పని ఒత్తిడి నుంచి రిలీఫ్ కావాలంటే...శృంగారమే గతి అంటున్న సైంటిస్టులు...?

నిజానికి మనిషికి ఆకలి, నిద్ర ఎంతో శృంగారం కూడా అంతే అవసరం. దంపతులు తమ ప్రశాంత జీవితాన్ని కొనసాగించాలంటే శృంగారమే గతి అని పలు అధ్యయనాలు తేల్చాయి.

news18-telugu
Updated: July 19, 2019, 10:52 PM IST
పని ఒత్తిడి నుంచి రిలీఫ్ కావాలంటే...శృంగారమే గతి అంటున్న సైంటిస్టులు...?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 19, 2019, 10:52 PM IST
శృంగారంలో జోరు పెంచితే ఎంతటి ఒత్తిడి నుంచి అయినా బయటపడవచ్చని పరిశోధకులు తేల్చుతున్నారు. నిజానికి మనిషికి ఆకలి, నిద్ర ఎంతో శృంగారం కూడా అంతే అవసరం. దంపతులు తమ ప్రశాంత జీవితాన్ని కొనసాగించాలంటే శృంగారమే గతి అని పలు అధ్యయనాలు తేల్చాయి. ముఖ్యంగా పని ఒత్తిడిలో అలసి పోయిన వారికి శృంగారం బూస్ట్ లాంటిందని పరిశోధనలు తేల్చాయి. ప్రధానంగా రోజంతా ఆఫీసులు అలసిపోయి, సాయంకాలం అలసటతో ఇంటికి చేరుకునేవారికి శృంగారం ద్వారా పోయిన ఉత్సాహం తిరిగి రావడంతో, మరుసటి రోజు రెట్టించిన ఉత్సాహంతో పనికి రెడీ అయిపోతారని సైంటిస్టులు తేల్చారు.

అమెరికాలోని ఓరెగాన్ విశ్వవిద్యాలయంలో మొత్తం 80 జంటలపై ప్రయోగం చేయగదా, అందులో స్త్రీ, పురుషులిద్దరిలో సెక్స్ చేసే సందర్భాల్లో శరీరంలో డోపమైన్, ఆక్సిటోసిన్ విడుదల అవుతాయని అవి మానసిక ఒత్తిడి దూరం చేసి పాజిటివ్ మూడ్ క్రియేట్ చేస్తాయని తేల్చారు. రాత్రంతా శృంగారం చేసిన దంపతులు ఉదయాన్నే ఉత్సాహంతో పనిలో బిజీ అవుతున్నారని పరిశోధనల్లో తేల్చారు.

First published: July 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...