హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Salt Consumption: మామూలు ఉప్పుకంటే అది వాడటమే ఆరోగ్యానికి మంచిది.. తేల్చిన తాజా అధ్యయనం..

Salt Consumption: మామూలు ఉప్పుకంటే అది వాడటమే ఆరోగ్యానికి మంచిది.. తేల్చిన తాజా అధ్యయనం..

Salt

Salt

Salt Consumption: ఉప్పు వాడకాన్ని పూర్తిగా ఆపేయడం కూడా ఆరోగ్యానికి హానికరమనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంత మొత్తంలో ఉప్పు తీసుకుంటే శరీరానికి మంచిది, ఎలాంటి సాల్ట్స్ ఎంత మొత్తంలో తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

వంటకాల్లో ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్‌ వేసినా.. ఉప్పు(Salt) తక్కువైతే రుచించదు. చప్పగా ఉండే ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడరు కూడా. అలాగని ఉప్పు వాడకం పెరిగితే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు (High Blood Pressure), గుండె జబ్బులు (Heart Diseases) వస్తాయని చెబుతున్నారు. అయితే ఉప్పు వాడకాన్ని పూర్తిగా ఆపేయడం కూడా ఆరోగ్యానికి హానికరమనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంత మొత్తంలో ఉప్పు తీసుకుంటే శరీరానికి మంచిది, ఎలాంటి సాల్ట్స్ ఎంత మొత్తంలో తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.

* సోడియం సాల్ట్‌ ఓకే

అధిక రక్తపోటు ఉన్నవారు సాధారణ సాల్ట్‌ బదులు లో-సోడియం సాల్ట్‌ను వినియోగించడం మేలని పరిశోధనలు చెబుతున్నాయి. పొటాషియం క్లోరైడ్‌ ఉన్న సాల్ట్‌కు ప్రత్యామ్నాయం లో-సోడియం సాల్ట్‌. ఈ ఉప్పు వాడకం వల్ల సోడియం శరీరానికి తక్కువగా అందుతుంది. అలాగే పొటాషియం స్థాయిలను పెంచుతుంది. ఇలా రక్తపోటును తగ్గించడానికి కారణమవుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

* పొటాషియం ఉండాల్సిందే..

పొటాషియం ఎక్కువగా ఉన్న సాల్ట్‌ వినియోగిస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. అందుకే మనం వాడే నేచురల్ సాల్ట్ అయిన సోడియం క్లోరైడ్‌కు బదులుగా లో- సోడియం, పొటాషియం ఉండే సాల్ట్‌ను పరిమితంగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వంటి పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులలో గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రీసెర్చర్స్‌ స్పష్టం చేశారు.

* ఆ రోగులకు మంచిది..

లో-సోడియం సాల్ట్‌ వినియోగంతో సానుకూల ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెప్పారు. సాల్ట్‌ ప్రత్యామ్నాయాల ద్వారా సోడియం తీసుకోవడం తగ్గుతుంది. శరీరానికి పొటాషియం అందుతుంది. ఇది అధిక రక్తపోటు ఉన్న రోగులకు మేలు చేస్తుంది.

లో-సోడియం సాల్ట్‌ తీసుకోవడం, పొటాషియం శరీరానికి అందించడం వల్ల కలిగే ప్రభావాలపై మరింత రీసెర్చ్‌ చేయాల్సిన అవసరం ఉందని తాజా రిసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. సీరం పొటాషియం లెవల్స్‌, హైపర్‌కలేమియా రిస్క్‌పై డైటరీ పొటాషియం, పొటాషియం సమృద్ధిగా ఉన్న సాల్ట్‌ ప్రత్యామ్నాయాలను వినియోగించడం వల్ల కలిగే ప్రభావంపై ఇంకా రీసెర్చ్‌ చేయాల్సిన అవసరం ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక తెలిపింది.

* ఎక్కువ ఉప్పు ఎలా అందుతుంది?

భోజనం, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, ఊరగాయలు వంటి ఫుడ్స్ నుంచి ప్రతిరోజూ ఎక్కువ ఉప్పు శరీరంలో చేరుతుంది. అందుకే ఎక్కువ కాలం పాటు ఇలాంటి పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనికి సంబంధించిన రిసెర్చ్ రిపోర్ట్ ఒకటి యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైంది. ‘యాడింగ్‌ సాల్ట్‌ టూ ఫుడ్స్‌ అండ్‌ హజార్డ్‌ ఆఫ్‌ ప్రీమెచ్యూర్‌ మోర్టాలిటీ’ పేరుతో పబ్లిష్ అయిన ఈ అధ్యయనంలో.. ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉప్పును ఉపయోగించడం వల్ల అకాల మరణాల ముప్పు పెరుగుతుందని పేర్కొన్నారు. ఇది ఆయుర్దాయంపై కూడా ప్రభావం కనిపిస్తోందని పరిశోధకులు కనుగొన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Blood pressure, Health benefits, Health Tips, Salt

ఉత్తమ కథలు