Home /News /life-style /

SANIA MIRZA TAKEN A DECISION TO BE AWAY FRO SOCIAL MEDIA FOR INDIA VS PAKISTAN WORLD CUP MATCH RNK

IND vs PAK match: సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటా: సానియా మీర్జా

 ‘ఇండియా–పాకిస్తాన్‌ మ్యాచ్‌ రోజున నేను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాను’ అని సానియా వీడియోలో పంచుకుంది

‘ఇండియా–పాకిస్తాన్‌ మ్యాచ్‌ రోజున నేను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాను’ అని సానియా వీడియోలో పంచుకుంది

Ind vs pak match: ఇండియా–పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరిగే సమయంలో  భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా అనేకసార్లు ట్రోల్స్‌ ఎదుర్కొన్నారు

టీ 20 వరల్డ్‌ కప్‌ ఇండియా–పాకిస్తాన్‌  (IND vs PAK) మధ్యలో జరగనున్న నేపథ్యంలో ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మిర్జా (sania mirza) ను మరోసారి సందిగ్ధంలో పడేసింది. ఒకవైపు పుట్టినిల్లు.. మరోవైపు మెట్టినిట్లు.. ఈ తీవ్రమైన ఒత్తిడి కారణంగా సానియా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు.

ఏదైనా క్రికెట్‌  (Cricket) టోర్నమెంట్‌లో ఇండియా–పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అనగానే..ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 24న ఆదివారం తేవాలో ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌ 2021లో ఈ ఇరు దేశాలు తలపడనున్నాయి. కాబట్టి భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఓ నిర్ణయం తీసుకున్నారు. అదే ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ రోజున తాను సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.

ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సానియా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది సానియా. సానియా పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్‌ చేసింది. ఇందులో రెండు దేశాల మధ్య మ్యాచ్‌ రోజున తాను సోషల్‌ మీడియా ఇతర విషపూరితం నుంచి దూరంగా ఉంటానని చెప్పింది.

ఇది కూడా చదవండి: కృత్రిమ ఐల్యాషస్‌ వాడితే.. కళ్లకు ఇంత డేంజరా..?

పాకిస్తాన్‌ ఆల్‌ రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌ను వివాహం చేసుకున్న భారత టెన్నిస్‌ స్టార్‌ అనేకసార్లు ఈ విషయంలో ట్రోల్స్‌ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌ జరిగే సమయంలో సానియా చాలాసార్లు ట్రోల్స్, ద్వేశాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఎదుర్కొనాల్సి వచ్చింది.

‘ఇండియా–పాకిస్తాన్‌ మ్యాచ్‌ రోజున నేను సోషల్‌ మీడియాకు, టాక్సిసిటీకి దూరంగా ఉంటాను’ అని సానియా వీడియోలో పంచుకుంది.

ఇది కూడా చదవండి:  కొరియన్‌ మహిళలు ఈ ఫుడ్‌ వల్లే.. స్లిమ్‌గా ఉంటారు!

యువరాజ్‌ సింగ్‌ వ్యాఖ్య..
సానియా పోస్టుకు స్పందించిన భారత మాజీ ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్, మంచి నిర్ణయం అని వ్యాఖ్యానిస్తూ సానియాకు మద్ధతు ఇచ్చారు.

భారత్‌–పాక్‌ రెండు జట్ల మ్యాచ్‌లు విజయాలతో ప్రారంభమయ్యాయి. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌తో వరుసగా తమ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను గెలిచారు. ఈ మ్యాచ్‌ గురించి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాట్లాడుతూ.. ఇది కేవలం గేమ్‌ అని తాను ఎప్పుడూ చెబుతుంటానని.. అయితే ఈ హై ఓల్టేజ్‌ గేమ్‌లో తమ ప్రత్యర్ధి జట్టును ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
Published by:Renuka Godugu
First published:

Tags: Cricket, India VS Pakistan, Sania Mirza, Yuvaraj singh

తదుపరి వార్తలు