హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Weight Loss: బరువు తగ్గాలా..? అయితే, మీ వెయిట్ లాస్‌కి తిరుగులేని చిట్కా ఇదే..!

Weight Loss: బరువు తగ్గాలా..? అయితే, మీ వెయిట్ లాస్‌కి తిరుగులేని చిట్కా ఇదే..!

బరువు తగ్గడానికి తేనె చక్కటి పరిష్కారం

బరువు తగ్గడానికి తేనె చక్కటి పరిష్కారం

తేనె ఆకలిని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. పడుకునే ముందు క్రమం తప్పకుండా తీసుకుంటే, నిద్రలో కెలరీలను బర్న్ చేస్తుంది. వెయిట్‌లాస్ డైట్‌కు తేనెను జోడించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో పరిశీలిద్దాం. 

తేనె రుచికి తియ్యగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని చక్కెరకు ప్రత్యామ్నాయంగా చెబుతారు. ప్రాసెస్ చేసిన చక్కెరలో పోషక విలువలు అసలు ఉండవు. దీంతో చక్కెరను ఆహారంలో తీసుకుంటే బరువు పెరుగుతారు. దీనికి బదులు తేనె వాడితే బరువు పెరగకుండా కాపాడుతుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధన ప్రకారం.. తేనె ఆకలిని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. పడుకునే ముందు క్రమం తప్పకుండా తీసుకుంటే, నిద్రలో కెలరీలను బర్న్ చేస్తుంది. వెయిట్‌లాస్ డైట్‌కు తేనెను జోడించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో పరిశీలిద్దాం.

* పాలు- తేనె

పాలు సొంతంగానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఒక చెంచా తేనెను గ్లాసు పాలలో కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం చేకూర్చుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. బీపీని తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. బెల్లి ఫ్యాట్‌ను సైతం కరిగిస్తుంది.

* తేనె- నిమ్మ రసం

ఒక గ్లాసు నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని ప్రతి‌రోజు తాగితే శరీరంలో ఉన్న ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది. అంతేకాకుండా నిమ్మరసం మిమ్మల్ని ఎక్కువసేపు రిఫ్రెష్‌గా ఉంచుతుంది. ఈ మిశ్రమం శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది.

 ఇదీ చదవండి: గేమింగ్ లవర్స్ కు పెద్ద షాక్.. మరో గేమ్ ను బ్యాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ !


* తేనె- దాల్చినచెక్క రసం

దాల్చినచెక్కలో పోషక విలువలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకే దీన్ని వంటల్లో ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క బెరడు నుంచి వచ్చే మసాలాను వివిధ రకాల ఆహారాలు, పానీయాలలో ఉపయోగించవచ్చు. ఒక గ్లాసు నీటిలో దాల్చినచెక్క, తేనెను కలిపి తీసుకుంటే బరువు తగ్గి ఫిట్‌గా ఉంటారు. గ్రీన్ టీలో కూడా టీస్పూన్ తేనె, అర టీస్పూన్ దాల్చిన చెక్క జోడించి తాగితే వెయిట్ లాస్ త్వరగా అవ్వొచ్చు.

* తేనె- వెల్లుల్లి రసం

జలుబు, దగ్గు చికిత్సకు, బరువు తగ్గడానికి సహాయపడే సాంప్రదాయ ఔషధాల్లో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లి రసంలో తేనె కలిపి తీసుకుంటే శరీరంపై అనుకూలమైన ప్రభావాలను చూపుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి రుచికి ఘాటుగా ఉంటుంది. దీంతో పచ్చిగా తినడంలో కొంత ఇబ్బంది పడవచ్చు. అయితే, కొద్దిగా తేనెను జోడించడం వల్ల రుచి మెరుగ్గా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

* తేనెతో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

తేనెలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో తేనెను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని రియాక్టివ్ ఆక్సిజన్ జాతులను (ROS) తటస్థీకరించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తేనె తీసుకోవడం వల్ల బీపీ తగ్గుతుంది. తేనెలోని పుప్పొడి ద్వారా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవల్స్ శరీరంలో మెరుగుపడవచ్చు.

ఎగువ శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు తరచుగా దగ్గు సమస్యను ఎదుర్కొంటారు. దీంతో పిల్లలు సరిగా నిద్రపోకపోవచ్చు. దగ్గు నివారణలో తేనె విజయవంతమైన చికిత్సగా పలు పరిశోధనలో తేలింది. మధుమేహం ఉన్నవారి కాళ్లకు అయ్యే గాయాలకు తేనెతో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. ఈ చికిత్సకు 43.3% విజయవంతమైన రేటు ఉందని ఒక అధ్యయనంలో తేలింది.

First published:

Tags: Diet, Honey, Weight loss, Weight loss tips

ఉత్తమ కథలు