రంజాన్ స్పెషల్... చరిత్రలో ముస్లింలు ప్రార్థనలకు దూరమైన సందర్భాలు ఇవే...

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి వల్ల ముస్లింలు పండుగను ఉత్సాహంగా చేసుకోలేని పరిస్థితి.

news18-telugu
Updated: May 25, 2020, 8:48 AM IST
రంజాన్ స్పెషల్... చరిత్రలో ముస్లింలు ప్రార్థనలకు దూరమైన సందర్భాలు ఇవే...
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ పండుగ వచ్చింది. నెలవంక కనిపించడంతో ఈ రోజు రంజాన్ పండుగ జరుపుకొంటున్నారు ముస్లింలు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల ముస్లిం సమాజానికి ఈ పండుగ చాలా విశిష్టమైంది. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి వల్ల ముస్లింలు పండుగను ఉత్సాహంగా చేసుకోలేని పరిస్థితి. సహజంగా రంజాన్ సందర్భంగా సామూహిక ప్రార్థనలు, తమకు తోచినంతలో దానధర్మాలు చేయడం, ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, పెద్ద ఎత్తున విందులు ఉంటాయి. అయితే, ప్రస్తుతం సామాజిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో అవేవీ లేకుండానే సాధారణంగా జరుపుకొంటున్నారు. అయితే, చరిత్రలో కొన్ని ఘటనలు, మహమ్మారుల వల్ల ముస్లింలు కొన్ని పవిత్ర ప్రార్థనలకు దూరం అయ్యారు. గతంలో మసీదులు మూసేయడం, సామూహికంగా సమావేశాలు వంటివి రద్దయిన ఘటనలు చాలా సార్లు జరిగిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి.

క్రీస్తు శకం 930లో ఖుర్మాతియన్ దాడులు...

తూర్పు అరేబియా (ప్రస్తుతం బహ్రెయిన్) ప్రాంతానికి చెందిన ఖుర్మాతియన్ తెగ వారు 930 సంవత్సరంలో మక్కా మసీదు మీద మెరుపుదాడులు చేశారు. అది ఓ రకంగా నరమేథం. సుమారు 30,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కాబా మీద ఉండే నల్లరాయిని దోచుకెళ్లారు. దీంతో ఆ సమయంలో జరపాల్సిన వార్షిక హజ్ యాత్రను రద్దు చేశారు. ఆ తర్వాత 20 ఏళ్లకు మళ్లీ ఆ నల్లరాయి తిరిగి మక్కాకు చేరింది.

19వ శతాబ్దంలో కలరా...
19వ శతాబ్దంలో పలుమార్లు కలరా వ్యాపించింది. 1837 నుంచి 1846 మధ్య కలరా వ్యాపించిన సందర్భాల్లో హజ్ యాత్రలు కూడా రద్దు చేశారు. 1865లో మళ్లీ కలరా రావడంతో కాన్‌స్టాంట్ నోపుల్ (ప్రస్తుత ఇస్తాంబుల్) అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కూడా రద్దు చేశారు. సినాయ్, హెజాజ్ లాంటి ప్రాంతాల్లో క్వారంటైన్ పోర్టులను కూడా ఏర్పాటు చేశారు. 1830 నుంచి 1930 మధ్య సుమారు 27 సార్లు మక్కాలో కలరా వ్యాపించింది.

1979లో గ్రాండ్ మసీదు ముట్టడి...
1979 నవంబర్ - డిసెంబర్ మధ్య కాలంలో సుమారు 400 నుంచి 500 మంది సాయుధులు గ్రాండ్ మసీదును ముట్టడించారు. సుమారు రెండు వారాల పాటు మసీదు మూతపడింది.2014లో ఎబోలా....
2010 సమయంలోనే ప్రపంచానికి ఎబోలా పాకినా.. 2014లో సౌదీ అరేబియా ప్రభుత్వం జెనీవా, లైబీరియా, సియర్రా లియోన్ ప్రజలకు ఉమ్రా, హజ్ వీసాలను రద్దు చేసింది.

2016లో సిరియా యుద్ధం
ప్రభుత్వ సైన్యం బాంబుల వర్షం కురిపించడంతో అలెప్పోలోని మసీదులు నేలమట్టం అయ్యాయి. దీంతో ఏప్రిల్ 29న శుక్రవారం ప్రార్థనలు రద్దు అయ్యాయి. ప్రజలకు మసీదుల వద్దకు రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని మతపెద్దలు పిలుపునిచ్చారు. అలెప్పో లాంటి చరిత్రాత్మక నగరంలో అలా పిలుపునివ్వడం ఫస్ట్ టైమ్.

(Source: Aljazeera)
Published by: Ashok Kumar Bonepalli
First published: May 25, 2020, 8:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading