కొందరు ప్రజలు వెన్నునొప్పి, మడమ నొప్పి, కాళ్లు, కీళ్ల నొప్పులు, పంటి నొప్పి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల నొప్పుల (Pains)తో బాధపడుతుంటారు. నొప్పి తీవ్రమైతే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది పెయిన్ కిల్లర్స్ అని చెప్పవచ్చు. అయితే పెయిన్‌కిల్లర్స్ మెడిసిన్స్ తరచూ వాడుతుంటే ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువ. ప్రిస్క్రిప్షన్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదమెక్కువ. అందుకే వాటికి ప్రత్యామ్నాయంగా సహజసిద్ధమైన నొప్పి నివారణ ( Natural Painkillers)లను వాడటం మంచిది. నిజానికి మన వంటింట్లో (Kitchen)నే ఏ నొప్పి నుంచైనా ఉపశమనం కలిగించే సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్ దొరుకుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* అల్లం
అల్లం, కీళ్ల కండరాల నొప్పులకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అల్లంలో ఉండే ఫైటోకెమికల్స్ నొప్పిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తి, విడుదలను నియంత్రిస్తుంది. వికారం, మార్నింగ్ సిక్‌నెస్‌తో ఇబ్బంది పడే వారికి కూడా అల్లం ఉత్తమ ఔషధంగా నిలుస్తుంది. అల్లాన్ని ఆహారంలో కూడా కలిపి తీసుకోవచ్చు. అల్లం టీ తరచూ సేవించడం ద్వారా శరీరంలో ఉత్సాహం ఉరకలేస్తుంది.
* పసుపు
దాదాపు అందరి వంటగదుల్లో పసుపు తప్పకుండా ఉంటుంది. పసుపులో లభించే యాంటీసెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఫంగల్ వంటి ఎన్నో ఔషధ లక్షణాలు మనకి ఎంతో మేలు చేస్తాయి. పాలలో పసుపు కలిపి తీసుకుంటే శరీరంలో అన్ని గాయాలు నయమవుతాయి. నోటి పూత లేదా నోటిలో పుండ్లతో బాధపడుతున్న వారికి కూడా పసుపు దివ్యౌషధంగా పనిచేస్తుంది. నీరు, కొబ్బరి నూనెతో పసుపుని పేస్ట్‌గా చేసి నోట్లో పుండ్లు అయిన చోట ఆ పేస్టు రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్న పసుపుని గాయంపై రాయడం ద్వారా గాయం వెంటనే మానిపోతుంది. బాగా జలుబు చేసి ముక్కుదిబ్బడతో బాధపడుతున్న వారికి కూడా పసుపు చక్కగా పనిచేస్తుంది.
* తులసి
తులసి ఓ ఔషధ మూలిక. ఆయుర్వేద ఔషధాలను తయారు చేయడానికి తులసి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఔషధమూలిక అనాల్జేసిక్/బాధానివారిణిగా పనిచేస్తుంది. కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి కాకుండా తులసి నివారించగలదు.
* లవంగాలు
వాంతి వచ్చేటట్టు అనిపించినప్పుడు ఒకటి లేదా రెండు లవంగాలను నమలడం లేదా నోటిలో ఉంచుకోవడం ద్వారా ఆ ఫీలింగ్ నుంచి బయట పడవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్‌లతో బాధపడుతున్న వారు లవంగం నూనెను వాడితే చక్కటి ఫలితం కనిపిస్తుంది. లవంగం నూనెలో ఉండే యూజీనాల్ అనే పదార్ధం సహజంగా రక్తాన్ని పలుచన చేస్తుంది. ఈ లక్షణం వల్ల శరీరంలో రక్తం గడ్డ కట్టింది. ఫలితంగా హృదయ సంబంధిత వ్యాధులు దరిచేరవు.
* పెరుగు
పాశ్చరైజ్ చేయని, రుచిలేని పెరుగు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఉబ్బరం వల్ల వచ్చిన వాపు, నొప్పి లక్షణాలను చాలా వరకు తగ్గుతాయి. ఈ పెరుగులో జీర్ణక్రియ ప్రక్రియకు సహాయపడే హెల్దీ ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రతిరోజు రెండు గ్లాసుల పెరుగు తీసుకోవడం ద్వారా కడుపు నొప్పిని వదిలించుకోవచ్చు. నెలసరి వల్ల వచ్చే తిమ్మిరి, నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
* వెల్లుల్లి
వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచి, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను 10 నుండి 15% వరకు తగ్గిస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. తాజా వెల్లుల్లిని కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటే పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీబయాటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. వెల్లుల్లి తరచూ తినడం ద్వారా డిమెన్షియా, అల్జీమర్స్ వంటి మానసిక వ్యాధులను అరికట్టవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Curd, Ginger, Health Tips, Kitchen tips