Food : హమెంతషెన్... తయారీ ఈజీ... తింటే రుచి మామూలుగా ఉండదు...

హమెంతషెన్ (credit - twitter - Neil Flag of United States Ⓥ)

Hamentashen Recipe : మీకు కొత్త రెసిపీ చెయ్యాలని ఉందా. రోజూ తిన్న తింటే తినడం బోరుగా ఉందా. అయితే హమెంతషెన్ ట్రై చెయ్యండి. టేస్టు మామూలుగా ఉండదు. ఫుల్ శాటిస్ఫై అవుతారు.

  • Share this:
    Hamentashen Recipe : హమెంతషేనా... అదేంటి... ఆ పేరే అదోలా ఉంది... అనుకుంటున్నారా... అంతేగా మరి. మన వంటల్లా లేదు ఆ పేరు. కాబట్టి... అలాగే అనిపిస్తుంది. ఇదో సంప్రదాయ వంట. అంటే కూరలాంటిది కాదు. బేకరీ ఐటెం టైపు. స్నాక్స్‌లాగా చాలా బాగుంటుంది. తింటుంటే... నోట్లో అలా అలా జారిపోతుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వీటిని పెడితే... ఇక మీ ఇంట్లోనే వాళ్లు ఉండిపోతారు. ఇది ఏం వంట... ఎలా చేశారని అని మిమ్మల్ని అడిగి... మళ్లీ మళ్లీ మీతో చేయించుకొని తింటారు. అంతలా దీని టేస్ట్ అదిరిపోతుంది. పైగా... దీన్ని చెయ్యడం కూడా ఈజీయే. ఐతే... ఓ చిన్న సమస్య మాత్రం ఉంది. దీన్ని మైదాతో తయారుచేస్తారు. మైదా అనేది మనకు అంత ఆరోగ్యకరమైనది కాదు. కాబట్టి... ఏదో వారానికోసారి ఇలాంటి రెసిపీ చేసుకుంటే ఇబ్బందేమీ ఉండదు. మరి ఇక... దీన్ని ఎలా తయారుచేస్తారో ఫటాఫట్ తెలుసుకుందాం.

    Hamentashen తయారీకి కావాల్సినవి :
    గుడ్లు - 4
    పంచదార - కప్పులో మూడోవంతు (3/4 cup sugar)
    నూనె - కప్పులో మూడోవంతు (3/4 cup oil)
    నారింజ జ్యూస్ - 1 టేబుల్ స్పూన్
    వెనీలా పౌడర్ - 3 టేబుల్ స్పూన్లు
    తినే సోడా (వంట సోడా) - 2 టీస్పూన్లు
    మైదా పిండి - 4 కప్పులు

    Hamentashen తయారీ విధానం :
    ముందుగా... ఓవెన్‌ను 350 పాయింట్లకు వేడి చెయ్యాలి. గుడ్లను ఓ గిన్నెలో పగలగొట్టి... అందులో నారింజ (ఆరెంజ్) జ్యూస్ వెయ్యాలి. వెనీలా పొడి కలపాలి. నూనె కలపాలి. మిగతావి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని నాలుగు పార్టులుగా విడగొట్టాలి. నాలుగు కుకీ షీట్స్‌లో ఈ మిశ్రమాన్ని వెయ్యాలి.

    ఆల్రెడీ హీటెక్కిన ఓవెన్‌లో పెట్టి... 12 నుంచీ 15 నిమిషాలు బేకింగ్ చెయ్యాలి. ఆ తర్వాత 1 నిమిషం పాటూ... హమెంతషెన్‌ను చల్లబడనివ్వాలి. చల్లారే వరకూ... కుకీ షీట్ నుంచీ తొలగించవద్దు.

    చల్లారిన తర్వాత కుకీ షీట్ నుంచీ తొలగించవచ్చు. ఆ తర్వాత హమెంతషెన్‌పై ఫ్రూట్స్ ముక్కలు, చాకొలెట్ ముక్కలు వంటివి వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు వాటిని తింటే... 20 నిమిషాల్లో చేసినవి... 2 నిమిషాల్లో అయిపోతాయి. అంతలా టేస్ట్ ఉంటాయి. వీలైతే చేసుకోండి. యూట్యూబ్‌లో వీటి తయారీ విధానం ఉంటుంది. అలా కూడా మీకు ఓ ఐడియా వస్తుంది.
    Published by:Krishna Kumar N
    First published: