హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Republic Day: స్కూల్ లేదా కాలేజీలో రిపబ్లిక్‌ డే స్పీచ్‌తో అదరగొట్టాలనుకుంటున్నారా..? అయితే, ఈ టిప్స్‌ మీకోసమే

Republic Day: స్కూల్ లేదా కాలేజీలో రిపబ్లిక్‌ డే స్పీచ్‌తో అదరగొట్టాలనుకుంటున్నారా..? అయితే, ఈ టిప్స్‌ మీకోసమే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Republic Day: రిపబ్లిక్‌ డే సందర్భంగా స్పీచ్‌ ఇవ్వడానికి స్టూడెంట్స్ చాలామంది రెడీ అవుతారు. అలాగే గ్రామాల్లో నిర్వహించే వేడుకల్లోనూ గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడటానికి చాలామంది సిద్ధమవుతారు. ఈ విషయంలో కొన్ని టిప్స్‌ మీకు ఎంతో ఉపయోగపడతాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇంకో మూడురోజుల్లో (జనవరి 26న) 74వ రిపబ్లిక్‌ డే (Republic Day) రానుంది. ఆరోజు ఢిల్లీ (Delhi)లో జరిగే త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌) చేసే పరేడ్‌ను చూసేందుకు లక్షల్లో జనాలు తరలివస్తారు. ముఖ్య అతిథిగా ఇతర దేశాల ప్రధాని లేదా అధ్యక్షుడు హాజరవుతారు. దీనికోసం ఢిల్లీలోని కర్తవ్య్‌ పథ్‌లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అన్ని స్కూళ్లు, కాలేజీల్లో కూడా రిపబ్లిక్‌ డేకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు పెడుతుంటారు. అందులో భాగంగా ఎలక్యూషన్‌ (వక్తృత్వ) పోటీలో రిపబ్లిక్‌ డే స్పీచ్‌ ఇవ్వడానికి స్టూడెంట్స్ రెడీ అవుతారు. అలాగే గ్రామాల్లో నిర్వహించే వేడుకల్లోనూ గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడటానికి చాలామంది సిద్ధమవుతారు. ఈ విషయంలో కొన్ని టిప్స్‌ మీకు ఎంతో ఉపయోగపడతాయి.

* ముందుగా.. రిపబ్లిక్‌ డే గురించి క్లుప్తంగా..

మీరు స్పీచ్‌ ఇచ్చే ముందు రిపబ్లిక్‌ డేకు సంబంధించి కొన్ని ముఖ్యమైన, ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలి. ఇవి తెలుగులో దీన్ని గణతంత్ర దినోత్సవం అంటారు. చాలామందికి ఇండిపెండెన్స్‌ డేకు, రిపబ్లిక్‌ డేకు తేడా తెలియదు. 1947 ఆగస్టు 15న ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చింది. కానీ 1950 వరకు బ్రిటీషర్స్‌ తయారు చేసిన గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ 1935 ఆధారంగానే చట్టాలు నడిచేవి. జనవరి 26 1950న డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ సారథ్యంలో తయారు చేసిన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ గొప్ప విజయాన్ని రిపబ్లిడేగా మనం సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం.

చేతిరాతతో రాసిన అతిపెద్ద రాజ్యంగం మనదే. దీన్ని రాయడానికి రెండు సంవత్సరాల, 11 నెలల, 17 రోజులు పట్టింది. అమెరికా రాజ్యాంగం కన్నా 30 రెట్లు పెద్దది. భారత రాజ్యాంగం ఇంగ్లీష్‌ వెర్షన్‌ను ప్రేమ్‌ బిహారీ నారాయణ్‌ రైజాదా అనే వ్యక్తి తన చేత్తో రాశారు. హిందీ వెర్షన్‌ను వసంత్‌ కృష్ణన్‌ వైద్య రాశారు. మొదటిసారిగా 1955లో రిపబ్లిక్‌ డే సందర్భంగా రాజ్‌పథ్‌లో పరేడ్‌ నిర్వహించారు. ఈ సంబరాలు నాలుగు రోజుల పాటు అంటే జనవరి 29 వరకు జరుగుతాయి.

* స్పీచ్ ఎలా?

రిపబ్లిక్ డే స్పీచ్‌ చాలామంది ఇస్తుంటారు. కాన్సెప్ట్ ఒకటే అయినా, ప్రసంగంలో కొన్ని విషయాలు హైలెట్‌గా నిలిస్తే, వినేవారు ఇంప్రెస్ అవుతారు. అందుకే అందరూ ప్రసంగాలు ఇచ్చినా, కొందరివి మాత్రమే బాగుంటాయి. మరికొందరు ఎక్కడ ఏ పాయింట్‌ చెప్పాలో తెలియక గందరగోళానికి గురవుతుంటారు. అలా కాకుండా ఓ వరుస క్రమంలో చెబితే మీ స్పీచ్‌ అందర్నీ కట్టిపడేస్తుంది. అందుకోసం ఈ టిప్స్‌ తప్పక పాటించండి.

* అవగాహన, ప్రణాళిక

మనం చెప్పే టాపిక్‌పై స్పష్టమైన అవగాహన ఉండాలి. అలాగే వినే ఆడియన్స్‌ ఎవరనేది కూడా ముఖ్యమే వారి వయసుకు తగ్గట్టుగా మన స్పీచ్‌ ఉండాలి. మన స్పీచ్‌ 74వ రిపబ్లిక్‌ డేకు సంబంధించింది, అక్కడ ఉండేది మన వయసు వాళ్లే. దాని బట్టి మీరు రెడీ అవ్వండి.

మీ స్పీచ్‌ పక్కా ప్రణాళిక ప్రకారం.. పాయింట్లు అన్నీ వరుస క్రమంలో ఉన్నాయో లేదో చూసుకోండి. ముందు ఇంట్రడక్షన్‌ (ఉపోద్ఘాతం), బాడీ (విషయం), కన్‌క్లూజన్‌ (ముగింపు) పద్ధతిలో ఉండేలా చూసుకోండి. మధ్యమధ్యలో ఆసక్తికర అంశాలు, ఉదాహరణలతో చెప్తే వినేవారికి బోర్‌ కొట్టదు.

ఇది కూడా చదవండి :  US Visa: వీసా వెయిటింగ్ పీరియడ్‌పై అమెరికా కీలక ప్రకటన.. ఇండియన్స్‌కు మద్దతుగా నిర్ణయాలు

* ప్రాక్టీస్, కాన్ఫిడెన్స్

మీరు చెప్పేదాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్‌ చేయండి. దీని వల్ల విషయంపై మంచి పట్టు వస్తుంది. స్టేజ్‌ మీదకు వెళ్లినా భయం ఉండదు. తెలిసిన అంశమే అనే ధీమాతో బాగా ప్రజెంట్‌ చేయగలరు. స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత మీకు తెలిసిన విషయాన్నే ఆత్మవిశ్వాసంతో (కాన్ఫిడెంట్)గా చెప్పండి. అన్ని వైపులా ఉన్న ఆడియన్స్‌ను కవర్‌ చేస్తూ, వారి అటెన్షన్‌ను మీ వైపు ఉండేలా చూసుకోండి.

* ముగింపే హైలెట్

మీ స్పీచ్‌ ముగిసే వరకు ఆడియన్స్‌ అంతా శ్రద్ధగా వినేలా చూసుకోండి. అందుకోసం వాళ్లను ఎంగేజ్‌ చేసేలా ఆసక్తికరమైన విషయాలు చెప్పండి. లేటెస్ట్ న్యూస్ రిపోర్ట్స్ ప్రస్తావించండి. వాటిని ఉదాహరణగా పేర్కొంటూ, చివర్లో ఓ మంచి మెసేజ్‌తో ముగించండి. ఈ టిప్స్‌తో మీ రిపబ్లిక్ డే స్పీచ్ అందరికంటే తప్పకుండా హైలెట్‌గా నిలుస్తుంది.

First published:

Tags: Republic Day 2023, Schools, Students

ఉత్తమ కథలు