

ఉత్తమ కథలు