ఇంట్లో ఆసనస్థితిలో ఉన్న వినాయకుడి విగ్రహం ఉందా..

ప్రతీకాత్మక చిత్రం

వినాయకుడి రూపాలు అనేకం.. రకరకాల రూపాల్లో భక్తులను కరుణిస్తాడు సిద్ధి వినాయకుడు. ఓసారి కూర్చుని.. మరోసారి నిల్చుని.. ఇంకోసారి నాట్యం చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు. ఇందులో కూర్చుని ఉన్న వినాయకుడి రూపం అర్థమేంటో తెలుసుకోండి.

  • Share this:
ఫొటోల్లో, ప్రతిమల్లో వినాయకుడు కూర్చుని ఉంటాడు. తన ఎడమకాలుని ముడుచుకుని, కుడిపాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తాడు.. యోగాశాస్త్రంలో దీనినే లలితాసనం అంటారు. లలితా దేవి కూడా ఈ ఆసనంలోనే భక్తులకు దర్శనమిస్తుంది. ఇలా కూర్చునే దేవతామూర్తుల విగ్రహాలు భారతదేశంలో చాలా తక్కువగా ఉంటాయి. కానీ, బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనంలోనే కనిపిస్తాయి. ఈ ఆసనం ప్రశాంతంగా ఉంటూనే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుందని చెబుతుంది.

ఓ పక్క జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదర్కొంటూనే మనసుని స్థిరంగా నిలుపుకోగలిగే సవాలుని స్వీకరిస్తున్నానని చెప్పేందుకు సూచనగా గణేశుడు ఈ రూపంలో కనిపిస్తాడు. తనని కొలిచే భక్తుల విఘ్నాలను తొలగించి వారిని కూడా పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చేందుకు సూచనగానే వినాయకుడు లలితాసనంలో భక్తులకు దర్శనమిస్తాడని చెబుతుంటారు.
First published: