రోజూ రెండు కన్నా ఎక్కువ గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా..

కోడిగుడ్లు, సోయా ఉత్పత్తులు, పెరుగు, పపప్పు దినుసుల వంటి ప్రోటీన్ ఫుడ్ వల్ల కూడా ఆకలి నియంత్రణలో ఉంటుంది.

Egg: కోడిగుడ్లలో కొవ్వు ఉంటుందని, దీనిని రోజూ అతిగా తీసుకుంటే చేటు చేస్తుందని మసాచుసెట్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Share this:
కోడి గుడ్డు.. బోలెడన్ని పోషక పదార్థాలు, ప్రొటీన్లు, కొలైన్ల సమాహారం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తారు. పచ్చి గుడ్డును, ఉడకబెట్టి, ఉడికించిన గుడ్డు బ్రెడ్‌ ని కలిపి టోస్ట్‌గా, పలావ్‌లలో, బేకరీల్లో కేకుల తయారీకి, ఆమ్లెట్‌, ఫ్రై ఇలా రకరకాలుగా వాడతాం. ఒక గుడ్డు తినడం వల్ల 70-80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల్‌ శరీరానికి అందుతుంది. ఇందులో అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే. అయితే, మితంగా ఇంటేనే అది ఆరోగ్యానికి మంచిది. తినే ఆహారం ఏదైనా మితంగా తింటే అమృతం.. అమితంగా తింటే విషం అవుతుంది. గుడ్డు కూడా అంతేనట. రోజూ రెండు కంటే ఎక్కువ కోడిగుడ్లు తింటే గుండెకు ముప్పని తాజా సర్వే హెచ్చరిస్తోంది. అమెరికా వ్యవసాయశాఖ వెల్లడించిన ఈ వివరాలను అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురించారు.

31ఏళ్లుగా దాదాపు 30వేల మంది తీసుకుంటున్న ఆహారం, వారి జీవన విధానంపై పరిశోధన చేసినట్లు తెలిపారు. కోడిగుడ్లలో కొవ్వు ఉంటుందని, దీనిని రోజూ అతిగా తీసుకుంటే చేటు చేస్తుందని మసాచుసెట్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక్కో గుడ్డులో 200 మిల్లీగ్రాముల కొవ్వు ఉంటుందని, ఇది రోజుకు 300 మిల్లీగ్రాములు దాటితే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని, అకాల మరణం సంభవించే రేటు కూడా 18 శాతం ఉంటుందని వెల్లడించారు.
First published: