Sex Education: మీ భార్యకు సెక్స్‌పై ఇంట్రెస్ట్ తగ్గిందా? కారణాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

Sexual dysfunction: లైంగిక అనుభవాన్ని ఆస్వాదించాలంటే అవగాహన, మెంటల్ స్టెబిలిటీ మరియు భాగస్వాముల మధ్య సహకారం అత్యంత అవసరమని అనేక పరిశోధనలు పేర్కొంటున్నాయి.

  • Share this:
మనిషికి ఆహారం ఎలాంటిదో శృంగారం కూడా అలాంటిదే. ఆహారం కడుపు నింపితే.. సెక్స్ శరీరానికి సుఖాన్ని ఇస్తుంది. ఒత్తిడి నుండి దూరం చేసి శాంతిని ప్రసాదిస్తుంది. అటువంటి శృంగారాన్ని ప్రతి మనిషి తన జీవితంలో అత్యంత ఆనందదాయకమైన మరియు ఉత్తేజకరమైన చర్యగా భావిస్తారు. అయితే, చాలా మంది మహిళలు సెక్స్ విషయంలో అసౌకర్యాన్ని ఎదుర్కొంటుంటారు. అది మీ భాగస్వామితో మీ సంబంధాన్ని దెబ్బతీయడానికి కారణమవుతుంది. ముఖ్యంగా లైంగిక అనుభవాన్ని ఆస్వాదించాలంటే అవగాహన, మెంటల్ స్టెబిలిటీ మరియు భాగస్వాముల మధ్య సహకారం అత్యంత అవసరమని అనేక పరిశోధనలు పేర్కొంటున్నాయి. భార్యభర్తల మధ్య మంచి సంబంధం నెలకొనాలంటే ఎమోషనల్ కనెక్షన్ ఎంత ముఖ్యమో ఫిజికల్ క్లోజ్‌నెస్ కూడా అంతే ముఖ్యం. తమ లైంగిక సమస్యల గురించి అనేక జంటలు చర్చించని కారణంగా చాలా జంటలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

సెక్సువల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏమిటి ?
సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం, సంభోగం సమయంలో స్త్రీలో నొప్పి తలెత్తడం వంటి లైంగిక సమస్యలను సెక్సువల్ డిస్‌ఫంక్షన్‌గా పేర్కొనవచ్చు. సెక్సువల్ రెస్పాన్స్ సైకిల్ యొక్క ఏ దశలోనైనా ఈ సమస్య సంభవించవచ్చు. అనగా లైంగికంగా ప్రేరేపించినప్పుడు ఒక వ్యక్తి ఎదుర్కొనే మానసిక మరియు శారీరక మార్పు ద్వారా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇది లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే జంటలను సంతృప్తిపరచకుండా చేస్తుంది. ఈ సమస్యను స్త్రీ ఏ వయసులోనైనా ఎదుర్కోవచ్చు. అయితే, లైంగికంగా యాక్టివ్‌గా లేకపోవడానికి వ్యక్తిగత నమ్మకాలు కూడా దోహదం చేస్తాయని ఆనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. చాలా జంటలు తమ సెక్సువల్ ప్రాబ్లమ్స్‌పై చర్చించడాన్ని ఇబ్బందికరమైన మరియు ప్రైవేట్ అంశంగా భావిస్తారు. సుమారు 43% మంది మహిళలు సెక్సువల్ డిస్‌ఫంక్షన్‌తో బాధపడుతున్నారని పరిశోధనల్లో తేలింది.

సెక్సువల్ డిస్‌ఫంక్షన్‌కు కారణాలేంటి?
శరీరం యొక్క హార్మోన్‌లు దారితప్పినప్పుడు, గర్భం ధరించినప్పుడు లేదా మోనోపాజ్ సమయంలో స్త్రీలలో ఇటువంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. ఇది సాధారణంగా మానసిక లేదా శారీరక సమస్యల వల్ల ఉత్పన్పమవుతుంది. కింద పేర్కొన్న కొన్ని అంశాలు సెక్సువల్ డిస్‌ఫంక్షన్‌కు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

శారీరక కారణాలు
స్త్రీలలో క్యాన్సర్, డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, మూత్రాశయ సమస్యలు లేదా గుండె సంబంధిత సమస్యలు సెక్సువల్ డిస్‌ఫంక్షన్‌కు దోహదం చేస్తాయి. కొంతమందిలో యాంటిడిప్రెసెంట్స్, బ్లడ్ ప్రెజర్ మెడిసిన్స్, యాంటిహిస్టామైన్లు మరియు కెమోథెరపీ వంటి మందులు వాడటం ద్వారా లైంగిక కోరికను తగ్గిస్తాయి. కాబట్టి, ఈ ఔషధాలను తీసుకునేటప్పుడు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

హార్మోన్ల కారణాలు
మోనోపాజ్ సమయంలో మహిళల శరీరాలు తక్కువ ఈస్ట్రోజెన్ స్థాయిలను విడుదల చేస్తాయి. ఇవి జెనిటికల్ టిష్యూస్ను మరియు లైంగిక ప్రతిస్పందనను మారుస్తాయి. ఇది బాధాకరమైన సంభోగానికి దారితీస్తుంది. దీనిని డిస్పరేనియా అని కూడా పిలుస్తారు. పిల్లలు పుట్టిన సమయంలో, తల్లి పాలిచ్చే సమయంలో మహిళల్లో హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. దీని వల్ల మహిళల్లో లైంగిక కోరిక సనగిల్లే అవకాశం ఉంటుంది.

మానసిక కారణాలు
ఆందోళన లేదా నిరాశ లైంగికంగా చురుగ్గా లేకపోవడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతారు. భాగస్వామితో తగాదాలు, సమస్యలు ఉంటే, ఇద్దరి మధ్య తక్కువ లైంగిక కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా స్త్రీలలో లైంగిక ఆసక్తి తగ్గుతుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి ?
మీరు మరియు మీ భాగస్వామి లైంగిక సమస్యలతో బాధపడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. కొంతమందికి ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ మరికొందరికి తక్షణ చికిత్స అవసరం అవుతుంది. వైద్య చికిత్సలో భాగంగా ఈస్ట్రోజెన్ థెరపీ, ఓస్పెమిఫేన్, ఆండ్రోజెన్ థెరపీ వంటివి చేస్తారు. ఇవి స్త్రీలలో లైంగిక కోరికను పెంచుతాయి. సెక్సువల్ డిస్‌ఫంక్షన్ ఎదుర్కొంటున్న మహిళలు కమ్యూనికేషన్, ఆరోగ్యకరమైన జీవనశైలి, సెక్స్ థెరపిస్ట్ను సంప్రదించడం వంటి వాటి ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
Published by:Kishore Akkaladevi
First published: