రాత్రి హాయిగా నిద్రపోయి...తెల్లవారుజామున శృంగారం చేస్తే...

నవదంపతులు తెల్లవారుజామున సెక్స్ చేస్తే మాత్రం ఆ మజాయే వేరని పరిశోధకులు అంటున్నారు. మార్నింగ్ సమయంలో శరీరం సమతులంగా ఉంటుందని, అందులో రాత్రంతా సుఖంగా నిద్రించి రిలాక్స్ అయ్యాక శృంగారం స్టార్ట్ చేస్తే ఆ కిక్కే వేరని, సుదీర్ఘ సమయం ఎంజాయ్ చేయవచ్చని పరిశోధనలు తేల్చుతున్నాయి.

news18-telugu
Updated: July 19, 2019, 11:19 PM IST
రాత్రి హాయిగా నిద్రపోయి...తెల్లవారుజామున శృంగారం చేస్తే...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 19, 2019, 11:19 PM IST
మూడ్ ఉండాలే కానీ, శృంగారం అనుభవించేందుకు అన్ని సమయాలు దంపతులకు శుభముహార్తాలే. అయినప్పటికీ నవదంపతులు తెల్లవారుజామున సెక్స్ చేస్తే మాత్రం ఆ మజాయే వేరని పరిశోధకులు అంటున్నారు. మార్నింగ్ సమయంలో శరీరం సమతులంగా ఉంటుందని, అందులో రాత్రంతా సుఖంగా నిద్రించి రిలాక్స్ అయ్యాక శృంగారం స్టార్ట్ చేస్తే ఆ కిక్కే వేరని, సుదీర్ఘ సమయం ఎంజాయ్ చేయవచ్చని పరిశోధనలు తేల్చుతున్నాయి. అంతేకాదు ఆరోగ్యారీత్యా చూసినా తెల్లవారుజామున శృంగారం వల్ల శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పకుండా ఉంటుందని, ఉదయాన్నే సెక్స్ చేస్తే మార్నింగ్ బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుందని, అలాగే మార్నింగ్ ఎక్సర్‌సైజ్ బదులు ఇలా సెక్స్ లో పాల్గొంటే దంపతులు ఇద్దరు వర్కౌట్స్ చేసిన దాని కన్నా ఎక్కువ కేలొరీలు బర్న్ చేసే అవకాశం దక్కుతుంది.

అంతేకాదు రోగనిరోధక శక్తి పెంపుదలలో కూడా మార్నింగ్ సెక్స్ ఉపయోగపడుతుంది. ఇక శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల అవడంతో రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు దోహదపడుతుందని, తద్వారా దంపతులు పగటి పూట ఉరకలేసే ఉత్సాహంతో పనిచేసుకోవచ్చని పరిశోధనలు తేల్చుతున్నాయి.

First published: July 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...