Researchers Develop Footwear For Diabetic Patients : మధుమేహం(Diabetes) ఉన్న వ్యక్తులలో కాళ్లకు పుండ్లు లేదా గాయాలు అయితే అంత తొందరగా తగ్గవన్న విషయం తెలిసిందే. ఇది ఇన్ఫెక్షన్(Infection)యొక్క అవకాశాన్ని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువై పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుతుంది. ఈ సమస్యను తప్పించేందుకు డయాబెటిస్ బాధితుల కోసం ప్రత్యేకంగా 3డీ ప్రింటెడ్ పాదరక్షలు(Footwear) అభివృద్ధి చేశారు బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISC)డిపార్టుమెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు. ఇందుకు కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ రిసెర్చ్(KIER) తగిన సహకారం అందించింది.
శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 3డీ ప్రింటెడ్ చెప్పులు(Footwear) మధుమేహ రోగుల నడక తీరును నియంత్రించి, గాయాలు ఎక్కువ కాకుండా అడ్డుకొంటాయట. ఒకవేళ అప్పటికే గాయాలైనా అవి త్వరగా మానిపోవడానికి, మరోచోట కొత్త గాయాలు కాకుండా చూస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాలు ఎలాంటి ఆకృతిలో ఉన్న దానికి అనుగుణంగా మారిపోవడం వీటి ప్రత్యేకత. నడకను బట్టి చెప్పులు వాటంతట అవే సరిచేసుకుంటాయని పరిశోధకులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వాణిజ్యపరంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫూట్ సెక్యూర్, యోస్ర్తా ల్యాబ్ స్టార్టప్‌లతో భాగస్వామ్యం కానున్నట్టు తెలిపారు.
అరె ఏంట్రా ఇది : అత్తారింటికి వెళ్లేందుకు..పోలీస్ జీపునే దొంగలించాడు!
కాగా,శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటల తరబడి కూర్చోని ఉండటం, పోషక పదార్థాలు సరిగా లేని ఆహారం, వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు, మాంసాహారం, బేకరీ పదార్థాలు, నిల్వ ఉండే పచ్చళ్లు, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల దుష్ఫరిణామాలు డయాబెటిస్ (Diabetes)కి కారణం. స్టెరాయిడ్స్, కొన్ని రకాల వైరస్, ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం (Diabetes) వస్తుంటుంది. తరచుగా మూత్ర విసర్జన (పాలీయూరియా), పొడి గొంతు లేదా తరచుగా దాహం వెయ్యడం (పాలీడిప్సియా), కంటి చూపు(eye site) మందగించడం., కారణం లేకుండా ఆకస్మిక బరువు పెరుగుట లేదా బరువు తగ్గడం (weight loss), ఒక్కసారిగా నీరసం అలసటగా అనిపించడం అధికంగా ఆకలి వేయడం (Hungry) దీని ముఖ్య లక్షణాలు.
Mia Khalifa Car Collection: మియా ఖలీఫా కార్ కలెక్షన్..ఆమె వద్ద ఉన్న హాట్ అండ్ సెక్సీ రేంజ్ కార్లు ఇవే..
గర్భవతుల్లో 2 నుంచి 5 శాతం వరకు ఈ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ డయాబెటిస్‌కు సరిగా వైద్యం అందించకపోతే తల్లీ, బిడ్డలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రసవం తర్వాత డయాబెటిస్ ఉండవచ్చు. వాకింగ్ (walking) చేస్తే డయాబెటిస్ అదుపులో పెట్టవచ్చు. రాత్రిపూట భోజనం తర్వాత వాకింగ్ చేసిన వారిలో ఏకంగా 22 శాతం వరకు షుగర్ లెవెల్స్ తగ్గినట్లు పరిశోధకులు వివరించారు. ఇలా వాకింగ్ చేస్తే మధుమేహం సమస్య దరిచేరదని చెబుతున్నారు. శరీరానికి మానసిక, శారీరక ఉల్లాసం దొరుకుతుందట. వారి పనితీరు సైతం మెరుగైనట్లు ఆ రిపోర్టులో తెలిపారు. అయితే వెల్లుల్లి (Garlic)తో మధుమేహం నుంచి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లి ప్రయోజనం ఎంతవరకో తెలుసుకుందాం.... వెల్లుల్లి (garlic)లో ఔషధ గుణాలు ఎక్కువ. ఇక వెల్లుల్లి వేసిన వంటలు చక్కని రుచి, వాసన (Smell) వస్తాయి. శరీరంలోని ఇంకా వ్యాధులకు (Diseases) చెక్ పెట్టే శక్తి వెల్లుల్లికి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.