తేలు కుడితే మనిషి చనిపోతాడు. అలాగని అన్ని తేళ్లూ ప్రాణాలు తియ్యలేవు. చాలా తేళ్లు కుడితే నొప్పి మాత్రమే ఉంటుంది. కొన్ని మాత్రం అత్యంత విషపూరితంగా ఉంటాయి. వాటి విషం మన బ్లడ్‌లో చేరిందంటే... క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటిది తేలు విషంతో మందులు తయారు చేస్తారంటే నమ్మగలరా. మన శరీరానికి వచ్చే కొన్ని రకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి తేలు విషానికి ఉంది. ఈ విషయం కనిపెట్టినప్పటి నుంచీ తేలు విషానికి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. అందుకు తగ్గట్టే రేటు కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఒక గ్రాము తేలు విషం రూ.7,30,000 ఉంది. అంటే లీటర్ తేలు విషం రూ.73 కోట్ల రూపాయలు. అందుకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన విషంగా ఇది గుర్తింపు పొందింది.
తేలు విషంతో కీళ్లవాతాన్ని తగ్గించవచ్చని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనల్లో తెలిసింది. మొత్తం 13 లక్షల మందిపై తేలు విషంతో తయారైన మందును ప్రయోగించారు. వాళ్లందరికీ ముసలితనంలో వచ్చే కీళ్లవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్), కీళ్ల నొప్పుల వంటివి తగ్గిపోయాయి.
ఇదెలా సాధ్యమంటే... తేలు విషంలో కాంపొనెంట్స్ ఉంటాయి. వాటి ద్వారా కీళ్ల నొప్పుల్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించవచ్చని పరిశోధకులు తేల్చారు. కీళ్లకు వచ్చే ఇతరత్రా వ్యాధులను కూడా తగ్గించేందుకు వీలుగా తేలు విషాన్ని మందుగా మార్చారు.
కీళ్లవాతం ఎందుకొస్తుంది : ముసలితనం వస్తున్నకొద్దీ... శరీరంలో కణాలు చచ్చుపడిపోతూ ఉంటాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు కీళ్లలో ఫైబ్రోబ్లస్ అనే కణాలు అటూ ఇటూ కదులుతూ... కీళ్ల నొప్పిని కలిగిస్తాయి. ఇవి కీళ్లను నాశనం చేయడం వల్ల కీళ్ల వాతం వస్తుంది. ఇలాంటి వ్యాధికి తేలు విషంతో విరుగుడు ఉండటం విశేషమే.
ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం
వేడి నీరు, నిమ్మరసంతో అద్భుతమైన 9 ప్రయోజనాలు
ఈ సిగరెట్లు తాగితే హార్ట్ ఎటాక్స్... పరిశోధనలో భయంకర వాస్తవాలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Life Style, Tips For Women, Women health