Relationship mistakes: అబ్బాయిలూ.. ఈ ఏడింట్లో ఏ తప్పులు చేసినా.. మీ రిలేషన్ షిప్ ఫసక్..

ప్రతీకాత్మక చిత్రం

ముఖ్యంగా ఒక బంధంలో మహిళలు దగ్గరితనం చాలా కోరుకుంటారు. ఒకసారి మగవాళ్లు వారిని దూరం పెడుతున్నారని లేదా ప్రాధాన్యం ఇవ్వట్లేదని అనిపిస్తే.. వాళ్లు దూరమవుతూ పోతారు. మీ భాగస్వామి మీకు అలా దూరమవుతూ పోతుంటే మీరు కాస్త ప్రయత్నించి పరిస్థితులను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • Share this:
ఒక జంట జీవితాంతం ఆనందంగా ఉండాలంటే.. ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా ఒక బంధంలో మహిళలు దగ్గరితనం చాలా కోరుకుంటారు. ఒకసారి మగవాళ్లు వారిని దూరం పెడుతున్నారని లేదా ప్రాధాన్యం ఇవ్వట్లేదని అనిపిస్తే.. వాళ్లు దూరమవుతూ పోతారు. మీ భాగస్వామి మీకు అలా దూరమవుతూ పోతుంటే మీరు కాస్త ప్రయత్నించి పరిస్థితులను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే..

జతగా ఉండండి
అమ్మాయిలు ఎలాంటివారైనా సరే.. వారు తమ భాగస్వామితో కలిసి ఉండాలని కోరుకుంటారు. అందుకే ఎక్కడికైనా వెళ్లినప్పుడు వారితో కలిసి ఉండండి. మధ్యలో కాసేపు మీ స్నేహితులతో సమయం గడపడం సరైనదే కానీ పూర్తిగా ఒంటరిగా వదిలేయడం సరికాదు. దీనివల్ల తను ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

మానసికంగా బ్యాలన్స్డ్‌గా..
మీకు ఎన్నో టెన్షన్లు ఉండొచ్చు. కానీ బయట టెన్షన్లన్నీ ఇంటికి తీసుకొచ్చి మీ భార్య లేదా మీ గర్ల్ ఫ్రెండ్‌పై వాటి ప్రభావం చూపడం సరి కాదు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తను ఎంత కష్టపడి పనిచేసినా.. సాయంత్రం మిమ్మల్ని కలిసి ఆనందంగా మాట్లాడేందుకు అమ్మాయిలు వేచి చూస్తుంటారు. ఇలాంటప్పుడు మానసికంగా మీరు వారికి అందుబాటులో లేకపోతే వారు బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

హేళన చేయొద్దు..
చిన్న చిన్న జోక్స్ వేస్తూ నవ్వించడం సరైనదే. కానీ భాగస్వామిపై అదేపనిగా జోక్స్ వేస్తూ వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు. ముఖ్యంగా ఎవరైనా ఉన్నప్పుడు వారిని హేళన చేయడం మంచి పద్ధతి కాదు. తను ఏదైనా విషయాల్లో భయపడితే తనకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంటుంది.

స్నేహితులతో గడపడం..
ఒక రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉండడం మాత్రమే కాదు.. ఇద్దరికీ స్నేహితులు కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ పూర్తిగా స్నేహితులతోనే గడపడం కూడా సరికాదు. మీ స్నేహితులతో మీరు కలిసి ఉన్నప్పుడు వారిని కూడా అందులో ఇన్వాల్వ్ చేయండి. దీనివల్ల తను కూడా ఆనందంగా ఫీలవుతుంది.

తనకు సపోర్ట్ చేయకపోవడం
మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తుల ముందు తనని తక్కువ చేసి మాట్లాడడం, తనకు సపోర్ట్ చేయకపోవడం కూడా వారిని బాధిస్తుంది. మీ ఇద్దరి మధ్య బంధం ఎలా ఉన్నా సరే.. వేరే వ్యక్తుల ముందు తనని ఇబ్బంది పెట్టడం సరికాదు.

చెడు అలవాట్లు..
ఎక్కువగా తాగడం, సిగరెట్లు వంటి అలవాట్లు ఉంటే మీ భాగస్వామి మీతో ఉండడానికి ఇబ్బందిగా ఫీలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే తను ఏం ఫీలవుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మగవారిపై ఉంది.

నమ్మకద్రోహం చేయడం


అంతేకాదు.. రిలేషన్ షిప్ అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అందుకే వారికి అబద్దాలు చెప్పడం, మోసం చేయడం, వేరే అమ్మాయిలతో బంధాన్ని కొనసాగించడం వంటివి చేయడం వల్ల మీ భాగస్వామిని బాధపెట్టడమే అవుతుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published: