24న రంజాన్ జరుపుకోనున్న సౌదీ అరేబియా...

ఈనెల 24న రంజాన్ పండుగను జరుకోనునన్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది.

news18-telugu
Updated: May 22, 2020, 10:46 PM IST
24న రంజాన్ జరుపుకోనున్న సౌదీ అరేబియా...
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈనెల 24న రంజాన్ పండుగను జరుకోనునన్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. శుక్రవారం రోజు నెలవంక కనిపించకపోవడంతో ఆదివారం రంజాన్ పర్వదినాన్ని జరుపుకోనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సౌదీ అరేబియా అధికారిక ట్విట్టర్ ఖాతా సౌదీ గెజిట్ ఖాతాలో ప్రకటించింది. వాస్తవానికి శుక్రవారం (మే 22)తో 30 రోజుల ఉపవాస దీక్షలు ముగుస్తాయి. కానీ, ముస్లింల ఆచారం ప్రకారం నెలవంక కనిపించిన మరునాడే పండుగ జరుపుకొంటారు. దీంతో ఆదివారం పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించడంతో ముస్లింలు ఆనందం వ్యక్తం చేశారు. ‘దేవుడి కోసం మరో ఉపవాసం’ అంటూ కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు.

First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading