Dengue fever: భారీ వర్షాలతో మళ్లీ డెంగ్యూ విజృంభించే ప్రమాదం.. జాగ్రత్తలు తీసుకోండిలా?

(ప్రతీకాత్మక చిత్రం)

రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (heavy rains)తో మళ్లీ డెంగ్యూ విజృంభించే ప్రమాదం ఉంది. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి దరిచేరకుండా చేయవచ్చు.

 • Share this:
  రాష్ట్రాల్లో వణికిస్తున్న డెంగ్యూ జ్వరం (dengue fever) గురించి తెలియని వారుండరు! అయితే అసలు ఈ డెంగ్యూ వ్యాధి ఎలా వస్తుంది? ఒకవేళ డెంగ్యూ  జ్వరం వస్తే ఏం చేయాలి? లాంటి ప్రశ్నలు మనలో తలెత్తవచ్చు. ఏడీస్ (Aides) రకం దోమలు (Mosquitoes) కుట్టడంతో వచ్చే వైరస్‌ (virus)ని డెంగ్యూ వైరస్ అంటారు. అలాగే ఈ వ్యాధి త్వరగా వ్యాపించడానికి కారణం ఆడ దోమలని అంటారు. దీనిని అశ్రద్ధ చేస్తే మనిషి ప్రాణానికి కూడా ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువే.  ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ప్రతి ఏడాది ప్రపంచంలో 528 మిలియన్ల మంది అనారోగ్యం బారిన  పడుతుండగా.. అందులో 10 నుండి 20 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (heavy rains)తో మళ్లీ డెంగ్యూ విజృంభించే ప్రమాదం ఉంది. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి దరిచేరకుండా చేయవచ్చు.

  లక్షణాలేంటి..

  ఒక్కసారిగా శరీర ఉష్ణోగ్రత (body temperature) పెరిగిపోవడం.. అలాగే జ్వరం తగ్గడానికి మందులు తీసుకున్నా కూడా 8 గంటల వ్యవధిలో మరలా శరీర ఉష్ణోగ్రత పెరగడం. మన రెండు కళ్ళు విపరీతమైన నొప్పికి గురికావడం అనేది కూడా డెంగ్యూ లక్షణమే. అయితే కంప్యూటర్ల ముందు ఎక్కువగా కూర్చునే వారికి కూడా.. ఇలా రెండు కళ్ళలో నొప్పి రావడం సహజమే. ఎప్పుడూ లేని విధంగా తట్టుకోలేని స్థాయిలో కీళ్ల నొప్పులు (joint pains), ఒంటి నొప్పులు వస్తే.. అవి కచ్చితంగా డెంగ్యూ వ్యాధి లక్షణాలనే అనుకోవచ్చు. ఏదైనా ఆహారం తీసుకుంటే, అది సరిగ్గా జీర్ణం కాక వాంతులు అవుతుంటాయి.

  డెంగ్యూ జ్వరం (dengue fever) రాకుండా ఉండేందుకు గాను ఈ జాగ్రత్తలు పాటిస్తే.. ఎక్కువశాతం మంది డెంగ్యూ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. మన ఇంటిలో తులసి మొక్క కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే డెంగ్యూ వచ్చిన సమయంలో తులసి ఆకులు తీసుకుంటే డెంగ్యూ జ్వరం తీవ్రత నుండి బయటపడే అవకాశం ఉంది. మన పరిసరాలు బాగుంటే, మన ఆరోగ్యం బాగున్నట్లేనని అందరూ గుర్తించాలి.

  ఈ డెంగ్యూ దోమల కారణంగా వ్యాపిస్తుంటుందని..  ఆయా దోమలు కూడా నిల్వవున్న నీటి వద్దే ఎక్కువగా ఉంటాయని తేలింది. కనుక మన ఇంటి పరిసరాలలో ఎటువంటి చెత్త లేదా నిల్వవున్న నీరు లేకుండా చూసుకోవాలి. ఇక ఇప్పుడు డెంగ్యూ జ్వరం నుండి తప్పించుకోవడానికి.. ఎక్కువమంది తమ ఇళ్లల్లో వాడుతున్నది ఈ చిట్కానే.

  ఇది కూడా చదవండి: ఈ కలుపు మొక్కతో మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్​ పెట్టొచ్చంట.. ఆ మొక్క ఏంటంటే?


  బొప్పాయి ఆకుల రసం. సాధారణంగా డెంగ్యూ వల్ల మన శరీరంలోని ప్లేట్ లెట్‌ల సంఖ్య తగ్గి ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమయంలో ఈ బొప్పాయి ఆకుల రసం తాగితే.. ప్లేట్‌లెట్ కౌంట్ అతితక్కువ సంఖ్యలో పెరిగి సాధారణ స్థాయికి చేరుకోవచ్చు. అందుకే చాలామంది ఈ చిట్కాని అనుసరిస్తున్నారు.

  డెంగ్యూ వచ్చినవారికి ఆవు లేదా గేదె పాలు (milk) ఇస్తే.. అవి జీర్ణం కాక వాంతులు అయ్యే పరిస్థితి ఉంది. అందుకే మేక పాలు ఇవ్వడం మేలని చెబుతున్నారు. ఆవు లేదా గేదె పాలతో పోలిస్తే మేక పాల సాంద్రత తక్కువగా ఉంటుంది. అలాగే సులభంగా జీర్ణమయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ పాలను తీసుకోవడం వల్ల మన శరీరం డిహైడ్రేట్ కాకుండా కూడా ఉంటుంది.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  ఇవి కూడా చదవండి:

  గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?  శరీరం నుంచి దుర్వాసన అధికంగా వస్తుందా? అయితే ఈ చిట్కాలతో సమస్య నుంచి బయటపడండి

  Published by:Prabhakar Vaddi
  First published: