Running: రోజూ 5 నిమిషాలు పరుగెడితే... కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Running Just 5 Minutes A Day : వాకింగ్ చెయ్యడం తేలికే... జాగింగ్ అనేది పెద్దవాళ్లకు, అధిక బరువు ఉన్నవాళ్లకు చాలా కష్టం. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే తప్ప చెయ్యలేరు. కానీ దాని ప్రయోజనాలు తెలిస్తే... కచ్చితంగా జాగింగ్ చేస్తారు.

news18-telugu
Updated: October 9, 2020, 6:20 AM IST
Running: రోజూ 5 నిమిషాలు పరుగెడితే... కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
రోజూ 5 నిమిషాలు పరిగెడితే... కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
  • Share this:
Running Just 5 Minutes A Day : చిన్నప్పుడు మనమంతా పరుగులు పెట్టిన వాళ్లమే. రకరకాల ఆటలు ఆడతాం. అందువల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు... ఫిజికల్‌గా కూడా ఫిట్‌గా ఉండేవాళ్లం. మరి ఎదిగేకొద్దీ ఎన్నో బాధ్యతలు. ఉద్యోగాలు, పనులు. టైమ్ ఉండని పరిస్థితి. ఇలాంటి రోజుల్లో కూడా కొంతమంది టైమ్ కేటాయించి వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ మంచిదే. బాడీలో చాలా అవయవాలు అటూ ఇటూ కదిలి, కొవ్వు కరిగి ఆరోగ్యం పెరుగుతుంది. ఐతే... వాకింగ్ కంటే... జాగింగ్ ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుందంటున్నారు డాక్టర్లు. ఏమాత్రం టైమ్ లేని వాళ్లు రోజూ కనీసం 5 నిమిషాలైనా పరిగెడితే... ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో... నిద్ర మత్తు ఎక్కువగా ఉండే రోజుల్లో... వాకింగ్ చేసే టైమ్ లేనప్పుడు... జాగింగ్‌తో ఫిట్‌నెస్ పెంచుకోవచ్చంటున్నారు. పైగా చలికాలంలో తినే హల్వా, పరాఠా వంటి ఆహార పదార్థాల్లో కేలరీలు ఎక్కువ. అవి బరువు పెరిగేలా చేస్తాయి. అధిక బరువు ఎప్పుడూ నష్టమే. అందువల్ల 5 నిమిషాల జాగింగ్ చేసే మేలేంటో తెలుసుకుందాం.

1. Help you burn calories : రన్నింగ్ వల్ల బాడీ మొత్తం షేక్ అవుతుంది. కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. నిజంగా బరువు తగ్గాలంటే... ఐదు నిమిషాల జాగింగ్ సరిపోదు. బట్... అసలు ఎక్సర్‌సైజే చెయ్యడానికి టైమ్ లేకపోతే, ఈ 5 నిమిషాల రన్నింగ్ తోనైనా క్యాలరీలు, కొవ్వు కరిగించుకోవచ్చు. మనకు డైలీ ఎన్ని కేలరీల శక్తి వస్తోందో... అంత కంటే ఎక్కువ కేలరీల శక్తి ఖర్చైతేనే బరువు తగ్గుతాం కాబట్టి... దాన్ని దృష్టిలో పెట్టుకొని... సరిపడా వాకింగ్, జాగింగ్, వర్కవుట్స్ చేస్తే మంచిదే.

2. Improve your mood : ఉదయాన్నే నిద్ర మత్తు ఉంటుంది. అలాంటి సమయంలో అలా జాగింగ్‌కి వెళ్తే... ఆ పచ్చటి ప్రకృతి, సూర్య కిరణాలు, పక్షుల అరుపులు, చక్కటి వాతావరణం... అన్నీ కలగలిసి ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అది తలనొప్పిని తగ్గిస్తుంది. బాడీకి, బ్రెయిన్‌కీ ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. రెగ్యులర్‌గా జాగింగ్ చేస్తూ ఉంటే... ఆరోగ్యం ఆటోమేటిక్‌గా చక్కగా తయారవుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది.

3. Help you control blood sugar levels : ఈ రోజుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ సమస్య ఎక్కువ మందిని వేధిస్తోంది. డయాబెటిక్ పేషెంట్లు 5 నిమిషాలు కేటాయించి... వీలైనంతగా పరుగులు పెడితే... బ్లడ్‌లో షుగర్ (గ్లూకోజ్) లెవెల్స్ పెరిగిపోకుండా, తగ్గిపోకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉండేందుకు వీలవుతుంది. 5 నిమిషాల జాగింగ్‌తో షుగర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చని పరిశోధనలు రుజువుచేశాయి.

4. Improves sleep : కొంతమందికి సరిగా నిద్ర పట్టక... రాత్రిళ్లు మొబైల్‌లో మెసేజ్‌లు, చాటింగ్ చేస్తూ గడిపేస్తారు. నిద్రపోకపోవడం ఓ సమస్యైతే, మొబైల్ వాడటం మరో తీవ్రమైన సమస్యే. ఈ రెండింటికీ చెక్ పెట్టాలంటే... వాకింగ్, జాగింగ్ వంటివి చెయ్యాలి. ఇలా చేస్తే... బాడీలో కొవ్వు కరిగి... శరీరంలో అన్ని అవయవాలూ చక్కగా పనిచేస్తాయి. బ్రెయిన్ కూడా చురుకుగా మారి... నిద్రపోవాల్సిన టైముకి... మిగతా పార్టుల్ని పడుకోబెట్టేస్తుంది. బాడీలో బయోక్లాక్ బాగా పనిచేస్తూ... ఆరోగ్యం మెరుగవుతుంది.

5. Promotes healthy blood pressure numbers : షుగర్ లాగే హైబీపీ సమస్య కూడా చాలా మందికి ఉంటోంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే... మిగతా శరీర అవయవాలకూ డేంజరే. ముఖ్యంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చక్కగా 5 నిమిషాలు పరిగెడితే... గుండె హాయిగా ఉంటుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేస్తే ధమనుల్లో పేరుకున్న కొవ్వు నిల్వలు కరిగిపోయి... రక్త సరఫరా సరిగ్గా ఉంటుంది. అందువల్ల 5 నిమిషాలే పరిగెత్తాలా, ఇంకా పెంచుకోవచ్చా వంటి డౌట్స్‌ని ఓసారి డాక్టర్‌ని కలిసి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యాన్ని పెంచేసుకోవాలి.
Published by: Krishna Kumar N
First published: October 9, 2020, 6:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading