Parenting tips: నిద్రపోయే పిల్లల్లో కల‘వరం’..

Parenting tips: నిద్రపోయే పిల్లల్లో కల‘వరం’..

ప్రతీకాత్మక చిత్రం

చిన్నారులు నిద్రపోయేటప్పుడు ఏవేవో కలరిస్తుంటారు. ఆ సమయంలో తల్లీదండ్రులు కంగారు పడుతుంటారు. కానీ, దీని వల్ల ఆరోగ్యప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.

  • Share this:
పిల్లలు నిద్రపోయే సమయంలో ఏవేవో కలవరిస్తుంటారు. ఈ సమయంలో ఇలా ఎందుకు చూస్తున్నారు.. ఏమైనా గాలి, ధూళి సోకిందా.. అంటూ ఆలోచిస్తుంటారు. అంతేనా, హైరానా పడిపోతుంటారు.. డాక్టర్ల దగ్గరికీ పరుగులు తీస్తుంటారు. అయితే, పేరెంట్స్ ఈ విషయం గురించి కంగారుపడాల్సిన అవసరంలేదు.
పిల్లలు రోజంతా చేసిన పనులు, ఆటల గురించి నిద్రలో కలవరిస్తుంటారు. వాళ్లకు ఇష్టమైనవి, గుర్తొచ్చినప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ వారి చిన్ని చిన్ని మెదళ్లలో ఉండే భారం తగ్గిపోతుంది.

అయితే, మరీ ఎక్కువగా కలవరిస్తే మాత్రం పక్కనే ఉండి దగ్గరికి తీసుకోవాలి. ఒళ్లో పడుకోబెట్టుకోవాలి. దీని వల్ల మనం ఉన్నామనే ధైర్యం వారికుంటుంది. ఇలా చేసినా కూడా కలవరింతలు ఆగకపోతే.. తప్పకుండా డాక్టర్లని సంప్రదించడం మంచిది.
First published: