జుట్టు రాలటాన్ని తగ్గించే ఆయిల్.. మీరూ ట్రై చేయండి..

పెరిగిన కాలుష్యం, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు కారణాలు ఏవైనా చాలామంది జుట్టురాలే సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటివారు.. కొన్ని ఇంటిచిట్కాల ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు.

Amala Ravula | news18-telugu
Updated: June 1, 2019, 5:16 PM IST
జుట్టు రాలటాన్ని తగ్గించే ఆయిల్.. మీరూ ట్రై చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కాలుష్యం, ఆరోగ్య సమస్యలు ఇలా ఏ కారణాలైనా సరే ముందుగా ఆ ఎఫెక్ట్ జుట్టుపైనే కనబడుతుంది. ఈ మధ్యకాలంలో జుట్టురాలడం చాలా కామన్‌గా మారింది. దీంతో ఆ సమస్య గురించి ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల మరీ తీవ్రమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు చాలామంది డాక్టర్స్, బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే జుట్టు రాలడం మొదటిదశలోనే ప్రాబ్లమ్‌ని గుర్తించి కొన్ని రెమిడీస్ వాడాలి. అప్పటికే తగ్గకపోతే అప్పుడు వైద్యులను సంప్రదించాలి. ఆ చిట్కాల్లో మొదటి చిట్కానే మందారనూనె.

మందారపూలు.. కేవలం పూలేకాదు.. వీటి ఆకులు కూడా జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. మందారపూలను కొబ్బరినూనెలో కలిపి బాగా వేడిచేయాలి. ఈ నూనెతో తలపై మసాజ్ చేయాలి. ఇలా చేస్తుండడం వల్ల జుట్టు రాలడం తగ్గి, మెరుస్తుంటుంది. అంతేకాదు, వెంట్రుకలు త్వరగా తెల్లబడవు కూడా. చర్మంలోని మృతకణాలను తొలగించడం ఈ నూనె ప్రత్యేకం. పూలు దొరకనప్పుడు వాటి ఆకులతో కూడా ఈ నూనెని తయారుచేసుకోవచ్చు.


అందుకే కాళ్లు పగుళ్లున్నవారు... రాత్రి పడుకునేముందు కాళ్లని శుభ్రంగా కడుక్కుని మందార నూనెలో కాస్తా పసుపు వేసి రాయడం వల్ల ఆ సమస్య కూడా తగ్గిపోతుంది.
Published by: Amala Ravula
First published: June 1, 2019, 5:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading