కరెంట్ బిల్ తక్కువగా రావాలంటే ఈ టిప్స్ పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

కరెంట్‌ని ఎంత తక్కువగా వాడినా సరే.. బిల్ చూస్తే ఎక్కువగా వస్తుంటుంది.. అలాంటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు..

  • Share this:
13ఎండాకాలంలో కరెంట్ బిల్ చూస్తేచాలు గుండె గుభేల్‌మంటుంది. ఏసీలు, ఫ్యాన్స్, ఫ్రిజ్‌లు ఎక్కువగా వాడతాం. దీనికారణంగా బిల్లు ఎన్నడూలేనంతగా వస్తుంది. ఉండేది చిన్న ఇల్లు అయినా సరే బిల్లు చూస్తే షాకే.. ఈ సమస్య కేవలం ఎండాకాలంలోనే కాదు.. ఏ సీజన్‌లో అయినా ఎదుర్కొంటూనే ఉంటాం. మరి మనం ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
* మామూలుగా మనం ఫ్యాన్స్, కూలర్, ఏసీ, ఫ్రిజ్ ఇలా ఏవైనా సరే వాటికి ఉండే రెగ్యులేటర్‌ని ఎక్కువ నెంబర్‌లో పెడతాం. అయితే, ఇది గది ఉష్ణోగ్రత చల్లగా మారేంత వరకూ ఉంచి ఆ తర్వాత నెంబర్‌ని తగ్గించాలి. దీంతో ఆ వస్తువుల మోటార్స్ విద్యుత్తుని తక్కువగా తీసుకుంటాయి. దీంతో.. కరెంట్ ఆదా అవుతుంది.
* ఇక చాలామంది మామూలు బల్బ్స్ ఉపయోగిస్తారు. ఇలా కాకుండా క్యాండిల్ అంటే సీఎఫ్ఎల్ బల్బులు వాడాలి. వీలుంటే సోలార్ ల్యాంప్స్ ఉంటాయి. వాటిని కూడా వినియోగించొచ్చు.
* ఫ్రిజ్‌లను ఎప్పుడూ చీటికి మాటికి తీస్తూ ఉండడం తగ్గించాలి. దీంతో.. దానిలో చల్లదనం అలానే ఉంటుంది. అలానే డోర్ కరెక్ట్‌గా పడిందా లేదా చూస్తుండాలి.
* మామూలుగా ఏసీలు ఎండాకాలంల 22-24 సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటే సరిపోతుంది.
* కూలర్స్ వాడేవారు... ఇంట్లో కాకుండా.. కిటికీల దగ్గర పెట్టాలి. అదే విధంగా పాతవే వాడకుండా వాటిలోని గడ్డిని మార్చి.. వాటర్ పంప్స్ సరిగా పనిచేస్తున్నాయో చూడాలి.
* చాలామంది ఏసీలు ఎప్పుడూ వేస్తూనే ఉంటారు. అలా కాకుండా ఎక్కువగా వేడి ఉన్నప్పుడు ఏసీ వేసి.. గది చల్లారక.. ముఖ్యంగా అర్ధరాత్రులు ఆఫ్ చేయడం మంచిది.
* అదే విధంగా.. తలుపులు, కిటీకీలు ఎప్పుడూ వేసి ఉంచకుండా తీసి ఉంచాలి. దీంతో గాలి వెలుతురు, గాలి బాగావస్తుంది. లైట్స్, ఫ్యాన్స్, కూలర్లని తక్కువగా వాడతాం.
* కొంతమంది చార్జర్స్, ఫ్లగ్స్‌ అలాపెట్టే ఉంటారు. కానీ స్విచ్చెస్ ఆన్ చేయకపోయినా ఇలా ఫ్లగ్స్ పెట్టడం వల్ల కరెంట్ బిల్ వస్తుంది. కాబట్టి.. ఇలా ఎప్పుడూచేయకూడదు.
First published: