Home /News /life-style /

SCIENTIST FINDS TREATMENT FOR CURE HUMAN PAPILLOMA VIRUS INFECTION CERVICAL CANCER RA

ఫలించిన సర్వైకల్ క్యాన్సర్ చికిత్స ప్రయోగం.. త్వరలోనే అందుబాటులోకి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎన్నో ఏళ్లుగా సర్వైకల్ క్యాన్సర్‌కి చికిత్స గురించి చేస్తున్న పరిశోధనలో సక్సెస్ సాధించారు శాస్త్రవేత్తలు.. వ్యాధికారక వైరస్‌లను తొలగించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని తేలింది.

మహిళలు ఎదుర్కొనే అతిపెద్ద శారీరక సమస్యల్లో సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ జబ్బు బారిన పడి చాలామందిప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరైన చికిత్స విధానం లేకపోవడం వల్ల ఇది మితిమీరిపోతోంది. దీంతో.. చికిత్స విధానంపై పరిశోధన చేపట్టిన మహిళా శాస్త్రవేత్త డాక్టర్ ఎవా రామోన్ గాలిగోస్ విజయం సాధించారు. మెక్సికోలోని నేషనల్ స్కూల్ బయాలజికల్ సైన్సెస్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఈమె గత ఇరవైఏళ్లుగా ఓ బృందం ఏర్పరచుకుని సర్వైకల్ క్యాన్సర్ చికిత్సవిధానంపై పరిశోధనలు చేస్తూ మెరుగైన ఫలితాలు సాధించారు.

doctors
శాస్త్రవేత్త డాక్టర్ ఎవా రామోన్ గాలిగోస్ బృందం


మనిషిలోని పపిలోమీ వైరస్(హెచ్‌పీపీ)ని తొలగించి సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించుకునేలా పరిశోధనలు జరిగాయి. ఈ వైరస్ ఒక్కటే 150 వైరస్‌ల సమూహం. దీంటో నుంచి 14 వైరస్‌లు తొలగించడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉండగలమని చెబుతున్నారీ బృంద సభ్యులు.

అంతేకాదు, ఈ థెరపీ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని.. సమస్య దాదాపు తగ్గిపోతుందని ఎవా తెలిపారు.
ఇదే నిజమైతే మహిళలు.. సర్వైకల్ క్యాన్సర్ గురించి భయపడాల్సిన పనే ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
First published:

Tags: Cancer, Health Tips, Tips For Women

తదుపరి వార్తలు