హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

ఉప్పు నీటితో జుట్టు కడగడం వల్ల బోలెడు ప్రయోజనాలు..అనేక సమస్యలు దూరం!

ఉప్పు నీటితో జుట్టు కడగడం వల్ల బోలెడు ప్రయోజనాలు..అనేక సమస్యలు దూరం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Salt Hair Care : మనం మన జుట్టు సంరక్షణ కోసం కూడా ఉప్పును ఉపయోగించవచ్చు. జుట్టులో అధిక చెమట లేదా చుండ్రు సమస్య ఉంటే ఉప్పు మీకు బాగా ఉపయోగపడుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Salt Hair Care : ఉప్పు(Salt) మన ఆహారపు రుచిని పెంచడమే కాదు, మన పనిని సులభతరం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఉదాహరణకు, గొంతు నొప్పిని తగ్గించడానికి, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, డీహైడ్రేషన్‌ను నివారించడానికి మొదలైనవాటికి ఉప్పు బాగా నిచేస్తుంది. అదేవిధంగా, మనం మన జుట్టు సంరక్షణ కోసం కూడా ఉప్పును ఉపయోగించవచ్చు. జుట్టులో అధిక చెమట లేదా చుండ్రు సమస్య ఉంటే ఉప్పు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది కాకుండా, అనేక సమస్యలని అధిగమించడానికి మీరు మీ జుట్టు సంరక్షణలో ఉప్పును ఉపయోగించవచ్చు. దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఉప్పు నీటితో జుట్టు కడగడం వల్ల కలిగే ప్రయోజనాలు

తల చర్మం శుభ్రం

మీ జుట్టు చర్మంలో దురద, పొడి, చుండ్రు సమస్య ఉంటే మీరు వాటిని ఉప్పు సహాయంతో శుభ్రం చేయవచ్చు. ఉప్పు స్ఫటికాలు మీ దెబ్బతిన్న శిరోజాలను నయం చేస్తాయి, ఈ సమస్యలను తగ్గిస్తాయి.

జుట్టు ఆరోగ్యంగా

వెంట్రుకలు రాలిపోతున్నా లేదా విరిగిపోతున్నా, జుట్టు అనారోగ్యకరంగా ఉండటమే దీనికి కారణం. అటువంటి పరిస్థితిలో, మీరు జుట్టు సంరక్షణ కోసం ఉప్పును ఉపయోగించినప్పుడు, అందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం ఖనిజాలు జుట్టును ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి.

Holidays : హాలిడేస్ ఎందుకు ఇంపార్టెంట్..దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జుట్టు పెరుగుదలను పెంచుతాయి

మంచి జుట్టు పెరుగుదలకు, చర్మంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉండటం, రంధ్రాలు శుభ్రంగా ఉండటం అవసరం. అటువంటి పరిస్థితిలో, ఉప్పు జుట్టును ఎక్స్‌ఫోలియేటర్ చేస్తుంది. దీని వల్ల జుట్టు పొడవుగా పెరుగుతుంది.

చుండ్రు దూరం

నిజానికి, ఉప్పులో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి, ఇవి జుట్టు లేదా శిరోజాలను శుభ్రపరుస్తాయి, దానిలోని అదనపు ఆయిల్ ని తగ్గిస్తాయి. దీని వల్ల చుండ్రు సమస్య క్రమంగా దూరమవుతుంది.

జిడ్డు జుట్టు సమస్య దూరం

జుట్టులో స్నిగ్ధత ఎక్కువగా ఉంటే, ఉప్పు నీటితో జుట్టును కడగడం వల్ల జుట్టులో ఉన్న అదనపు జిడ్డు తొలగిపోతుంది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Hair styling, Salt

ఉత్తమ కథలు