సక్సెస్... సక్సెస్...సక్సెస్... సింప్లీ ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’

సక్సెస్ ఫస్ట్ పర్సన్ గా తనకు తానుగా ఎలా పొందాలో విశదీకరిస్తున్నట్లు రచయిత చేసిన కొత్త ప్రయోగం పుస్తక ప్రేమికుల్ని ఆకట్టుకుంటోంది. ప్రతీ అంశానికి సంబంధించి ప్రముఖుల జీవితాలను వివరించిన తీరు పుస్తకం చదవాలన్న ఆసక్తి రేకిస్తోంది.

news18-telugu
Updated: August 28, 2019, 3:56 PM IST
సక్సెస్... సక్సెస్...సక్సెస్... సింప్లీ ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’
సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకం కవర్ పేజీ (Image:SelfieofSuccess/Twitter)
  • Share this:
జీవితంలో సక్సెస్ సాధించాలని కోరుకోని వారెవరుంటారు? ఎవరూ ఉండరు. సక్సెస్ కోసం అనుక్షణం పరితపిస్తూ ఉంటారు. ఎక్కడ సక్సెస్ దొరుకుతుందా అని వెంపర్లాడుతుంటారు. సక్సెస్ సాధించాలని బలమైన కాంక్ష ఉన్నా ఎలా సాధించాలో తెలియక ఎదురీదుతుంటారు. కానీ సక్సెస్ సాధించేది ఎంతమంది? కొంత మందే. చాలా మంది సక్సెస్ అంటే దండిగా డబ్బు సంపాదించడం అనుకుంటారు. కానీ కచ్చితంగా అది కాదు. సక్సెస్ లో వివిధ దశలుంటాయి. సక్సెస్ ఉందని ఎలా తెలుస్తుందనే అంశం మొదలుకొని వచ్చిన సక్సెస్ ను ఎలా నిలుపుకోవాలి అనే అంశం వరకు వివిధ దశలను విడమర్చి వివరించారు తెలంగాణ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం. ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ పేరుతో ఓ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం అన్ని వర్గాల వారి మన్ననలు పొందుతోంది. ప్రముఖ ఆన్ లైన్ విక్రయ సంస్థ ఆమెజాన్ పుస్తక విక్రయాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ పుస్తకం చాలా బావుందంటూ తన అభిప్రాయాన్ని ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకున్నాడు. 

View this post on Instagram
 

We all seek success in some form or the other. #SelfieofSuccess has captured the essence of 'success' beautifully. It's a catalyst that will make you shine. Success is not a destination, it is a journey... this was the soul of our film Maharshi. Selfie of Success has many common strings with the theme of Maharshi. Congratulations to the author Shri Burra Venkatesham garu for bringing out a 'Maharshi Edition' of this Amazon bestseller. I strongly recommend everyone to read this book & gift a copy to your near & dear ones.


A post shared by Mahesh Babu (@urstrulymahesh) on


సక్సెస్ తో పాటు సెల్ఫీ అనే పదం నేటి డిజిటల్ యుగంలో తెలియని వారుండరు. దీంతో సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పేరు బాగా క్లిక్ అయింది కూడా. సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకంలో ఐదు భాగాలున్నాయి. స్నాప్ షాట్ ఆఫ్ సక్సెస్ (గెలుపు యెక్క అవగాహన), సిలబస్ ఆఫ్ సక్సెస్ (గెలుపు ప్రయాణం), సమ్మరీ ఆఫ్ సక్సెస్ (గెలుపు అర్థం), సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సక్సెస్ (గెలుపు యొక్క అనర్థం), సిగ్నేచర్ ఆఫ్ సక్సెస్ (గెలుపు పరమార్థం), అనే భాగాలున్నాయి. ఈ విభాగాలన్నీ గెలుపును ఎలా ఎంచుకోవడం మొదలు గెలుపు పరమార్థాన్ని ఎలా అనుభవించాలి వరకు వివిధ విభాగాల్లో కూలంకషంగా చర్చించారు రచయిత బుర్రా వెంకటేశం. సక్సెస్ ఫస్ట్ పర్సన్ గా తనకు తానుగా ఎలా పొందాలో విశదీకరిస్తున్నట్లు రచయిత చేసిన కొత్త ప్రయోగం పుస్తక ప్రేమికుల్ని ఆకట్టుకుంటోంది. ప్రతీ అంశానికి సంబంధించి ప్రముఖుల జీవితాలను వివరించిన తీరు పుస్తకం చదవాలన్న ఆసక్తి రేకిస్తోంది.

“పొద్దున లేచినప్పట్నుంచి ప్రతీ ఒక్కరు పరితపించేది సక్సెస్ కోసమే. ఈ పుస్తకంలో సక్సెస్ కు సంబంధించిన అన్ని కోణాలు స్పృసించే ప్రయత్నం చేశాను. సెల్ఫీ ఆఫ్ సక్సెస్ మంచి ఆదరణ పొందడం ఆనందంగా ఉంది. మున్ముందు మరిన్ని పుస్తకాలతో మీ ముందుకొస్తాను.” అని రచయిత బుర్రా వెంకటేశం న్యూస్ 18 తో అన్నారు.


సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకాన్ని అంథుల కోసం బ్రెయిలీ లిపిలో కూడా సిద్ధం చేశారు. బ్రెయిలీ లిపిలో ఉన్న పుస్తకాలను ఉచితంగా అందజేస్తామని రచయిత చెప్పారు. అంతే కాకుండా పుస్తకం ద్వారా తనకు సమకూరే రాయల్టీని కూడా సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తానని చెప్పారు.
సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకం ప్రస్తుతం ఇంగ్లీషులో అందుబాటులో ఉంది. మరి కొన్ని రోజుల్లో వివిధ భారతీయ భాషల్లో, స్పానిష్, జపనీస్, జర్మన్, పర్షియన్ తదితర అతర్జాతీయ భాషల్లోనూ అందుబోటులోకి రానుంది. నేటివిటీ కోసం ఆయా భాషల్లో ఆయా ప్రాంతానికి సంబంధించిన సక్సెస్ ఫుల్ పర్సనాలిటీస్ జీవితాలను ఉదహరిస్తున్నానని చెప్పారు బుర్రా వెంకటేశం.

సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తక రచయిత బుర్రా వెంకటేశం


బుర్రా వెంకటేశం మున్ముందు మరిన్ని రచనలతో పాఠకలోకం ముందుకు రానున్నారు. మరికొన్ని రోజుల్లో “థాంక్యూ మై ఎనిమీ... యు మేడ్ మీ వాట్ ఐయామ్ టుడే” అనే పుస్తకం మార్కెట్లోకి రానుంది.
మొదటి పుస్తకంతోనే రచయితగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల రచయిత ఆనందం వ్యక్తం చేశారు. తనకు సమయం దొరినప్పుడల్లా పుస్తక రచనపై దృష్టి సారిస్తానని చెబుతున్నారు.

(పీవీ రమణకుమార్, అసిస్టెంట్ ఎడిటర్, న్యూస్‌18)

First published: August 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు