Home /News /life-style /

RELATIONSHIP TIPS TO SOLVE COLD WAR BETWEEN MARRIED COUPLE PVN

Tips For Maried Couple : దంపతుల మధ్య కోల్డ్ వార్..ఈ టిప్స్ పాటిస్తే అన్నీ తొలగి ఫుల్ హ్యాపీ

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Cold war between couple : వివాహ సంబంధాన్ని జీవితాంతం సంతోషంగా కొనసాగించడానికి చాలా శ్రమ అవసరం పడుతుంది. చాలా సార్లు తెలిసి లేదా తెలియకుండా జరిగే కొన్ని పొరపాట్లు కారణంగా జీవితభాగస్వామితో సంబంధం కూడా చెడిపోతుంది.

Tవివాహిత సంబంధం యొక్క థ్రెడ్ చాలా సున్నితమైనది. వివాహ సంబంధాన్ని జీవితాంతం సంతోషంగా కొనసాగించడానికి చాలా శ్రమ అవసరం పడుతుంది. చాలా సార్లు తెలిసి లేదా తెలియకుండా జరిగే కొన్ని పొరపాట్లు కారణంగా జీవితభాగస్వామి(Partner)తో సంబంధం కూడా చెడిపోతుంది. అందువల్ల, ఎల్లప్పుడూ మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా మీ రిలేషన్ షిప్(Relationship) లో కొనసాగుతున్న కోల్డ్ వార్(Cold war) కి ఫుల్ స్టాప్ పెట్టేసి..తిరిగి మీ జీవితంలో ఆనందాన్ని పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం,వారి మాటలను పట్టించుకోవడం,షాపింగ్,డిన్నర్ కు వారిని తీసుకెళ్లడం వంటి కొన్ని చర్యల ద్వారా మీ రిలేషన్ షిప్ లో కొనసాగుతున్న చీలికలు తొలగి..మీ జీవితంలో ఆనందాన్ని మళ్లీ పొందవచ్చు

ప్రాధాన్యతలను అర్థం చేసుకోండి
మీ భాగస్వామిని సంతోషపెట్టాలంటే ముందుగా మీరు వారిని అర్థం చేసుకోవాలి. వారికి ఏమి కావాలి, ఏమి చేయాలి, వారి మనస్సు, ఏమి చేయకూడదు అనేది అర్థం చేసుకోవాలి. వారు ఎక్కడికి ప్రయాణించడానికి ఇష్టపడతారు, వారు ఏమి తినడానికి ఇష్టపడతారు, వారు ఇష్టపడని వస్తువులు, వారు ఎక్కువగా ఇష్టపడే విషయాలు మొదలైనవి తెలుసుకుంటే మీరు వారిని సంతోషంగా ఉంచవచ్చు.

Love Horoscope : ఈ రాశుల వాళ్లకి జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం



Pimples : ఆ అలవాట్ల వల్లే మొఖంపై మొటిమలు వస్తాయంట

షాపింగ్, డిన్నర్‌కు వెళ్లండి
మీ భాగస్వామి యొక్క ప్రతి చిన్న, పెద్ద విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. అది చిన్న విసయమే కదా అని లైట్ గా తీసకోవడం లాంటివి మాత్రం అస్సలు చేయోద్దు. మీ దృష్టిలో చిన్నవిషయమే అనిపించేది మీ భాగస్వామి దృష్టిలో పెద్ద విషయం అవ్వొచ్చు. ఇక,కాలానుగుణంగా మీరు వారిని కొత్త ప్రదేశాలకు వాకింగ్ కోసం లేదా క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం తీసుకెళ్లవచ్చు. ఇది వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది కాకుండా మీరు కొత్త బట్టలు తీసుకోవడానికి వారిని షాపింగ్‌కు తీసుకెళ్లవచ్చు.

భాగస్వామి మాట వినండి
మీరు ఎల్లప్పుడూ మీ భాగస్వామి చెప్పేది వినాలి. భాగస్వామి మాట వినని వారు చాలా మంది ఉన్నారు. ఇలా చేయడం ద్వారా వారి మనస్సు బాధపడుతుంది. దీంతో రిలేషన్ షిప్ లో ప్రాబ్లం మొదలవుతుంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ వారి మనస్సును వినాలి. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారు, వారు ఏమి మాట్లాడుతున్నారు మొదలైనవి అన్నీ ఓపికకగా తెలుసుకోవాలి. ఈ కారణంగా రిలేషన్ఫిప్ ఎల్లప్పుడూ మధురంగా ​​ఉంటుంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Married women, Relationship, Wife and husband

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు