కొత్త జంటలు వేర్వేరు బెడ్లపై నిద్రపోవాలట.. అలా అయితేనే బంధం బలపడుతుందట.. సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలివే

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా పెళ్లైన జంటలు(new married couple) ఒకే బెడ్స్ పై నిద్రపోతుంటారు. అయితే, మంచి ఆరోగ్యానికి మరియు సంతోషకరమైన సంబంధానికి వేర్వేరు బెడ్లపై నిద్రపోవడం ఉత్తమం అని ప్రముఖ మాట్రిసెస్ సంస్థ చేసిన సర్వేలో తేలింది.

  • Share this:
మనిషికి మంచి నిద్ర ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ ప్రతీ రోజు 6 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, మన నిద్ర మనం పడుకునే బెడ్స్ పై కూడా ఆధారపడి ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా పెళ్లైన జంటలు ఒకే బెడ్స్ పై నిద్రపోతుంటారు. అయితే, మంచి ఆరోగ్యానికి మరియు సంతోషకరమైన సంబంధానికి వేర్వేరు బెడ్లపై నిద్రపోవడం ఉత్తమం అని ప్రముఖ మాట్రిసెస్ సంస్థ చేసిన సర్వేలో తేలింది. అయితే, జంటలిద్దరూ వేర్వేరు బెడ్లపై నిద్రించడం అంటే వారి వైవాహిక జీవితంలో కలహాలకు సంకేతంగా అర్థం చేసుకోకూడదని పేర్కొంది. కాగా ఈ సర్వే ఆరుగురు జంటలపై జరిగింది. ఈ ఆరు జంటల్లో ఒక జంట తాము రాత్రిపూట మంచి నిద్రపోవాలనుకుంటున్నందున వేర్వేరుగా నిద్రపోతున్నామని పేర్కొంది.

కాగా గత 35 సంవత్సరాలుగా నిద్రపై పరిశోధన చేస్తున్న డాక్టర్ నీల్ స్టాన్లీ డైలీ మెయిల్తో మాట్లాడుతూ.. “మేం కొన్ని జంటలపై జరిపిన పరిశోధనలో భాగంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. పరిశోధనలో భాగంగా ఒక డివైజ్ ను ఆయా జంటలు ధరించి నిద్రించారు. అయితే, ఆ డివైజ్ లు వారిని నిద్ర నుంచి మేల్కొల్పడం మరియు నిద్రలో ఉన్నప్పుడు వారి కదలికను పర్యవేక్షిస్తాయి. అయితే జంటలిద్దరూ నిద్రించిన సమయంలో ఒక భాగస్వామి కదిలినప్పుడు, మరొకరు కూడా కదిలారు.”అని పేర్కొన్నారు. ఫలితంగా, దీని ప్రకారం జంటలిద్దరూ ఒకే బెడ్స్ పై నిద్రించడం మూలాన వారి నిద్రకు భంగం వాటిల్లిందని తేలింది.

కాబట్టి, ఒకే బెడ్ పై ఇద్దరూ నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్యకు గురయ్యే అవకాలు ఎక్కువగా ఉంటాయి. నిద్రలేమి మీ శారీరక, మానసిక ఆరోగ్యంపై, అలాగే మీ పనితీరును, రిలేషన్షిప్ ను ప్రభావితం చేస్తుంది. ఇది భవిష్యత్ లో మరిన్ని ప్రమాదాలకు కారణమవుతుంది. దీని వలన బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్ పెరగడం వంటి వాటికి దారితీస్తుంది.

తక్కువ నిద్ర పోయే వారిలో విడాకుల రేటు ఎక్కువగా ఉందని ఇదే విషయంపై చేసిన మరో అధ్యయనంలో తేలింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రచురించబడిన ఒక పుస్తకం ప్రకారం బెడ్ ను పంచుకోవడం ప్రజలు ఇష్టపడే విషయం కాదని వివరించారు. తమ సంబంధాన్ని దీర్ఘకాలికంగా పదిలం చేసుకోవడానికి ధనికులు ప్రత్యేక బెడ్ రూములను కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నారని ఆ పుస్తకం వివరించింది.
Published by:Nikhil Kumar S
First published: