Sexual Wellness: నా భర్త నన్ను బూతులు తిడితే...నాకు చంపేయాలనేంత కోపం వస్తోంది..ఏం చేయాలి..

ప్రతీకాత్మక చిత్రం

అనేక కారణాల వల్ల భాగస్వామిని వదలడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎటువంటి కారణం లేకుండానే విడిపోతుంటారు. అయితే కొన్ని సార్లు బలమైన కారణాలు ఉంటాయి.

  • Share this:
ప్రశ్న: నా భర్త నన్ను దుర్భాషలాడితే నాకు కోపం వస్తుంది...గత నాలుగేళ్లుగా ఆయన ఇవన్నీ చేస్తున్నారు. అయితే మూడున్నరేళ్లు విడిపోగా, ఇప్పుడు మళ్లీ మేము గత ఐదు నెలలుగా కలిసి జీవిస్తున్నాము. మొదట్లో అతను బాగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు కూడా అతడు నన్ను ఎప్పుడూ నన్ను బూతులు తిడుతున్నాడు...దీంతో అతడి ప్రవర్తన నన్ను కోపిష్టిగా మారుస్తోంది. ఏం చేయాలి..

జవాబు :  అనేక కారణాల వల్ల భాగస్వామిని వదలడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎటువంటి కారణం లేకుండానే విడిపోతుంటారు. అయితే కొన్ని సార్లు బలమైన కారణాలు ఉంటాయి. ముఖ్యంగా భార్య భర్తలు విడిపోవడానికి ప్రధానంగా గౌరవం లేకపోవడం, అభద్రత భావన, మిమ్మల్ని బలహీనపరచడం, మిమ్మల్ని నిందించడం కావచ్చు. అయినప్పటికీ చాలా సార్లు సహనం వహిస్తుంటాం కానీ పదే పదే అలా చేస్తుంటారు. ఒకరిని 'బిచ్' లేదా 'స్లట్' అని పిలవడం చాలా హేయమైన విషయం. బిచ్ అనే పదాన్ని సాధారణంగా మహిళలపై తప్పుడు అర్థంలో ఉపయోగిస్తారు. అయితే, చాలా మంది స్త్రీలు ఓపికగా అలాంటి పదజాలంతో బూతులను భరిస్తుంటారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ ఎమెరిటస్ లారెల్ రిచర్డ్సన్ ఈ పదాన్ని తన పేపర్‌లో బాగా ప్రస్తావించారు. స్త్రీకి బిచ్ అనే పదాన్ని ఉపయోగించడం అంటే స్త్రీని ఆత్మన్యూనతకు గురి చేయడమే అని అర్థం. ఒకరిని అవమానించడానికి ఇలాంటి పదాలను ఉపయోగించినప్పుడు, సమస్య ఉత్పన్నం అవుతుంది.

మీ రిలేషన్ లో మీకు ఎటువంటి గౌరవం లభించకపోయినా, ఎవరూ మీ మాట వినకపోయినా అది మీకు నిరాశను పెంచుతుంది. ఇది సాధారణమైనది కాని తరువాత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరియు ఇది చాలా కాలంగా జరుగుతుంటే అది సంబంధాన్ని క్షీణింపజేసే అన్ని సంకేతాలను కలిగి ఉంటుంది. బహుశా మీరు అతని నుండి విడిపోయే సమయం వచ్చిందని గుర్తించవచ్చు.

మీరు మీ భాగస్వామితో మీ సరిహద్దులను నిర్ణయించినప్పుడు, కొన్ని పరిణామాలు కూడా ఉంటాయని నిర్ధారించుకోండి మరియు అలాంటి చర్యలు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీ సరిహద్దులకు రక్షణ దాటితే ఘర్షణ పోరాటంగా మారుతుంది. అయితే మీ భాగస్వామితో కలిసి చర్చించి ఎవరి తప్పు ఉందనేది బేరీజు వేసుకుంటే ఏదైనా ఆరోగ్యకరమైన సంబంధంలో, మీరు మరియు మీ భాగస్వామి ఒకరికొకరు వ్యతిరేకంగా కాకుండా సమస్యతో పోరాడుతున్నారని గుర్తుంచుకోండి.
Published by:Krishna Adithya
First published: