హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Sexual Wellness: కండోమ్‌లో చిల్లీ సాస్.. ఇప్పుడిదే ట్రెండ్.. కానీ ఇలా సెక్స్ చేస్తే ఎంత డేంజరో తెలుసా?

Sexual Wellness: కండోమ్‌లో చిల్లీ సాస్.. ఇప్పుడిదే ట్రెండ్.. కానీ ఇలా సెక్స్ చేస్తే ఎంత డేంజరో తెలుసా?

Sexual Wellness: రెడ్ చిల్లీ సాస్‌ను సెక్స్ సమయంలో ఉపయోగించడం వలన.. వీర్యంలో ఉండే శుక్రకణాలు వెంటనే మరణిస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే కండోమ్‌లలో చిల్లీ సాస్ వాడుతున్నారు.

Sexual Wellness: రెడ్ చిల్లీ సాస్‌ను సెక్స్ సమయంలో ఉపయోగించడం వలన.. వీర్యంలో ఉండే శుక్రకణాలు వెంటనే మరణిస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే కండోమ్‌లలో చిల్లీ సాస్ వాడుతున్నారు.

Sexual Wellness: రెడ్ చిల్లీ సాస్‌ను సెక్స్ సమయంలో ఉపయోగించడం వలన.. వీర్యంలో ఉండే శుక్రకణాలు వెంటనే మరణిస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే కండోమ్‌లలో చిల్లీ సాస్ వాడుతున్నారు.

  చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు నేటి కాలంలో అందరూ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్, ఇన్‌స్టగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు ఖచ్చితంగా అందరి ఫోన్లలో ఉంటాయి. అనేక రకాల సమాచారాన్ని ఈ వేదికల ద్వారా పంచుకుంటారు. వార్తలతో పాటు ఆరోగ్యం, లైఫ్ స్టైల్‌కు సంబంధించిన వివరాలు షేర్ చేస్తారు. అందుకే చాలా మంది తమకు ఎలాంటి సమాచారం కావాలన్నా.. సోషల్ మీడియా (Social Media)లో అడుగుతుంటారు. ఇంటర్నెట్‌ను శోధిస్తుంటారు. ఐతే ఇంటర్నెట్‌లో ఉన్నతి ప్రతి సమాచారం సరైనది కాదు. కాదీ ఈ విషయం తెలియక చాలా మంది గుడ్డిగా ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం ఓ ట్రెండ్ సోషల్ మీడియాలో విపరితంగా నడుస్తోంది. రెడ్ చిల్లీ సాస్ కండోమ్‌ల (Red Chilli sauce in condoms) ను వాడితే అవాంఛిత గర్భాన్ని నిరోధించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమని చాలా మంది దీనిని ఫాలో అవుతున్నారు. ఐతే ఈ ట్రెండ్‌పై మెన్స్ హెల్త్ ప్లాట్‌ఫారమ్ డైరెక్టర్, డాక్టర్ ఎరిమ్ చౌదరి వార్నింగ్ ఇచ్చారు. రెడ్ చిల్లీ సాస్ కండోమ్ వాడకం ఎంతటి ప్రమాదకరమో వివరించారు.

  ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే, ఈ డైట్ తప్పక ఫాలో కండి

  గర్భం దాల్చకుండా ఉండేందుకు పొరపాటున కూడా కండోమ్‌కు చిల్లీ సాస్ రాసి వాడకూడదని డాక్టర్ ఎరిమ్ చౌదరి స్పష్టం చేశారు. పడక గదిలో ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ.. ఈ విధానాన్ని మాత్రం అస్సలు అనుసరించవద్దని చెప్పారు. రెడ్ చిల్లీ సాస్‌ను ప్రైవేట్ పార్ట్‌లో రాసుకుంటే ఉత్సాహం తగ్గి.. భరించలేనంత నొప్పి కలుగుతుందని పేర్కొన్నారు. పడకగదిలో ప్రయోగం పేరుతో పానీయలు, పలు తినే పదార్థాలను ఉపయోగించడం చూస్తుంటామని.. అలాగని రెడ్ చిల్లీని వాడవద్దని ఆయన హెచ్చరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. రెడ్ చిల్లీ సాస్‌లో ఉండే మలాసాలు స్త్రీ, పురుషుల మర్మాంగాలకు మంట పుట్టిస్తాయి. వాటి వల్ల శృంగారం సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. పురుషుల ప్రైవేట్ భాగంలో దాదాపు నాలుగు వేల నాడులు ఉంటాయి. అలాగే స్త్రీల ప్రైవేట్ పార్ట్ లో అంతకు రెట్టింపు సంఖ్యలో సున్నితమైన నరాలు ఉంటాయి. అలాంటప్పుడు ఆయా భాగాల్లో రెడ్ చిల్లీ సాస్ పెట్టడం వల్ల కలిగే బాధ.. ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.

  చర్మంపై మొటిమలా తగ్గడం లేదా? ముఖంలో మెరుపు తగ్గిందా? ఇలా చేస్తే అందం మీ సొంతం..

  రెడ్ చిల్లీ సాస్‌ను సెక్స్ సమయంలో ఉపయోగించడం వలన.. వీర్యంలో ఉండే శుక్రకణాలు వెంటనే మరణిస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే కండోమ్‌లలో చిల్లీ సాస్ వాడుతున్నారు. సాధారణంగా చాలా మంది జంటలు గర్భం రాకుండా ఉండేందుకు కండోమ్‌లు వాడుతంటారు. ఐతే ఒక్కోసారి కండోమ్ చిరిగిపోయి పురుషుడి వీర్యం మహిళలోకి ప్రవేశించే అవకాశముంది. అలాంటప్పుడు ఆమె గర్బం దాల్చే అవకాశముంది. ఐతే ఆ అవకాశం లేకుండా ఉండేందుకు.. ఇటీవల కండోమ్‌లను రెడ్ చిల్లీ సాస్‌తో కలిపి వాడడం పెరిగింది. కండోమ్‌లో రెడ్ చిల్లీ సాస్ పోసుకొని లేదా స్త్రీ ప్రైవేట్ పార్ట్‌లో సాస్ రాసి.. పలువురు శృంగారంలో పాల్గొంటున్నారు. ఇప్పుడీ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఐతే ఇది చాలా ప్రమాదకరమని.. ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

  First published:

  Tags: Life Style, Lifestyle, Sex life, Sexual Wellness

  ఉత్తమ కథలు