Health tips: బంగారు పట్టీలు ధరిస్తే బాధలు తప్పవు..

ఫ్యాషన్ కావొచ్చు.. పది మంది ముందు సంపదను తెలిపే తాపత్రయం కావొచ్చు.. ఏదైనా సరే.. ఈ మధ్యకాలంలో పాదాలకు బంగారంతో చేసిన పట్టిలు పెడుతున్నారు చాలామంది. కానీ, ఇది సైన్స్‌పరంగానూ, సాంప్రదాయ విషయంలోనూ సరికాదు..

Amala Ravula | news18-telugu
Updated: January 17, 2019, 12:09 PM IST
Health tips: బంగారు పట్టీలు ధరిస్తే బాధలు తప్పవు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 17, 2019, 12:09 PM IST
మహిళలు కాళ్లకు గజ్జెలు ధరించి ఇంట్లో నడిస్తే.. సాక్షాత్తూ మహాలక్ష్మీ దేవి ఇంట్లో కొలువైనట్లుగా ఉంటుంది. అందుకే.. మహిళల ఆభరణాల్లో పట్టీలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముందు వెండి పట్టీలు పాదాలపై చేరి గల్లు..గల్లుమంటూ మోగితే..నేడు ఫ్యాషన్ పేరిట వాటి స్థానంలో పంచలోహాలు, బంగారం వంటివి వచ్చి చేరాయి.
ఇక చాలామంది బంగారు పట్టీలను తమ స్టేటస్ సింబల్‌గా చూపించాలని తాపత్రయపడుతున్నారు.

అయితే, ఇది ఎంతమాత్రం మంచిది కాదు. సంప్రదాయంగానూ కలిసిరాదు.. సైన్స్‌పరంగా సరికాదు.. లక్ష్మీ దేవికి పసుపు రంగు అంటే మహా ఇష్టం. బంగారం పసుపు రంగులోనే ఉంటుంది. పైగా శ్రీ మహాలక్ష్మీకి మరింత ప్రియం. అంతటి ప్రీతిపాత్రమైన పుత్తడితో పట్టీలు చేయించుకుని కాళ్లకు ధరించడం ఆమెను అవమానించనట్లవుతుందని పండితులు అంటున్నారు.
ఇక సైన్స్ పరంగా కూడా బంగారాన్ని కాళ్లకు ధరించడం మంచిది కాదు. పాదాలకు వెండిన ధరిస్తే ఉష్ణం తగ్గిపోతుంది. తలలోని వేడిని తగ్గిస్తుంది. నడుమునొప్పి, మోకాలి నొప్పి, హిస్టీరియా వంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు. అదే విధంగా మెదడు పనితీరు మెరుగ్గా మారి ఒత్తిడిదూరమవుతుంది. అదే బంగారమైతే ఇంకా ఎక్కువగా వేడిని పుట్టిస్తుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి.


అందువల్ల మెడ, చేతులకు మాత్రమే ధరించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా.. అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు.

First published: January 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు