పాలు అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?

  • News18
  • Last Updated :
  • Share this:
పాలు తాగడం ఆరోగ్యానికి మంచిందన్న విషయం అందరికీ తెలుసు. ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో సుగుణాలు పాలలో ఉన్నాయి. కానీ పాలు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి హానికరమన్న విషయం మీకు తెలుసా.? సరైన మోతాదు, సరైన సమయంలో పాలను తీసుకోకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పాల వలన కలిగే దుష్ఫలితాలేంటో ఇక్కడ చూడండి.

1. చాలా మంది రాత్రిళ్లు నిద్రకు ముందు పాలు తాగి వెంటనే పడుకుంటారు. ఇలా చేస్తే మీరు రోగాలను కోరి కొనితెచ్చుకున్నట్లే. రాత్రి పాలు తాగిన వెంటనే నిద్రపోకూడదు. పాలు తాగిన తర్వాత కనీసం రెండు, మూడు గంటల తర్వాత పడుకోవడం ఉత్తమం.

2.మన శరీరంలో ఆమ్ల, క్షారాలు నియంత్రణలో ఉండాలి. కానీ పాలు, డైరీ ఉత్పత్తులను తీసుకుంటే శరీరంలో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. ఇది అనారోగ్యానికి దారి తీస్తుంది.

3.చాలా మందికి పాలు తాగితే అలర్జీ వస్తుంది. పాలలో ఎక్కువగా ఉండే ప్రోటీన్లు, రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపడం వలన ఇలా జరుగుతుంది.
    4. పాలు ఎన్నో వ్యాధులను తరిమికొడుతుంది. అలాగే మరెన్నో వ్యాధులను తీసుకొస్తుంది కూడా. పాలు ఎక్కువగా తాగడం వలన చాలా మందిలో ఎసిడిటీ వస్తుంది. దీన్ని వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి

    5.చాలా మంది పాలలో చక్కెర కలుపుకొని తాగుతారు. దీని వలన కడుపులో మంట, యాక్సిడేటివ్ స్ట్రెస్ కలుగుతుంది. కణాల పైనా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే పాలలో చక్కెర కలుపుకోవాలంటే.. చాలా తక్కువగా వేసుకోవాలి.
First published: