Increase Sperm Count: స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 7 సహజ మార్గాలు

Ways to increase sperm count naturally : ప్రతి దానికీ టాబ్లెట్లు, ఇంజెక్షన్లూ వాడటం మంచిది కాదు. సమస్య ఎక్కడుందో కనిపెట్టి... అది ఎందుకొచ్చిందో తెలుసుకొని... ఆ దిశగా పరిష్కారాలు ఆలోచించుకుంటే... ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 9, 2020, 3:21 AM IST
Increase Sperm Count: స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 7 సహజ మార్గాలు
స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 7 సహజ మార్గాలు
  • Share this:
సహజంగానే శుక్రకణాల సంఖ్య పెంపుదల : ఈ రోజుల్లో ఇదో పెద్ద సమస్య. చాలా మంది బయటకు చెప్పుకోలేక, ఏం చెయ్యాలో తెలియక... కొంత మంది డాక్టర్లు చెప్పే మందులు వాడుతూ ఉన్న ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. సమస్యేంటంటే... అసలు శుక్రకణాల సంఖ్య ఎందుకు తగ్గుతోందో, అందుకు కారణాలేంటో మగవాళ్లకు తెలియాలి. అది తెలిస్తే... తగిన చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. నిజానికి ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రతీ ఆరుగురిలో ఒక మగాడికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటోంది. ఐతే... చర్యలు తీసుకున్నంతమాత్రాన అందరికీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందన్న గ్యారెంటీ లేదు. కాకపోతే... సహజ చర్యల వల్ల చాలా మందికి ఫలితం కనిపిస్తోంది. అందుకే ఆ 7 సహజ పద్ధతులు తెలుసుకుంటే మంచిదే.

1.ఎక్సర్‌సైజ్ అండ్ స్లీప్ : బరువు అధికంగా ఉంటే, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతోంది. అందువల్ల బరువు తగ్గాలి. నడవాలి, పరిగెత్తాలి, ఎక్సర్‌సైజ్‌లు చెయ్యాలి. ఒళ్లు వంగేలా చేసుకోవాలి. బట్టలు ఉతకడం, బూజు దులపడం, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఇలాంటి పనులు మనమే చేసుకుంటే... ఒంట్లో కొవ్వు కచ్చితంగా కరుగుతుంది. రోజూ కనీసం 50 నిమిషాలు ఇలాంటి పనులు చెయ్యాలి. తద్వారా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. నిద్ర కూడా బాగా నిద్రపోవాలి. నిద్ర ఎంత ఎక్కువగా ఉంటే... మనుషులు అంత బాగా బరువు తగ్గుతారు.

2. ఒత్తిడి తగ్గాల్సిందే : ఒత్తిడి వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అందువల్ల మగాళ్లు టెన్షన్ పడకూడదు. పాటలు వినాలి. సూర్యోదయం, సూర్యాస్తమయం చూడాలి. ప్రకృతిలో తిరగాలి. పెంపుడు జంతువులతో గడవాలి. ఆడాలి, పాడాలి. మంచి సంగీతం వింటూ కాసేపు గడపాలి. ఇంట్లో వాళ్లతో కలిసి... కాసేపు ఉండాలి. ఇవన్నీ ఒత్తిడిని తగ్గిస్తాయి. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఒత్తిడి తగ్గాలని మందులు వాడితే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.

3. పొగ తాగొద్దు : పొగ తాగేవాళ్లను మగాళ్లలా చూడటం ఓ దరిద్రపు సంస్కృతి. నిజానికి పొగ తాగేవాళ్లలో మగతనం తగ్గిపోతుంది. ఎంతలా స్మోకింగ్ చేస్తే... అంతలా శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది. సో... స్మోకింగ్ వదిలెయ్యడమే. మనసులో బలంగా అనుకుంటే ఏదైనా సాధ్యమే.

4. మద్యం, మత్తు పదార్థాలు వద్దు : స్పెర్మ్ కౌంట్ తగ్గించేవాటిలో ముందుంటాయి మద్యం, మత్తు పదార్థాలు. మందుబాబులు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడం కంటే ఏదీ ముఖ్యం కాదు కదా. మద్యాన్ని వదిలెయ్యడమే. దాన్ని వదిలేస్తే అన్నీ లాభాలే కదా. ఇక గంజాయి, ఇతరత్రా మత్తు పదార్థాలు కూడా అస్సలు వాడకూడదు. ఇవన్నీ తీసుకునే బదులు ఫ్రూట్లు తినొచ్చు. జ్యూస్‌లు (షుగర్ వేసుకోకుండా) తాగొచ్చు. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల రుచులున్నాయి. అవన్నీ టేస్ట్ చూడొచ్చు. మద్యాన్ని వదిలేస్తేనే మేలు.

5.విటమిన్స్ తగ్గకూడదు : కొంతమందికి విటమిన్ D, కాల్షియం సమస్యలుంటాయి. వాటి కోసం టాబ్లెట్లు వాడమని డాక్టర్లు చెబుతారు. అలాంటప్పుడు అవి వాడటమే మేలు. డాక్టర్ల సలహాలు పాటిస్తేనే బాడీకి కావాల్సిన విటమిన్స్ అందుతాయి. అప్పుడు స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. విటమిన్ డి, కాల్షియం టాబ్లెట్లను డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా కొనుక్కోవచ్చు.

6.మంచి ఆహారం తినాలి : ఈ వేపుళ్లు, ఫ్రైలు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌ల వంటివి ఎంత తగ్గిస్తే అంత మేలు. ఇవన్నీ బాడీలో కొవ్వును పెంచడానికే పనికొస్తాయి. వీటి బదులు యాంటీఆక్సిడెంట్స్ పుల్లుగా ఉండే ఫ్రూట్స్, కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఉడకబెట్టిన ఆహారమే మనకు సరైనది. అదే ఎన్నో రోగాల్ని తరిమికొడుతుంది.7. అశ్వగంధ వాడండి : అశ్వగంధ అనేది ఆయుర్వేద మూలిక. ఇది ఎంత మంచిదంటే... మగాళ్లకు ఇదో దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు. 2016లో 46 మంది మగాళ్లపై దీన్ని ప్రయోగించారు. రోజూ 675 మిల్లీగ్రాముల ఆశ్వగంధను తీసుకోమని చెప్పారు. ఇలా 90 రోజులు తీసుకున్నారు. వాళ్లందరిలోనూ శుక్రకణాల సంఖ్య 167 శాతం పెరిగింది. ఇంతకంటే ఏం కావాలి. అందుకే ఆశ్వగంధ ఓ అద్భుతమన్నమాట. మార్కెట్‌లో ఆశ్వగంధ పొడి డబ్బా దొరుకుతుంది. దాన్ని కొనుక్కొని... రోజూ పాలలో కలిపి తాగేస్తే సరి. ఇక సంతాన సాఫల్యమే.
Published by: Krishna Kumar N
First published: September 9, 2020, 3:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading