Facts About Eggs: గుడ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. వీటి గురించి ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
Facts About Eggs: గుడ్డు (egg) శరీరానికి మల్టీ విటమిన్ గా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. ఒక గుడ్డు సాధారణంగా 24 నుండి 26 గంటలలో ఏర్పడుతుంది. వీటిని వేయించి లేదా ఉడకబెట్టి తినవచ్చు. గుడ్డు గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
తల్లిపాల తర్వాత అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే అది గుడ్డు(eggs) మాత్రమే అని చాలా మంది చెబుతుంటారు. అందుకే ‘రోజుకొక గుడ్డు తినండి’ అని డాక్టర్లు సలహాలిస్తుంటారు. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటీన్లు(protein), శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉంటాయి. అందుకే గుడ్డు శరీరానికి మల్టీ విటమిన్ గా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. ఒక గుడ్డు సాధారణంగా 24 నుండి 26 గంటలలో ఏర్పడుతుంది. వీటిని వేయించి లేదా ఉడకబెట్టి తినవచ్చు. సంవత్సరమంతా అందుబాటులో ఉండే గుడ్లతో సులభంగా క్షణాల్లో వంట చేయవచ్చు. అటువంటి గుడ్డు గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
1. గుడ్లు ప్రాచీన చరిత్ర
ప్రాచీన కాలం నుంచి మానవులు గుడ్లు తింటున్నారు. ప్రాచీన రోమన్లు పీఫౌల్ గుడ్లు, చైనీయులు పావురం గుడ్లను తినేవారని చరిత్ర చెబుతోంది. అయితే, గుడ్డు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది కోడి గుడ్డు. కానీ, కేవలం కోడి గుడ్డే కాదు పిట్ట, బాతు, గూస్, టర్కీ గుడ్లు కూడా అనేక ప్రాంతాల్లో ప్రసిద్ధి. సుమారు 1-2 కిలోల బరువుతో ఉష్ట్రపక్షి, ఈము గుడ్లను కూడా కొన్ని ప్రదేశాల్లో ఆహారాల్లో తీసుకుంటారు. కేవియర్(Caviar), హిల్సా(Hilsa) వంటి చేపల గుడ్లను కూడా బయట విరివిగా ఉపయోగిస్తుంటారు. వీటిలోని ఉత్తమ పోషకాలు(nutrients) రుచికరమైన వంటకాన్ని ఇస్తాయి.
2. పోషక శక్తి కేంద్రం
గుడ్లు అత్యంత పోషకమైన ఆహారాలలో ఒకటిగా పరిగణించబడతాయి. అవి చవకైన, అధిక నాణ్యత గల ఆహారంగా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా గుడ్డు లోపల తెలుపు రంగులో ఉండే పచ్చసొనలోఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఇందులో విటమిన్ బి2 పుష్కలంగా లభిస్తుంది. గుడ్లలోని ప్రోటీన్ రక్తపోటును తగ్గించడానికి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి, కండర ద్రవ్యరాశిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాక, దీనిలో విటమిన్ డి(vitamin D), బి6, బి12, జింక్, ఇనుము(iron) పుష్కలంగా లభిస్తుంది. దీంతో పాటు థైరాయిడ్ పనితీరు, రోగనిరోధక వ్యవస్థ, మానసిక ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్లు(antioxidant)గా పని చేస్తుంది. అంతేకాక, మాక్యులర్ క్షీణత, కంటి సమస్యల(eye cataracts)ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
3. శరీరానికి మంచి చేసే కొలస్ట్రాల్
గుడ్లలో అధిక కొలెస్ట్రాల్(cholesterol) ఉండటం వల్ల అనారోగ్య ఆహారంగా చాలా సంవత్సరాల పాటు పరిగణించబడింది. అందుకే, అధిక మోతాదులో గుడ్డను తినడం కూడా మంచిది కాదని చాలా మంది చెబుతుంటారు. కానీ, ఇది వాస్తవం కాదంటున్నారు నిపుణులు. నిజం ఏమిటంటే మన శరీరం ఉత్సాహంగా పనిచేయడానికి దీనిలోని కొలస్ట్రాల్ చాలా అవసరం. కాబట్టి గుడ్డు తినడం వల్ల ఎటువంటి అనర్థాలు రావని గుర్తించుకోండి.
4. సంతోనోత్సత్తికి చిహ్నం
ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులలో, గుడ్డు సంతానోత్పత్తి(fertility), పునర్జన్మ(rebirth)కు చిహ్నం. ప్రపంచంలోని సమస్త జీవరాశులన్నీ ప్రారంభంలో గుడ్డు నుండే ఉద్భవించాయని రోమన్లు భావిస్తారు.
5. కోళ్లకు సరైన పోషకాలను అందించాలి
గుడ్లు పొదగడం వల్ల కోళ్లు త్వరగా చనిపోతాయనే పుకారు ఎప్పటి నుంచో ఉంది. కానీ, వాస్తవానికి కోళ్లు క్షీరదాలు కానందున వాటికి గర్భాలు ఉండవు. కాబట్టి, కనుక ఇది మానవ పునరుత్పత్తి వ్యవస్థ(human reproductive system)తో సమానం కాదు. వాణిజ్యపరంగా విక్రయించే గుడ్లు ఫలదీకరణం చెందవు. వారికి సరైన పోషకాలను అందిస్తేనే గుడ్లు పెడతాయి.
ప్రతీకాత్మక చిత్రం
6. కరోనాతో పెరిగిన డిమాండ్
కరోనా(Corona) మహమ్మారి సమయంలో గుడ్డు అమ్మకాలు ఆకాశాన్నంటాయి. 1980 తరువాత మొదటిసారిగా 13 బిలియన్ల గుడ్డు అమ్ముడవ్వడం ఇదే తొలిసారి. అధిక డిమాండ్‌తో గుడ్ల ధర గణనీయంగా పెరగడానికి దారితీసింది. గుడ్ల డిమాండ్ చారిత్రాత్మకంగా పటిష్టమైన ఆర్థిక విస్తరణలో బలంగా ఉంది. కరోనా మహమ్మారిని అరికట్టడంలో శరీరంలోని ప్రోటీన్(protein)లు బాగా పనిచేస్తాయని, వీటిని పెంచుకోవాలన్న ప్రచారం నేపథ్యంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. అంతేకాక, ఇతర ఆహారాలతో పోలిస్తే గుడ్డు చౌకగా దొరకడం కూడా అధిక డిమాండ్‌కు ఒక కారణంగా కూడా చెప్పవచ్చు.
7. కోళ్లకు టీకాలు
UKలో ఉత్పత్తి చేయబడిన 90% గుడ్లకు లయన్ ట్రేడ్‌మార్క్(Lion trademark) ఉంటుంది. అన్ని కోళ్ళకు టీకాలు వేసి, సురక్షితంగా తగిన ప్రమాణాల మేరకు ఉంచబడతాయి. కరోనా నేపథ్యంలో EU అంతటా సాంప్రదాయ “బ్యాటరీ బోనులను”(battery cages) నిషేధించారు. యూకేలో వాటిని పెద్ద పెద్ద బోనులతో భర్తీ చేశారు.
8. గుడ్లతో ఎన్నో ఉపయోగాలు
గుడ్లు తినడానికి మాత్రమే కాదు, ఇల్లు, తోటల్లో అందమైన ఉత్పత్తులు(homemade beauty products)గా అలంకరించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి మొక్కలకు మంచి ఆహారంగా కూడా పని చేయగలవు. వీటిలోని షెల్ కూడా ఉపయోగకరమైన వనరుగా పనిచేస్తుంది. పోషకాలు నిండి ఉండే ఎగ్‌షెల్స్(eggshells)ను కంపోస్ట్ పైల్‌కు ఆహారంగా, రాపిడి డ్రెయిన్ క్లీనర్‌గా లేదా తోటలో పెస్ట్ కంట్రోల్‌గా కూడా ఉపయోగించవచ్చు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.