• HOME
 • »
 • NEWS
 • »
 • LIFE-STYLE
 • »
 • RAMADAN RAMZAN 2021 HOW TO MAKE CHICKEN HALEEM AT HOME HERE IS SIMPLE STEPS YOU WILL GET TASTY HALEEM SK

Ramzan Special: నోరూరించే చికెన్ హలీంను ఇంట్లోనే ఇలా చేసుకోండి.. చాలా ఈజీ.. టేస్ట్ అదుర్స్

Ramzan Special: నోరూరించే చికెన్ హలీంను ఇంట్లోనే ఇలా చేసుకోండి.. చాలా ఈజీ.. టేస్ట్ అదుర్స్

హలీం

Haleem at Home: మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బయటి ఫుడ్ తినేందుకు చాలా మంది భయపడుతున్నారు. కానీ రంజాన్ మాసంలో హలీం తినకుండా ఉండలేకపోతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చక్కగా పరిశుభ్రమైన, రుచికరమైన హలీంను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

 • Share this:
  రంజాన్ పండగ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హలీం..! పొగలు కక్కుతూ.. ఘుమఘుమలాడూతూ.. మాంసాహార ప్రియుల నాలుకను లాగేస్తుంది హలీం. మ‌తాల‌తో సంబంధం లేకుండా రుచిక‌ర‌మైన ఈ హ‌లీమ్ కోసం జనాలు బారులు తీరుతారు. ఐతే గత ఏడాది కరోనా కారణంగా హలీం తయారీ నిలిచిపోయింది. కానీ ఈసారి మాత్రం అమ్మకాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో హలీం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఐతే ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బయటి ఫుడ్ తినేందుకు చాలా మంది భయపడుతున్నారు. కానీ రంజాన్ మాసంలో హలీం తినకుండా ఉండలేకపోతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చక్కగా పరిశుభ్రమైన, రుచికరమైన హలీంను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

  హలీం తయారీకి కావాల్సిన పదార్థాలు:
  చికెన్ 500 గ్రాములు, గోధుమ రవ్వ-4 టేబుల్ స్పూన్లు, కంది పప్పు- 2 టేబుల్ స్పూన్లు, శనగ పప్పు- 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు- 2 టేబుల్ స్పూన్లు,
  ఎర్ర పప్పు- 2 టేబుల్ స్పూన్లు, పెసర పప్పు- 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు-2 టేబుల్ స్పూన్లు, బాదం-10, జీడిపప్పు-10

  మిరియాలు-20, లవంగాలు-30, యాలకులు-15, దాల్చిన చెక్క-4, జీలకర్ర-టీ స్పూన్, శాయిజీరా- స్పూన్, అల్లం వెల్లులి పేస్ట్-2 టేబుల్ స్పూన్లు, పచ్చి మిర్చి-10, కొత్తి మీర-గుప్పెడు, పుదీనా-గుప్పెడు, గులాబీ రేకులు-గుప్పెడు, పెరుగు-3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లి-2 కప్పులు, నెయ్యి-4 టేబుల్ స్పూన్లు.

  హలీం తయారీ:
  ముందుగా ఉల్లిపాయలను ఫ్రై చేసి పక్కనపెట్టుకోవాలి. బ్రౌన్ కలర్‌లో కరకరలాడేలా వేయించుకోవాలి. ఆ తర్వాత గోధుమలు, అన్ని రకాల పప్పులు, నువ్వులు, మిరియాలు, లవంగాలు సహా అన్ని మసాలాలు, డ్రైఫ్రూట్స్‌ను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా.. కొంచెం చేతికి తగిలేలా ఉండాలి. అన్నింటినీ కలిపి పొడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిపై కుక్కర్‌ పెట్టి 3 టేబుల్ స్పూన్‌లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. అనంతరం కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి. కాస్త వేగిన తర్వాత ముక్కలు మునిగేవరకు నీళ్లు పోయాలి. ఆ తర్వాత ఒక కప్పు వేయించిన ఉల్లిపాయలు (బ్రౌన్ ఆనియన్), పచ్చిమిర్చి ముక్కలు, గులాబీ రేకులు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, తగినంత ఉప్పువేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పొడి చేసుకున్న పప్పులు, మసాలాల మిశ్రమాన్ని వేసుకొని.. తగినన్ని నీళ్లు పోయాలి. నీళ్లు మరీ ఎక్కువగా ఉంటే.. హలీం పలుచగా అవుతుంది. మరీ తక్కువగా పోస్తే గట్టిగా ఉంటుంది. అందుకే కాస్త చూసి అటూ ఇటూగా పోయాలి. ఇక కుక్కర్ మూతపెట్టి పెద్ద మంటపై నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

  ఆ తర్వాత మూతతీసి టేస్ట్ చూడాలి. అన్నీ సరిపోతే ఓకే. అవసరమైతే మళ్లీ మసాలాలు వేసుకోవచ్చు. ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. ఎక్కువైతే కాసిన్ని నీళ్లు పోసుకోవాలి. అనంతరం చికెన్ ముక్కలను మాషర్‌తో మెత్తగా రుబ్బుకోవాలి. మాషర్ లేకుంటే.. చికెన్ ముక్కల వరకు పక్కకు తీసి మిక్సీ పట్టవచ్చు. ఆ చికెన్ పేస్ట్‌ని మళ్లీ మిశ్రమంలో వేసి.. సన్నని మంటపై 30 నిమిషాలు ఉడికించాలి. హలీం మరీ గట్టిగా కాకుండా.. మరీ పలచగా కాకుండా.. చూసుకోవాలి. చివరగా హలీంని వేరొక పాత్రలోకి తీసుకొని.. మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్‌తో గార్నిష్ చేసుకోవాలి. హలీం వేడి వేడిగా తింటేనే ఆ టేస్ట్ అదిరిపోతుంది. కాస్త శ్రద్ధ పెట్టి చేస్తే.. హోటల్ కంటే రుచికరంగా తయారవుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇంట్లోనే సింపుల్‌గా హలీం తయారుచేసుకోండి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు