SEXUAL LIFE IN WOMEN AFTER DELIVERY KNOW HERE MS GH
Sexual Wellness: పిల్లలు పుట్టిన తరువాత శృంగారంలో ఇబ్బందులు ఎదురవుతాయా?
ప్రతీకాత్మక చిత్రం
Sexual Life After Delivery: శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావం వల్ల సెక్స్‌ను ఆస్వాదించలేకపోవచ్చు. పాలు పడటానికి వారి శరీరం ప్రోలాక్టిన్ అనే హార్మోన్‌ను ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. ఇదే సమయంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల యోని పొడిబారుతుంది.
ప్రసవం తరువాత ఎన్ని రోజులకు సాధారణ లైంగిక జీవితాన్ని కొనసాగించాలనే అంశంపై చాలామంది దంపతులకు సరైన అవగాహన ఉండదు. సెక్సువల్ లైఫ్‌ను తిరిగి ప్రారంభించడానికి భార్యాభర్తలిద్దరూ ఏకాభిప్రాయానికి రావాలి. అప్పుడే ఇద్దరూ శృంగారాన్ని ఆస్వాదించగలుగుతారు. పాలిచ్చే తల్లులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెక్స్‌లో పాల్గొనవచ్చు. కానీ ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ప్రసవం తరువాత మహిళల్లో అనారోగ్యాలు, శారీరక ఇబ్బందులు లేనప్పుడు సెక్స్ వల్ల వారికి ఎలాంటి సమస్యలూ ఎదురుకావు. కానీ పాలిచ్చే తల్లులకు గతంలో మాదిరిగా కోరికలు కలగకపోవచ్చు.
అంతేగాక శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావం వల్ల సెక్స్‌ను ఆస్వాదించలేకపోవచ్చు. పాలు పడటానికి వారి శరీరం ప్రోలాక్టిన్ అనే హార్మోన్‌ను ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. ఇదే సమయంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల యోని పొడిబారుతుంది. ఇలాంటప్పుడు సెక్స్‌లో పాల్గొనడం వారికి ఇబ్బందిగా అనిపించవచ్చు. యోని పొడిబారే సమస్యలు ఉంటే ల్యూబ్రికెంట్ను ఉపయోగించాలి. ప్రసవం తరువాత లైంగిక సంబంధాలను ప్రారంభించడానికి ముందు ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.
అలా చేయవద్దు
ప్రసవం తరువాత బిడ్డకు పాలిచ్చేలా తల్లి శరీరం రూపాంతరం చెందుతుంది. వారి రొమ్ములు చాలా సున్నితంగా మారుతాయి. గతంలో మాదిరిగా రొమ్ములు, చనుమొనలను సృశిస్తూ శృంగాన్ని ఆస్వాదించాలనుకుంటే.. వారికి నొప్పితో పాటు అసౌకర్యంగా అనిపించవచ్చు. అందువల్ల వారికి ఇబ్బంది కలిగించే ఇలాంటి కోరికలను, చర్యలను మగవాళ్లు మానుకోవాలి. సెక్స్‌లో ఉద్దీపనలు కలిగించే బ్రెస్ట్ స్టిములేషన్కు దూరంగా ఉండటం మంచిది. సెక్స్ చేసేటప్పుడు భాగస్వామి రొమ్ముల్లో అసౌకర్యం కలగకుండా మగవాళ్లు జాగ్రత్తపడాలి.
ఆ జాగ్రత్తలు కూడా..
సాధారణంగా పాలుపట్టే తల్లులు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు రొమ్ముల నుంచి పాలు లీక్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రసవం తరువాత సెక్స్ చేసేటప్పుడు బ్రెస్ట్, నిపుల్ స్టిములేషన్కు దూరంగా ఉండాలి. ఇలాంటి ఇబ్బందులను శృంగారానికి అడ్డంకిగా భావించకూడదు. రొమ్ములకు బదులుగా వారికి ఉద్దీపనలు కలిగించే ఇతర శరీర భాగాలపై దృష్టి పెట్టాలి. మెడ, ఈయర్ లోబ్, నడుము, బొడ్డు వంటి ఎరోజెనస్ జోన్లను సెక్సువల్ స్టిములేషన్ కోసం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రసవానంతరం భర్తలు ఆడవాళ్ల శారీరక సమస్యలను అర్థం చేసుకుంటేనే లైంగిక జీవితం సజావుగా సాగుతుంది.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.