హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

HIV Transmission: ఈ పరికరంతో హెచ్‌ఐవీ సంక్రమణకు అడ్డుకట్ట.. అభివృద్ది చేసిన పరిశోధకులు.. ఎలా పనిచేస్తుందంటే?

HIV Transmission: ఈ పరికరంతో హెచ్‌ఐవీ సంక్రమణకు అడ్డుకట్ట.. అభివృద్ది చేసిన పరిశోధకులు.. ఎలా పనిచేస్తుందంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హెచ్‌ఐవీ సంక్రమణను నివారించడానికి కండోమ్‌ వాడకం ఉత్తమమైన మార్గం అయినప్పటికీ, ఈ కొత్త పరికరంతో పూర్తి స్థాయిలో హెచ్​ఐవీకి అడ్డుకట్ట వేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

దశాబ్ధాలుగా ప్రపంచ జనాభాను బయపెడుతోన్న హెచ్‌ఐవీ ఎయిడ్స్​కు ఇప్పటి వరకు చికిత్స లేదు. నివారణ ఒక్కటే దీనికి ఏకైక మార్గం. అయితే ఈ అంటు వ్యాధి​ నివారణకు మందు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. వారి ప్రయోగాలు ఫలించే దిశగా ఒక ముందడుగు పడింది. హెచ్​ఐవీ సంక్రమణను ఆపడానికి కొత్తగా ‘స్మార్ట్ సెగ్మెంటెడ్ డివైస్‌'ను రూపొందించారు శాస్త్రవేత్తలు. దాని​ పేరే ఇంట్రా వాజినల్ రింగ్(ఐవీఆర్) డివైజ్​. దీన్ని మెడికల్-గ్రేడ్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు. ఈ డివైజ్​ హెచ్‌ఐవీ సంక్రమణకు అడ్డుకట్ట వేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మహిళలు తమను తాము రక్షించుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని చెబుతున్నారు.

హెచ్‌ఐవీ సంక్రమణను నివారించడానికి కండోమ్‌ వాడకం ఉత్తమమైన మార్గం అయినప్పటికీ, ఈ కొత్త పరికరంతో పూర్తి స్థాయిలో హెచ్​ఐవీకి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. ఈ పరికరం ప్రధానంగా సెక్స్ వర్కర్లు, కండోమ్​ వాడకుండా సెక్స్​లో పాల్గొనాలనుకునే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇది వారికి ప్రోటెక్షన్​గా నిలిచి.. హెచ్​ఐవీ సోకకుండా కాపాడుతుందని స్పష్టం చేశారు. కాగా, శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ సరికొత్త డివైజ్​ను ఇంట్రావాజినల్ రింగ్ (ఐవిఆర్)గా పేర్కొంటారు. దీన్ని స్త్రీ జననేంద్రియ మార్గంలోకి ప్రవేశపెట్టి పరిశోధన చేశారు. ఈ పరికరం ద్వారా రెండు జౌషధాలను పంపిణీ చేశారు. వాటిలో ఒకటి FDA- ఆమోదించిన హైడ్రాక్సీక్లోరోక్విన్ (HCQ) జౌషధం కాగా, మరొకటి నానోమెడిసిన్​ జన్యు పదార్థం. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

దీనిపై యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూకు చెందిన ఫార్మసీ విభాగ ప్రొఫెసర్, అధ్యయన రచయిత ఇమ్మాన్యుయేల్ హో మాట్లాడుతూ.. ‘‘హెచ్​ఐవీ సంక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు IVR పరికరాన్ని రూపొందించాం. ఇది HIV సంక్రమణ ప్రక్రియను కారణమయ్యే విభిన్న అంశాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. దీనిలో భాగంగా రెండు ప్రత్యేకమైన జౌషధాలను స్త్రీ జననాంగాలోకి పంపిణీ చేస్తుంది. తద్వారా ఇవి వారికి ప్రొటెక్షన్​గా నిలుస్తాయి” అని చెప్పారు. కాగా, శాస్త్రవేత్తలు తమ అధ్యయన ఫలితాలను జర్నల్ డ్రగ్ డెలివరీ అండ్ ట్రాన్స్​లేషనల్ రీసెర్చ్​లో ప్రచురించారు.

సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

ఈ పరికరం కోసం చేపట్టిన ప్రయోగంలో శాస్త్రవేత్తలు కెన్యాలోని నైరోబి విశ్వవిద్యాలయం సహకారం తీసుకున్నారు. స్త్రీ యోని మార్గం ద్వారా దీన్ని ప్రయోగించి పరిశీలన జరిపారు. అయితే, ఇది లైంగిక సంపర్కం జరిగే సమయంలోనే పనిచేస్తుందని వారి పరిశోధనలో తేలింది. ఆ సమయంలో వారి జననేంద్రియ మార్గంలో pH వాల్యూ పెరగడానికి దోహదం చేస్తుందని, తద్వారా హెచ్​ఐవీ సంక్రమణ నుంచి బయటపడవచ్చని పేర్కొన్నారు. ఈ ఐవిఆర్ విధానం మహిళలకు హెచ్ఐవి సంక్రమణ నుంచి తమను తాము రక్షించుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. ఈ పరికరం హెచ్ఐవీ నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగించే డ్రగ్స్​ వాడకాన్ని బాగా తగ్గిస్తుంది. మరోవైపు అనేక సంక్రమణ వ్యాధుల నుంచి రక్షించి ఆనవసర మెడికల్​ ఖర్చులను కూడా బాగా తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

First published:

Tags: Lifestyle, Medical Research

ఉత్తమ కథలు