హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Thyroid Diet: థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా..? సమస్యకు చెక్ పెట్టే స్పెషల్‌ ఫుడ్ ఐటెమ్స్ ఇవే..

Thyroid Diet: థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా..? సమస్యకు చెక్ పెట్టే స్పెషల్‌ ఫుడ్ ఐటెమ్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

థైరాయిడ్ గ్రంధి మనిషి మెడ కింది భాగంలో ఉంటుంది. ఇది థైరాక్సిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. మన జీవక్రియ రేటు(మెటబాలిజం)ను నియంత్రించడంలో థైరాయిడ్ గ్రంధి, థైరాక్సిన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సమస్యతో అనేక మంది బాధపడుతున్నారు. ప్రాబ్లమ్‌ను తగ్గించుకోవడానికి స్పెషల్ ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటున్నారు. అయితే ఆహారపు అలవాట్లలో(Food Habits) మార్పులు చేసుకుంటే థైరాయిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పరిశోధనల్లో తేలింది.

థైరాయిడ్ గ్రంధి (Thyroid Gland) మనిషి మెడ కింది భాగంలో ఉంటుంది. ఇది థైరాక్సిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. మన జీవక్రియ రేటు(మెటబాలిజం)ను నియంత్రించడంలో థైరాయిడ్ గ్రంధి, థైరాక్సిన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తాయి. ఒకవేళ ఈ హార్మోన్ (Harmones) హెచ్చుతగ్గులకు గురైతే హైపర్ లేదా హైపో థైరాయిడిజం సమస్యలు వస్తాయి. దీన్నే థైరాయిడ్ ప్రాబ్లమ్ అంటారు. దీర్ఘకాలంలో ఇది ఇదర సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టే శక్తి కొన్ని రకాల పోషకాలకు ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటి, దేని నుంచి లభిస్తాయో తెలుసుకుందాం.

* సెలీనియం

ఆక్సిడేషన్ స్ట్రెస్ కారణంగా శరీర గ్రంధులు, ముఖ్యంగా థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయకపోవచ్చు. అయితే ఈ ప్రభావాన్ని సెలీనియం నిరోధించగలదు. ట్యాబ్లెట్ల ద్వారా వైద్యులు ఈ పోషకాన్ని తీసుకోమని సలహా ఇస్తారు. కొన్ని ఆహారపదార్ధాల్లో కూడా ఈ మినరల్ సహజంగా ఉంటుంది. చేపలు, చికెన్, బ్రౌన్ రైస్, గుడ్లు, పుట్టగొడుగులు, ఆకుకూరలు, ఆరటిపండ్లు, బాదం పప్పుల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంలో ఉండేలా చూసుకుంటే థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

* అయోడిన్

థైరాయిడ్ గ్రంధి పనితీరు సక్రమంగా ఉండాటంటే, శరీరానికి తగినంత అయోడిన్ అందాలి. ఇందుకు అయోడిన్ కలిగిన ఉప్పును మాత్రమే వాడాలి. అలాగే సీ ఫుడ్‌లో కూడా అయోడిన్ లభిస్తుంది. చవకైన ఉప్పులో ఈ పోషకం ఉండదు. శాకాహారుల్లోనే థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. కాబట్టి వీరు ఐయోడిన్ ఇన్‌టేక్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

* విటమిన్ డి

విటమిన్ డి లోపం ఉన్న వారు కూడా థైరాయిడ్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైద్యులు కనుగొన్నారు. కాబట్టి ఆహారంలో ఈ పోషకం తప్పకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్ డి లోపం ఉన్న వారు థైరాయిడ్ సమస్యతో పాటు, జుట్టు రాలడం, నిద్రలేమి, అలసట, యముకల నొప్పి, డిప్రెషన్‌తో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు గుడ్డులో ఉండే పచ్చ సొన, సాల్మన్ చేప, పాలు, పాల ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవాలి.

* ఐరన్

ఐరన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలలో ఎనీమియా (ఐరన్ లోపం) సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే మహిళలకే ఈ థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి ఐరన్ పుష్కలంగా లభించే ఆకుకూరలు, చేపలు, కాజు, బాదం, అంజీర, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి.

Digestion Problems: డైజెషెన్ ప్రాబ్లమ్‌కు కారణాలు ఇవే.. ఈ తప్పులు చేస్తే అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్లే..

Contraceptives: గర్భనిరోధక మాత్రలు వాడితే పిల్లలు అసలు పుట్టారా..? వీటిపై ఉన్న అపోహలు ఇవే.. 

* విటమిన్ బి12

థైరాయిడ్ సోకిన వారిలో బి12 లోపం 40 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. మాంసాహారంలో నుంచే బి12 శరీరానికి తగినంత అందుతుంది. శాకాహారులు అయితే సోయా ప్రొడక్ట్స్‌ను ఆహారంలో తీసుకోవాలి. బి12 సప్లిమెంట్లను కూడా వైద్యుల సలహాతో వాడవచ్చు. చేపలు, చికెన్, గుడ్డు, పాలు లాంటి వాటితో అందే ఈ పోషకంతో థైరాయిడ్‌కి చెక్ పెట్టవచ్చు.

* జింక్

థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి జింక్ ఖనిజం అవసరం. ఇది T3, T4 సీరం లెవల్స్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH) మేనేజ్‌మెంట్‌కు అవసరమైన పోషకం ఇది.

First published:

Tags: Health benefits

ఉత్తమ కథలు