హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Breast Cancer: మహిళల్లో రొమ్ము క్యాన్సర్.. శాస్త్రవేత్తల అధ్యయనంలో సరికొత్త విషయాలు

Breast Cancer: మహిళల్లో రొమ్ము క్యాన్సర్.. శాస్త్రవేత్తల అధ్యయనంలో సరికొత్త విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Breast Cancer: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ఎటువంటి ప్రమాద కారకాలకు గురవ్వకుండానే రొమ్ము క్యాన్సర్‌ను ఎదుర్కొంటున్నారనేది ఆందోళనకర అంశం.

ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్(Breast Cancer) భారీన పడే మహిళల సంఖ్య పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ అనేది ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధుల తర్వాత ఎక్కువ మంది మహిళలు రొమ్ము కాన్సర్ భారీన పడుతున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.46 మిలియన్ల మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రతి 22 మందిలో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు ఉన్నారంటే దీని తీవ్రత ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ భారీన పడే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. పురుషుల్లో కంటే మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

రొమ్ము క్యాన్సర్‌తో వచ్చే ప్రమాదాలు, నివారణ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. తాజాగా జాన్స్ హాప్కిన్స్ కిమ్మెల్ క్యాన్సర్ సెంటర్(Johns Hopkins Kimmel Cancer Center), బ్లూమ్బెర్గ్ కిమ్మెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ ఇమ్యునోథెరపీ(Bloomberg Kimmel Institute for Cancer Immunotherapy) పరిశోధకులు చేసిన అధ్యయనంలో రొమ్ము క్యాన్సర్పై ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. మహిళల పెద్దప్రేగుల్లోని గట్ సూక్ష్మజీవులు(Bacteria) కూడా క్యాన్సర్ అభివృద్ధికి ప్రధాన కారణమని ఈ అధ్యయనంలో తేలింది. పెద్దప్రేగులో కనిపించే ఈ సూక్ష్మజీవి రొమ్ము క్యాన్సర్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. కాగా, ఈ అధ్యయన ఫలితాలు క్యాన్సర్ డిస్కవరీ(Cancer Discovery) జర్నల్లో ప్రచురించబడ్డాయి.

సూక్ష్మజీవులు, రొమ్ము క్యాన్సర్ మధ్య సంబంధం?

అధ్యయనంలో భాగంగా ఎలుకలపై ప్రరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. ఎలుకల గట్స్ లేదా రొమ్ము నాళాలకు ఎంట్రో టాక్సిజెనిక్ బాక్టీరాయిడ్స్ ఫ్రాగిలిస్ (ETBF)ను ప్రవేశపెట్టినప్పుడు, అది కణితి కణాల పెరుగుదలకు, మెటాస్టాటిక్ పురోగతికి దారితీసిందని పరిశోధకులు కనుగొన్నారు. జీర్ణాశయాంతర ప్రేగు, నాసికా మార్గాలు, చర్మం వంటి శరీర ప్రదేశాలలో సూక్ష్మజీవులు ఉన్నప్పటికీ అక్కడ క్యాన్సర్ అభివృద్ధి కాదని, కేవలం రొమ్ము ప్రదేశాల్లో ఉండే సూక్ష్మజీవుల వల్లే క్యాన్సర్ అభివృద్ధి చెందుతుందని అధ్యయన సీనియర్ రచయిత, జాన్స్ హాప్‌కిన్స్ మెడిసిన్‌ ఆంకాలజీ ప్రొఫెసర్ దీపాలి శర్మ(Dipali Sharma) పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్ అభివృద్ధిలో ETBF ప్రమేయాన్ని పేర్కొనడానికి తొలిసారిగా ఈ అధ్యయనం నిర్వహించామని శర్మ చెప్పారు.

అధ్యయనంలో తేలిన ఫలితాలు?

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ఎటువంటి ప్రమాద కారకాలకు గురవ్వకుండానే రొమ్ము క్యాన్సర్‌ను ఎదుర్కొంటున్నారనేది ఆందోళనకర అంశం. అందువల్ల, మహిళల్లో రొమ్ము క్యాన్సర్కు గల ప్రధాన కారకాల(Risk Factors )ను గుర్తించేందుకు ఈ అధ్యయనం జరిపారు శాస్త్రవేత్తలు. వయస్సు, జన్యు మార్పులు(Genetic Changes), రేడియేషన్ థెరపీ(Radiation Therapy), కుటుంబ మెడికల్ హిస్టరీ(Family History) వంటివి సహజంగా రొమ్ము క్యాన్సర్‌కు ప్రమాద కారకాలుగా అందరూ భావిస్తారు. అయితే, ఈ లక్షణాలు లేనప్పటికీ మహిళలు పెద్ద సంఖ్యలో రొమ్ము క్యాన్సర్‌ భారీన పడుతున్నారు. ఇదే ఆందోళనకర అంశంగా మారింది. అందువల్ల, రొమ్ము క్యాన్సర్ కారకాలను కనిపెట్టేందుకే మా అధ్యయనం కొనసాగింది. రొమ్ము క్యాన్సర్కు సూక్ష్మజీవి కూడా ప్రదాన కారణమని ఈ అధ్యయనం గుర్తించింది.

First published:

Tags: Breast cancer

ఉత్తమ కథలు