వయస్సు ప్రభావంతో లైంగిక సామర్థ్యం తగ్గుతోందా...అయితే ఇది మీకే..?

పురుషుల్లో వయస్సు 40 దాటిన తర్వాత సెక్స్ పట్ల అంతగా ఆసక్తి చూపరు. ఇక స్త్రీలలో అయితే రుతుక్రమం ఆగిపోయే ముందు కూడా సెక్స్ పట్ల ఆసక్తి ఉండదు. అయితే వీటిని అధిగమించాలంటే మాత్రం, దంపతులు కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించాల్సిందే...

news18-telugu
Updated: July 22, 2019, 10:03 PM IST
వయస్సు ప్రభావంతో లైంగిక సామర్థ్యం తగ్గుతోందా...అయితే ఇది మీకే..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దాంపత్య బంధంలో అత్యంత ముఖ్యమైనది శృంగార జీవితమే. అయితే వయస్సు ప్రభావంతో స్త్రీ పురుషులిద్దరిలోనూ సెక్స్ కోరికలు తగ్గిపోతుంటాయి. అంతే కాదు ఒక్కోసారి కోరికలున్నా సెక్స్ చేసే సామర్థ్యం తగ్గిపోతుంటుంది. ముఖ్యంగా స్త్రీలలో రుతు సమస్యలు కారణమైతే, పురుషుల్లో వయస్సు మీద పడటంతో శృంగారం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. అయితే శృంగార జీవితం కంటిన్యూ చేస్తే అనేక లాభాలుంటాయని డాక్టర్లు సెలవిస్తున్నారు. ముఖ్యంగా పురుషుల్లో వయస్సు 40 దాటిన తర్వాత సెక్స్ పట్ల అంతగా ఆసక్తి చూపరు. ఇక స్త్రీలలో అయితే రుతుక్రమం ఆగిపోయే ముందు కూడా సెక్స్ పట్ల ఆసక్తి ఉండదు. అయితే వీటిని అధిగమించాలంటే మాత్రం, దంపతులు కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించాల్సిందే...

ఫోర్ ప్లేతో సమస్యలు దూరం: శృంగారం చేసేందుకు దంపతులకు ఫోర్ ప్లే అనేది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా జంటలో ఇద్దరి మధ్య ప్రేమ పెంచేందుకు ఇది దోహదపడుతుంది. అలాగే శరీరంలో కామోద్రేకం కలిగించే హార్మోన్స్ విడుదలకు సైతం ఇది ఉపయోగ పడుతుంది. ఎంత ఎక్కువ సేపు ఫోర్ ప్లే చేస్తే అంత ఎక్కువ ఆనందం పొందవచ్చు.

కళ్లు మూసుకోవద్దు: కళ్లు మూసుకొని, చీకటిలో శృంగారం చేయడం చాలా మంది చేసే పని. అయితే ఇలా చేయడం వల్ల శృంగారం పట్ల రాను రాను ఆసక్తి తగ్గిపోతుంది. దీనికి మందు ఎంచక్కా లైట్ వేసుకొని ఒకరిని ఒకరు చూసుకుంటూ, కళ్లల్లో కళ్లు పెట్టి ఊసులాడుకుంటూ శృంగారం చేస్తే కొత్త అనుభవం దక్కుతుందని చెబుతున్నారు. అంతేకాదు చీకటి సమయంలోనే కాదు. ఉదయం పూట సెక్స్ చేస్తే శరీరంలో హార్మోన్స్ సమతూకంగా విడుదలై ఇద్దరికి సంతృప్తి దక్కుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రొటీన్ కు భిన్నంగా : సెక్స్ పొజీషన్స్ మార్చడం ద్వారా కూడా కొత్త అనుభవాన్ని పెంచుకునే వీలుంది. మన ప్రాచీన గ్రంథం కామసూత్రలో ఇందుకు తగినన్ని పొజిషన్స్ ఉన్నాయి. అయితే వయస్సు పెరిగింది కదా అని వయాగ్రా లాంటి అసహజ పద్ధతుల జోలికి వెళితే మాత్రం జబ్బులు తప్పవు. అయితే బీపీ, డయాబెటిస్ కంట్రోల్ లో ఉంచుకుని శృంగారం చేస్తే మాత్రం ఆరోగ్యం హాయిగా ఉంటుందని డాక్టర్లు సెలవిస్తున్నారు.

First published: July 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు