Home /News /life-style /

RELATIONSHIP TIPS IF YOUR PARTNER SHOWS THESE SIGNS IT MEANS SHE IS GOING TO BREAK UP WITH YOU SK

Relationship: మీ రిలేషన్‌షిప్ బ్రేకప్ అయ్యేది అప్పుడే.. ఈ సంకేతాలతో ఈజీగా కనిపెట్టండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Relationship: రిలేషన్‌షిప్‌లో గొడవలు సహజం. కానీ వాటి కారణంగా కొందరు విడిపోతారు. మరికొందరు సర్దుకుపోతారు. మరి మీ భాగస్వామి మీకు బ్రేకప్ చెప్పబోతున్నారన్న విషయాన్ని ముందుగానే ఎలా కనిపెట్టాలో తెలుసా?

    ఇద్దరు వ్యక్తులు ఒక బంధంలో ఉన్నప్పుడు.. కలిసి జీవిస్తున్నప్పుడు.. చిన్న చిన్న గొడవలు సహజం. అది వివాహ బంధమైనా.. సహజీవనమైనా..! కొందరు సర్దుకుపోతుంటారు. మరికొందరు వాటిని కారణంగా చూపి విడిపోతుంటారు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, అర్థం చేసుకునే తత్వం వంటివి ఉండే ఆ గొడవల వల్ల పెద్ద ఇబ్బందేమీ ఉండదు. ప్రతి ఒక్కరి బంధంలో కొన్ని ఆనందమైన క్షణాలుంటాయి. మరికొన్ని బాధ కలిగించే సందర్భాలుంటాయి. మనం ప్రేమిస్తున్నా.. ఎదుటివారు మనల్ని ప్రేమించట్లేదని అనిపిస్తే.. అది ఎంతో నరకంగా అనిపిస్తుంది. ఎదుటివారు మనల్ని ప్రేమించట్లేదు.. వారు మనకు బ్రేకప్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసినప్పుడు మనం దానిని అర్ధం చేసుకోవాలి. అందుకోసం అన్ని విధాలా సిద్దపడాలి. బ్రేకప్ అనేది ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవడం లేదా ఎదుటివారు మీరు తమకు సరికాదని నిర్ణయించుకొని వదిలేయడం వల్ల జరుగుతుంటాయి. అది ఎలాంటి బ్రేకప్ అయినా బాధ మాత్రం తప్పదు. కానీ అనుకోకుండా సడెన్‌గా జరగడం కంటే.. ముందుగానే ఊహించింది జరగడం వల్ల కాస్త బాధ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ భాగస్వామి మీకు బ్రేకప్ చెప్పబోతున్నారన్న విషయాన్ని ఈ లక్షణాల ఆధారంగా కనుక్కోండి.

    1. ప్రయత్నమేమీ లేదా?

    సాధారణంగా ఒక బంధంలో ఉన్నప్పుడు గొడవ జరిగితే ఎదుటివారికి నచ్చజెప్పడం, మామూలు సమయాల్లో వారిపై ప్రేమ చూపించడం వంటివి చేయడం సహజం. కానీ మీరు ఎదుటివారి సమయం గడపడానికి.. వారిపై ప్రేమ చూపించేందుకు ప్రయత్నిస్తున్నా.. వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోతే వారు మీపై ఆసక్తి చూపించట్లేదని అర్థం. ఇలాగే కొనసాగితే వారు మీకు బ్రేకప్ చెప్పేస్తారు.

    శృంగారానికి ముందు ఈ ఆహార పదార్థాలు తింటే రెచ్చిపోవడం ఖాయమట.. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..

    2. అవేవీ పంచుకోవట్లేదా?

    సాధారణంగా జంటలు వారికి సంబంధించిన విషయాలన్నింటినీ ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకూ వారికి సంబంధించిన రహస్యాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం అలాంటిది. కానీ మీపై ఆసక్తి చూపకుండా మీకు బ్రేకప్ చెప్పేందుకు సిద్ధమవుతున్నప్పుడు వారు మీతో ఎలాంటి విషయాలు పంచుకోరు. సరి కదా.. మీ నుంచి చాలా విషయాలను దాస్తుంటారు. మీరు వాటిని కనుక్కొని అడిగితే ఏదో ఒక కారణం చెబుతుంటారు. ఇలాంటి విషయాలు గమనిస్తే బ్రేకప్ దగ్గర్లో ఉందని గుర్తించండి.

    కంటి నిండా నిద్ర పోక చాలా రోజులైందా? అయితే, ఈ చిట్కాలు మీ కోసమే..

    3. ఆసక్తి చూపట్లేదా?

    ఇంతకుముందు ఆసక్తి చూపిన విషయాల్లో ఇప్పుడు ఏమాత్రం ఇష్టం కనబర్చకపోయినా.. మీకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా ఆలోచించాల్సిందే. ఇద్దరూ కలిసి ఇష్టంగా చేసే పనులు మీ ఇద్దరినీ దగ్గర చేస్తాయి. అవి కలిసి చేయకపోవడం అంటే మీరు దూరమవుతున్నట్లే.. అలాగే మీరిద్దరూ ఇంతకుముందు లైంగికంగా దగ్గరగా ఉన్నా.. ఇప్పుడు ఆ పేరే ఎత్తకపోతే కూడా ఆలోచించాల్సిందే. అవతలి వ్యక్తికి మీరంటే ఇష్టం తగ్గిపోయి దాన్ని ఎలా చెప్పాలో అర్థం కాకపోవడం వల్లే ఇలా మిమ్మల్ని దూరంగా ఉంచుతుంటారు.

    sexual stamina: మగవారిలో లైంగిక సామర్థ్యం పెంచుకోవాలంటే... ఈ ఆహారాలు తప్పక తినాల్సిందే..

    4. ప్లానింగ్ ఏమీ ఉండట్లేదా?

    సాధారణంగా దంపతులు లేదా ప్రేమికులు తమ భవిష్యత్తు ఇలా ఉండాలంటూ కలలు కనడం సహజం. సంవత్సరం తర్వాత ఇలా ఉండాలి. అవి కొనాలి అంటూ ప్లానింగ్ చేసుకోవడం కూడా సహజం. కానీ మీ ఇద్దరి భవిష్యత్తు గురించి మీరు మాట్లాడుతున్నా అవతలి వ్యక్తి పట్టించుకోకపోవడం, వారు కూడా అలాంటివి ప్లాన్ చేయకపోవడం వంటివి చేస్తుంటే ఇక మీ బంధం బ్రేకప్ దిశగా వెళ్తోందని భావించాల్సిందే..
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Life Style, Lifestyle, Relationship

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు