Food shared in instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్‌ రెసిపీస్‌ షేర్‌ చేసేవారికి.. ఒబేసిటీ సమస్య..!

ప్రతీకాత్మక చిత్రం

Instagram food photos share: ఇటీవలి అధ్యయనం ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్‌ రెసిపీస్‌ షేర్‌ చేసే వ్యక్తులు బరువు పెరుగుతారని చెప్పింది.

  • Share this:
ఈ రోజుల్లో సోషల్‌ మీడియా జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చాలా మంది ముఖ్యంగా తాము వెళ్లిన ప్రదేశాన్ని.. వండిన ఆహారాన్ని సోషల్‌ మీడియా (social media) లో షేర్‌ చేస్తూ ఉంటారు. అయితే, ఫుడ్‌ రెసిపీ (food recopies) లను పోస్ట్‌ చేస్తున్నవారు ఒబేసిటీకి గురవుతున్నరని ఓ స్టడీ తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం ఉడికించి తినే కొన్ని ఆహార పదార్థాలతో బరువు పెరిగే ఛాన్స్‌ ఉంటుందట.

ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) యువతతోపాటు వృద్ధులు కూడా సులభంగా ఉపయోగించే ఒక ముఖ్యమైన సోషల్‌ మీడియా. దీనికి రోజురోజుకూ వినియోగదారులు పెరుగుతున్నారు. ఏ పనిచేసినా.. దాన్ని వెంటనే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసేవారు అత్యధికం.

ఇది కూడా చదవండి: వైరల్‌ అవుతున్న రాశిఖన్నా బ్యూటిఫుల్‌ పిక్స్‌! ఒకప్పుడు బుమ్రాతో..

ముఖ్యంగా తమకు ఇష్టమైన పాటలు, ఫుడ్‌ రెసిపీస్‌ పిక్స్‌తోపాటు వీడియోలను పంచుకుంటారు. వాటిని ఎలా తయారు చేయాలో ప్రతీది చెప్పడం ఇందులో ఉంటుంది. కానీ, ఇటీవలి అధ్యయనం ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్‌ రెసిపీస్‌ షేర్‌ చేసే వ్యక్తులు బరువు పెరుగుతారని చెప్పింది. యూనైటెడ్‌ స్టేట్స్‌లోని దక్షిణ జార్జియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఫుడ్‌ ఫోటోస్‌ను పంచుకుంటే, దానిపై రుచిచ వాసనపై కూడా దృష్టి పెంచుతుందని కనుగొన్నారు.

హంగర్‌ పేపర్‌లో ఒక అధ్యయనం ప్రకారం 145 మంది విద్యార్థులు రెండు గ్రూపులుగా విభజించారు. రెండు గ్రూపుల్లో ప్రతి ఒక్కరికి ఒక చీజ్‌ క్రాకర్‌ ఫుడ్‌ ఇచ్చారు. తినడానికి ముందు స్మార్ట్‌ఫోన్‌లో ఫుడ్‌ ఫోటో తీయమని సిబ్బందితో ఒకరు చెప్పారు. అప్పుడు ప్రతిఒక్కరూ ఎంత ఫుడ్‌ కావాలి వంటి ప్రశ్నలను అడిగారు. ఆ రెండు గ్రూపుల్లోని ఫలితాలను స్మార్ట్‌ఫోన్‌లో ఫోటో తీసిన గ్రూపు, తీయని గ్రూపులను పరిశీలించారు. అందులో ఫుడ్‌ ఫోటోగ్రాఫర్‌లలో ఆహార భావాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇలాంటివారు బరువు పెరుగుతారని తేలింది. అది వారిలో ఆకలిని పెంచుతుంది. ఫుడ్‌కు సంబంధించిన జ్ఞాపకాలు వారి మెదడులో ముద్ర వేసి ఉంటాయి.

ఇది కూడా చదవండి:  అల్లం వెల్లుల్లి పర్ఫెక్ట్‌ పేస్ట్‌ను ఇలా రెడీ చేయండి!

మనం ఎంత ఆహారం తీసుకోబోతున్నామో కూడా ఇది నిర్ణయిస్తుంది. మనం ఫుడ్‌ ఫోటో తీసినపుడు మెదడు ఆ ఫుడ్‌ గురించి మరింత ఎక్కువగా జ్ఞాపకాలను తీసుకుంటుంది. అందుకే ఇది మరింత ఆకలిని పెంచుతుందని పరిశోధకులు తెలిపారు.

ఆకలి పెరిగే కొద్ది మనం ఎక్కువ ఫుడ్‌ తీసుకుంటాం. తద్వారా బరువు పెరుగుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్‌ ఫోటోస్‌ పోస్ట్‌ చేసే వ్యక్తులు తాము తినే ఆహార కేలరీలు కొలవాలి.
Published by:Renuka Godugu
First published: