హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Stop Hair fall Naturally: జుట్టు రాలకుండా చేసే అద్భుతమైన 7 చిట్కాలు

Stop Hair fall Naturally: జుట్టు రాలకుండా చేసే అద్భుతమైన 7 చిట్కాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో జుట్టు రాలడం అన్నది కామన్ సమస్య. తీసుకునే ఆహారం, వర్క్ టెన్షన్లు, విశ్రాంతి లేకపోవడం ఇలా ఎన్నో కారణాలు జుట్టు ఊడిపోయేలా చేస్తున్నాయి. ఐతే కొన్నేళ్లుగా పరిశోధనలు చేసిన డాక్టర్లు ఏడు కీలకమైన సూత్రాల్ని పాటిస్తే, జుట్టు రాలే సమస్య పూర్తిగా తొలగిపోతుందని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

జుట్టు రాలుతోందని తెలిస్తే చాలు ఏదో ఆందోళన. మన దగ్గర నుంచీ ఏదో దూరమైపోతోందన్న ఇబ్బంది. వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతున్నా, బట్టతల వస్తున్నట్లు అనిపిస్తున్నా, తమకు తెలియకుండానే ఒక రకమైన టెన్షన్‌లో పడిపోతుంటారు చాలా మంది. ఇక జీవితం ముగిసిపోయినట్లుగా, ముసలితనం వచ్చేసినట్లుగా రకరకాలుగా ఊహించుకుంటూ, తమలో తామే కుమిలిపోతుంటారు. జుట్టు రాలకుండా ఉండేందుకు ఏం చెయ్యాలా అని రకరకాల షాంపూలూ, క్రీములూ వాడతారు. అవేవీ పనిచెయ్యకపోతే, చివరకు హెయిర్ లాస్ ట్రీట్‌మెంట్లు కూడా చేయించుకుంటారు. అయినా సంతృప్తి కలగదు. ఇంతలా వేధిస్తున్న ఈ సమస్య ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉంది. కొన్ని కోట్ల మందిని జుట్టు రాలే సమస్య వెంటాడుతోంది.

జుట్టు రాలడం సాధారణ సమస్యే అని తేలిగ్గా తీసుకుందామన్నా, పక్కనే ఉండే స్నేహితులు, తోటివారు పదే పదే జుట్టు రాలిపోతోందని గుర్తు చేస్తుంటే, కలిగే అసౌకర్యం మాటల్లో చెప్పలేనిది. సాధారణంగా ఆడవాళ్లైనా, మగవాళ్లైనా రోజూ 50 నుంచీ 100 వెంట్రుకలు రాలిపోతాయి. ఇది కొంత మందిలో వంశ పారంపర్యంగా వచ్చే సమస్య. పెద్దవాళ్లకు బట్టతల ఉంటే, వారి పిల్లలకు కూడా అది వచ్చే అవకాశాలుంటాయి. ఐతే... కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, జుట్టు రాలే సమస్యను చాలా వరకూ తగ్గించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఇలా చేస్తే జుట్టును కాపాడుకున్నట్లే :

* విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నువ్వులనూనెను తలకు బాగా పట్టించి, కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే క్రమంగా జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది.

* మందార పువ్వులను, కొబ్బరినూనె లేక నువ్వుల నూనెలో వేసి కాచి, ఆ నూనెను వెంట్రుకలకు పట్టించి ఒక గంట తర్వాత కుంకుడు రసంతో స్నానం చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.

* మందార ఆకులను మెత్తగా నూరి, తలకు బాగా పట్టించి కాసేపటి తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఊడదు.

* ఉసిరి రసం తీసి తలకి రాస్తే వెంట్రుకలు ఊడడం తగ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

* దోస గింజలు ఎండబెట్టి, దంచి, నూనె తీసి, దాన్ని నిమ్మరసంతో కలిపి తలకు రాస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.

* చేమ దుంపల రసం తీసి తలకు రాస్తే జుట్టు ఊడటం ఆగిపోతుంది.

* నాలుగు టీ స్పూన్ల కొబ్బరి పాలలో, ఒక స్పూను నిమ్మరసం కలిపి, తలకు బాగా పట్టించి, కాసేపయ్యాక తలస్నానం చేస్తే జుట్టు రాలదు.

ఈ చిట్కాల్లో ఎన్ని వీలైతే అన్ని పాటించాలని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు. ఇంత చేసినా జుట్టు రాలడం ఆగకపోతే, డాక్టర్‌ను సంప్రదించడం సరైన మార్గమంటున్నారు పరిశోధకులు. డాక్టర్లు తగిన కారణాల్ని తెలుసుకొని, అందుకు తగిన ట్రీట్‌మెంట్ సూచిస్తారని చెబుతున్నారు.

First published:

Tags: Health Tips, Tips For Women

ఉత్తమ కథలు