తొలిసారి శృంగారంలో పాల్గొంటున్నారా.. ఈ సూచనలు కచ్చితంగా పాటించండి..

Sex Education : పడకగదిలోకి వెళ్లేముందే సెక్స్‌కు సంబంధించిన విషయాలు కొన్నైనా తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా తొలిసారి సెక్స్‌లో పాల్గొనేవారు చాలా తప్పులు చేస్తుంటారు.

news18-telugu
Updated: September 11, 2019, 4:15 PM IST
తొలిసారి శృంగారంలో పాల్గొంటున్నారా.. ఈ సూచనలు కచ్చితంగా పాటించండి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 11, 2019, 4:15 PM IST
శృంగారం అనేది ఒక కళ.. ఫోర్ ప్లే నుంచి సంభోగం చేసే వరకు ప్రతి సందర్భమూ హాయిగా, ఆనందంగా ఆస్వాదించదగినదే. అది కలిగించే అనుభూతి అత్యంత మధురమైనది. ఈ సృష్టి కార్యం స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని వెయ్యి రెట్లు ఎక్కువ చేయగలదు. వాత్సాయనుడు కామసూత్ర పేరుతో ఓ పుస్తకమే రాశాడంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఈ ప్రక్రియలో ఎంత విషయం ఉందోనని. 1250 పద్యాలు, 36 విభాగాలు, 7 భాగాలుగా రాసిన ఈ పుస్తకంలో కామవాంఛ ఏ స్థాయిలో, ఏ పద్ధతిలో, ఏ రూపంలో ఉంటుందో స్పష్టంగా విడమర్చి చెప్పాడు. సంభోగం ఒక్కటే సెక్స్ అనుకుంటే అంతకుమించిన తప్పు మరొకటి ఉండదు. అందుకే పడకగదిలోకి వెళ్లేముందే సెక్స్‌కు సంబంధించిన విషయాలు కొన్నైనా తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా తొలిసారి సెక్స్‌లో పాల్గొనేవారు చాలా తప్పులు చేస్తుంటారు. మనం పెరిగిన పరిస్థితులు, సంస్కృతి వల్ల సెక్స్‌పై అవగాహన లేకపోవడం.. తద్వారా తప్పులు జరగడం సహజమే. అందుకే తొలిసారి సెక్స్ చేయబోయే ముందు కొన్ని కీలక విషయాలు తెలుసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.తొలిసారి సెక్స్‌లో పాల్గొనబోయే వ్యక్తులు.. తొలిరాత్రి అనుభూతుల గురించి ఎవరో చెప్పినవి విని, వారికి జరిగినట్లే మనకూ జరుగుతుందనుకోవడం తప్పు. వీలైనంత వరకు ఆ మాటల్ని మర్చిపోతేనే మేలు. మీడియాలోనో, సమాజంలోనో ఎవరో ఒకరు తొలి సెక్స్ గురించి చెబుతూ ఉంటారు. వాటిని పట్టించుకోవద్దు. ముఖ్యంగా ‘ఎక్స్‌పెక్టేషన్’.. ఏదో ఆశించడం మానుకోవాలి. తొలి సారి అనుభవించే సెక్స్ అంత సక్సెస్ ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ అనేది కుంగదీస్తుంది. ఇక, రెండోది.. ఏ రకం సెక్స్‌ను కోరుకుంటున్నారనేది కీలకం. తొలిసారి ఓరల్ సెక్స్ చేయాలని కోరుకుంటున్నారా? నగ్నంగా ఉండాలని కోరుకుంటున్నారా? సంభోగం చేయాలనుకుంటున్నారా? లేక అన్ని ప్రక్రియలను ఆస్వాదించానుకుంటున్నారా? అనే దానిపై కొంతైనా స్పష్టత ఉండాలి. ఇక్కడ.. లక్ష్యాన్ని పూర్తి చేశామా? లేదా? అన్నది చూడకూడదు.
వాటిపై స్పష్టత లేకపోతే.. కొంత సమయం తీసుకొని, సెక్స్‌పై ఆత్మశోధన చేసుకోవాలి. ఏ ప్రక్రియ ఎక్కువ ప్రేరేపించేలా చేస్తుంది? ఎలా అయితే ఎక్కువ సంతృప్తి పొందగలుతాం? అనేది పరిశీలించుకోవాలి. శరీరంలో ఎక్కడ తాకితే బాగా అనిపిస్తుంది.. తదితర విషయాలు మనకు మనం తెలుసుకోగలిగితే మంచిది. అత్యంత కీలకమైనది ఏంటంటే.. భాగస్వామి. సెక్స్‌లో పాల్గొనబోయే భాగస్వామితో సేఫ్‌గా, సౌకర్యవంతంగా ఉంటామా? అనేది చూసుకోవాలి. సౌకర్యవంతంగా ఉంటే శృంగారాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేసే అవకాశాలుంటాయి. అదే, సేఫ్టీ, కంఫర్ట్ లేకపోతే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. ఆతృతతో ఏ పని చేయకూడదు. వర్తమానంలోనే ఉంటూ నెమ్మదిగా ప్రక్రియలను మొదలు పెట్టాలి.సురక్షితమైన శృంగారం చాలా ముఖ్యం. ఓరల్ సెక్స్ చేసేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ రాకుండా ముందుగా జననాంగాలను శుభ్రం చేసుకోవాలి. భాగస్వామికి ఇష్టం కలిగించేలా వ్యవహరిస్తూ, దాని వల్ల కలిగే భావప్రాప్తిని తెలియజెప్పాలి. కండోమ్స్, బర్త్ పిల్స్ వంటివి వాడకాన్ని గుర్తుంచుకోవాలి. సేఫ్ సెక్స్ గురించి మాట్లాడటం గురించి ఎలాంటి దాపరికం ఉండకూడదు. క్షణం పాటు సుఖం కోసం రోగాల బారిన పడవద్దు. అన్నింటికంటే.. గతంలో ఏవైనా లైంగిక వేధింపులు ఎదురైనవి గుర్తొస్తే.. అలాంటివి భాగస్వామితో చెప్పి, వాటిని మరిపించేలా చేయాలని కోరితే తప్పేమీ లేదు. అయితే, దానికీ బౌండరీ అనేది ఉంటుంది. కొందరు వాటిని పాజిటివ్‌గా తీసుకునే అవకాశం లేదు. అందుకే భాగస్వామి వ్యక్తిత్వాన్ని బట్టి చెప్పడం మేలు.
Loading...


తర్వాత.. ఫోర్ ప్లేపై ఎక్కువగా దృష్టి సారించాలి. చుంబనాలు, ఇరువురు టచ్ చేసుకోవడం లాంటివి చేయాలి. దానివల్ల సెక్స్‌ కోరికలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. అలా చేయడం వల్ల స్త్రీల జననాంగాల్లో సహజంగానే ల్యూబ్రికేషన్ పుడుతుంది. ఆ తర్వాత.. సంభోగం జరిపే సమయంలో గాయాలు కాకుండా ఉండేందుకు ల్యూబ్(జారుడు గుణం కలిగే తైలాలు) వాడటం చాలా మంచిది. చివరగా.. సెక్స్ చేసే సమయంలో శరీరం ఇక్కడ.. మనసు ఎక్కడో అన్నట్లు ఉండకూడదు. దాని వల్ల సెక్స్‌ను ఆనందంగా అనుభవించలేరు. సెక్స్ పొజిషన్స్‌పైనా ఫోకస్ పెడితే మీ ఆనందానికి అవధులు ఉండవని నిపుణులు వెల్లడించారు.
First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...