Pumpkin seeds: గుమ్మడికాయ గింజలతో 7 ఆరోగ్య ప్రయోజనాలు

గుమ్మడికాయ గింజలతో 7 ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Pumpkin seeds : కొన్ని రకాల ఆహారాల్ని మనం లైట్ తీసుకుంటాం. వాటిలో గుమ్మడికాయ ఒకటి. అది ఎందుకూ పనికిరానిదని కొందరి ఫీలింగ్. దిష్టి తియ్యడానికే దాన్ని వాడతారని చాలా మంది అనుకుంటారు. దాని గింజలతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే, ఆశ్చర్యం కలగడం సహజం.

 • Share this:
  Health benefits of Pumpkin seeds : ఫిట్‌గా ఉండాలి, మంచి ఆహారం తినాలి అనుకుంటారు చాలా మంది. ఐతే... కొందరు మాత్రమే ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. చాలా మంది రోడ్లపై కనిపించే, దుమ్ము పడే ఆహారాన్ని తెలియక తినేస్తుంటారు. నోటికి రుచికరంగా ఉండే ఆ ఆహారం... మన శరీరానికి ఎంతవరకూ ఆరోగ్యకరమో ఆలోచించేది కొందరే. కానీ ఆరోగ్యమే అన్నిటికంటే ముఖ్యమైనది. అనారోగ్యం వస్తే... ఒక్కోసారి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఫలితం ఉండదు. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అన్నింటికంటే ముఖ్యం. మంచి ఆహారం తినాలి. బాడీకి అన్ని రకాల పోషకాలూ అందాలి. అలాంటి ఉద్దేశంతో ఉన్నవారు గుమ్మడికాయ గింజల్ని తినడం మేలు. వాటిలో మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్స్, జింక్ వంటి పోషకాలుంటాయి. అందుకే మనం పంప్కిన్ (Pumpkin) సీడ్స్ రోజూ తింటే మంచిదే.

  Good for your bones : గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఉంది కదా... అది మన ఎముకల తయారీకి చాలా అవసరం. ఎంత ఎక్కువ మెగ్నీషియం తీసుకుంటే, అంతలా ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. అప్పుడు అస్థియోపోరోసిస్ (ఎముకలు చిట్లిపోవుట) వంటి వ్యాధులు దరిచేరవు.

  గుమ్మడికాయ గింజలతో 7 ఆరోగ్య ప్రయోజనాలు


  Reduce blood sugar level : చాలా మంది డయాబెటిస్‌తో బాధపడేవారికి... బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండవు. ఈ చిన్న గింజలు తింటే మాత్రం ఫలితం ఉంటుంది. ఎలుకలపై ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు వాటి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయి. అందువల్ల మనుషులపైనా ఇవి చక్కగా పనిచేస్తాయంటున్నారు డాక్టర్లు.

  Good for heart health : ఈ గింజల్లో యాంటీఆక్సిడెంట్స్, మెగ్నీషియం, జింక్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయిగా... అవన్నీ గుండెకు మేలు చేస్తాయి. ఈ గింజల్లో... నీటిలో కరిగిపోయే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

  Help to lose weight : ఈ గింజల్లో ఫైబర్ ఉంటుంది. అది బరువు పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. కొన్ని గింజలు తిన్నా చాలు పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. అందువల్ల ఇతరత్రా తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు... ఈ గింజలు జీర్ణక్రియను కూడా మంచిగా చేస్తాయి.

  Improve your sleep quality : కొంతమందికి రాత్రిళ్లు నిద్ర పట్టదు. కళ్లు ముయ్యగానే ఏవేవో ఆలోచనలు మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ఏం చెయ్యాలో తెలియక నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లు గుమ్మడికాయ గింజలు తింటే సరి. వీటిలో ట్రైప్టోఫాన్ ఉంటుంది. అది నిద్ర వచ్చేలా చేస్తుంది. ఇన్సోమ్నియా (నిద్రలేమి) సమస్యకు చెక్ పెట్టాలంటే పంప్కిన్ సీడ్స్ తినెయ్యడమే.

  గుమ్మడికాయ గింజలతో 7 ఆరోగ్య ప్రయోజనాలు


  Builds immunity : కెరాటెనాయిడ్స్, విటమిన్ E వంటి యాంటీఆక్సిడెంట్స్ ఉండే ఈ గింజలు... మన బాడీలో వేడిని తగ్గిస్తాయి. కణాల్ని విష సూక్ష్మక్రిముల నుంచీ కాపాడతాయి. రోజూ ఈ గింజలు తింటే... జలుబు, జ్వరం వంటివి కూడా రావు.

  Hair growth : ఈ గింజల్లో కుకుర్బిటిన్ (ఇదో రకం అమైనో యాసిడ్) ఉంటుంది. అది జుట్టును పెరిగేలా చేస్తుంది. అలాగే జుట్టు... మన టీమిండియా జట్టులా బలంగా, ఒత్తుగా తయారవుతుంది.

  How to eat pumpkin seeds : ఈ గింజలు ఎలా తినాలి అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. వాటిని పచ్చిగా ఉన్నవే తినవచ్చు. లేదా వేపుకొని... సాయంత్రం వేళ స్నాక్స్‌లా తినవచ్చు. అంతే కాదు... సలాడ్లు, సూప్‌లలో కూడా వాటిని వేసుకొని తినవచ్చు. ఎలా తిన్నా, తినడం ముఖ్యం.
  Published by:Krishna Kumar N
  First published: