Home /News /life-style /

RELATIONSHIP 6 WAYS TO IMPROVE DIFFERENTIATION IN RELATIONSHIPS HERE IS EXPERT SUGGESTIONS GH SK

Relationship: మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? ఈ 6 విషయాలను తప్పకుండా తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక సంబంధం (Relationship) నాలుగు కాలాలపాటు దృఢంగా ఉండాలంటే ఒకరికి ఒకరు తమ అభిప్రాయాలను గౌరవించుకోవాలి. రిలేషన్‌షిప్‌లో ఉన్న ఒక వ్యక్తి తన విభిన్న ఆలోచనలు, భావాలు, కోరికలను ఏ భయం లేకుండా తన భాగస్వామికి తెలపాలి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
Differentiation In Relationships:  ఒక సంబంధం (Relationship) నాలుగు కాలాలపాటు దృఢంగా ఉండాలంటే ఒకరికి ఒకరు తమ అభిప్రాయాలను గౌరవించుకోవాలి. రిలేషన్‌షిప్‌లో ఉన్న ఒక వ్యక్తి తన విభిన్న ఆలోచనలు, భావాలు, కోరికలను ఏ భయం లేకుండా తన భాగస్వామికి తెలపాలి. విభిన్నంగా (Differentiation) ఉండే ఆ ఆలోచనలను భాగస్వామి సహించాలి. విభేదాలను లేదా డిఫరెంట్ ఒపీనియన్స్‌ని భాగస్వామికి సహించే సామర్ధ్యం ఉంటేనే ఆ బంధం ఎప్పటికీ విడిపోదు. అయితే భాగస్వాములు (Partners) తమ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. లేదంటే అది బంధం తెగిపోవడానికి కారణమవుతుంది. కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు ఏకీభవించకుండా చిన్నపాటి గొడవలు పెట్టుకోవడం మంచిదే. కానీ ఈ గొడవలు మళ్లీ వెంటనే కలిసిపోయే అంత చిన్నగా ఉండాలి. ఇరువురి మధ్య విభేదాలు అనేవి తీవ్రంగా ఉంటే అది బంధంపై పెద్ద ప్రభావం చూపవచ్చు. మరి ఒక రిలేషన్‌షిప్‌లో భాగస్వామికి భిన్నంగా ఉంటూ సొంత అభిప్రాయాలను ఎలా వ్యక్తపరచాలి? బంధాన్ని మరింత దృఢంగా ఎలా మార్చుకోవాలి? అనేది ఇప్పుడు చూద్దాం.



  1. మీరు మీ సమస్యలను మా భాగస్వామికి తెలియజేయడానికి ముందు.. ఆ సమస్యలను వివరించడం మీ భాగస్వామికి ఎలా అనిపిస్తుందో అర్థం చేసుకోవాలి. ఈ సమస్య చిన్నతనంలో మీరు చవిచూసిన ఒక చేదు అనుభవం కావచ్చు. లేదా మరేదైనా సమస్య కావచ్చు. సమస్య ఏదైనా సరే మీ భాగస్వామి ఆ సమస్య విన్న తర్వాత మీకు సపోర్టుగా నిలుస్తారా లేక మీతో మాట్లాడటమే మానేస్తారా అనేది అంచనా వేసుకొని ఆ తర్వాతే ఆ సమస్యలను వ్యక్తపరచాలి.

  2. తీవ్ర వాదనలు లేదా భావోద్వేగ సంభాషణల విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో చాలా బాధగా అనిపించింది కదా అని భాగస్వామిపై ఫిర్యాదు చేయడం లేదా వారిని నిందించడం సరికాదు. మీ గురించి మీకేం అనిపిస్తుందో.. మీ తప్పు ఏముందో ఆ విషయాల గురించే మాట్లాడాలి. అనవసరంగా భాగస్వామిని నిందించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు.

  3.  క్లిష్ట పరిస్థితుల్లో భాగస్వామికి అండగా మేమున్నామనే భావన కలిగించాలి. అలానే వారికి కూడా ఒక గుర్తింపు ఉందని ఫీల్ అయ్యేలా ప్రోత్సహించాలి. వారు రకరకాల ఎమోషన్స్ అనుభవించవచ్చు. వాటిని మీరు గుర్తించిన్నట్లు వారికి అర్థమయ్యేలా చెప్పడం మంచిది. తద్వారా వారు తమ భావాలను వ్యక్తీకరించడానికి భయపడరు. అలాగే ధైర్యంగా వారు మీతో అన్ని పంచుకోగలగుతారు.

  4.  చాలా మంది ప్రజలు కొన్నిసార్లు మన భాగస్వాములపై ​​మానసికంగా ఆధారపడతారు. అయితే ఇలా ఎమోషనల్‌గా ఆధారపడితే చివరికి ఆ అలవాటు అనేది మీకు చాలా చెడు చేయవచ్చు. ఎమోషనల్‌గా ఎవరిపైనా ఆధారపడకపోతేనే సంతోషంగా ఉండగలం. మనల్ని మనం సంతోష పెట్టుకోవడం.. మనల్ని మనం బుజ్జగించుకోవడం కూడా నేర్చుకోవాలి. ఆ విధంగా మనం మానసికంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఉండగలం. అలానే రిలేషన్‌షిప్‌లో క్లారిటీగా ఉండొచ్చు.

  5.  తగినన్ని ప్రశ్నలు అడగకపోతే భాగస్వామి ఏమి అనుకుంటున్నారు అనేది అస్సలు అర్థం కాదు. అప్పుడు మనస్సులో ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. అతిగా ఆలోచిస్తే ఆందోళన, ఒత్తిడి కూడా తలెత్తుతాయి. ఈ సమస్యలు రాకుండా అడగాలనుకున్న ప్రశ్నలను వెంటనే ఆడిగేయడం శ్రేయస్కరం.

  6. మీ భాగస్వామి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని.. దానిని గౌరవించడం చాలా ముఖ్యం. అదే సమయంలో మీరు మీ సొంత ఆలోచనా విధానాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మీ అనుబంధం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Life Style, Lifestyle, Love, Relationship

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు