బ్లాక్ రైస్ హలీం...మార్కెట్‌లోకి మరో వెరైటీ హలీం

ఇందులో ఉండే ఔషధ గుణాలు, అధిక పోషకాల కారణంగా నల్ల బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇంత‌టి షోష‌క విలువ‌లు ఉన్న న‌ల్ల బియ్యంతో ఇప్పుడు పిస్తా హౌస్ మ‌న‌కు హ‌లీమ్‌ను అందిస్తోంది.

news18-telugu
Updated: May 10, 2019, 5:37 PM IST
బ్లాక్ రైస్ హలీం...మార్కెట్‌లోకి మరో వెరైటీ హలీం
బ్లాక్ హలీం
  • Share this:
హలీమ్..! వారెవ్వా..ఏం రుచి..! పొగలు కక్కుతూ..ఘుమఘుమలాడూతూ..మాంసాహార ప్రియులకు అసలు సిసలు టేస్ట్ అందిస్తోంది హలీం. రంజాన్ మాసం ప్రారంభమైదంటే చాలు..హైదరాబాద్‌లో అడుగడుగునా హలీం బట్టీలు కనిపిస్తాయి. సాయంత్రం వేళ హలీం షాపుల ముందు క్కూలు కనిపిస్తుంటాయి. మ‌తాల‌తో సంబంధం లేకుండా రుచిక‌ర‌మైన ఈ హ‌లీమ్ కోసం బారులు తీరుతారు జ‌నం. ఐతే
హ‌లీమ్ విషయంలో అంద‌రికి సుప‌రిచిత‌మైన పేరు పిస్తా హౌస్. పవిత్ర రమదాన్ మాసంలో ఇక్క‌డ త‌యారు చేసిన హాలీమ్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కేవలం మ‌న దేశంలోనే కాకుండా ఇత‌ర దేశాల‌కు కూడా పిస్తా హలీం ఎగుమతి చేస్తారు. ఐతే ప్రతిసారీ వెరైటీ హలీంను పరిచయం చేసే పిస్తాహౌజ్ ఈసారి మరో వెరైటీతో ముందుకొచ్చింది. అదే బ్లాక్‌రైస్ హలీం...!

సాధారణంగా గోధుమలు, బియ్యం వేసి హలీం తయారు చేస్తారు. వాటి స్థానంలో నల్లబియ్యం వాడి బ్లాక్‌రైస్ హలీమ్‌ను తయారుచేస్తోంది పిస్తా హౌజ్. బ్లాక్ రైస్ ను ఒకప్పుడు చైనాలోని ఈ బియ్య‌న్ని విరివిగా ఉప‌యోగించేవారు. అక్క‌డ రాజ వంశీయులు మాత్రమే వీటిని తినేవారు. అది క్ర‌మంగా ఈశాన్య భారతంలోకి కూడా ప్ర‌వేశించింది. ముఖ్యంగా మ‌న దేశంలో మ‌ణిపూర్‌లో ఈ బియ్యాన్ని పండిస్తోంటారు. ఇక్క‌డ నుంచే ఇత‌ర‌ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు, అధిక పోషకాల కారణంగా నల్ల బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇంత‌టి షోష‌క విలువ‌లు ఉన్న న‌ల్ల బియ్యంతో ఇప్పుడు పిస్తా హౌస్ మ‌న‌కు హ‌లీమ్‌ను అందిస్తోంది. న‌గ‌రంలో రోజు రోజుకి ఆరోగ్యంపై అంద‌రికి పెరుగుతున్న శ్ర‌ద్దే త‌మ‌కి ఇలాంటి ఆలోచ‌న రావ‌డానికి కార‌ణం అంటున్నారు పిస్తా హౌస్ యాజ‌మాన్యం.

మ‌ణిపూర్ నుంచి మేము ఈ బియ్యాన్ని ప్ర‌త్యేకంగా తీసుకొస్తున్నాం. నార్త్ ఈస్ట్ ఫండేష‌న్ భాగస్వామ్యంతో ఈ బియ్యం ఉప‌యోగాలు అంద‌రికి ప్ర‌చారం చేసే కార్య‌క్ర‌మంలో భాగంగా బ్లాక్ రైస్ హలీం తయారుచేస్తున్నాం. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లోని పిస్తా హౌజ్ దుకాణాల్లో ఈ హలీం లభిస్తోంది. కొన్ని దేశాల‌కు కూడా ఎగుమ‌తి చేస్తున్నాం. వీటికి మంచి స్పంద‌న వ‌స్తోంది.
మ‌హ్మ‌ద్ అబ్దుల్ మ‌జీద్, పిస్తా హౌస్ అధినేత
మ‌రోక‌వైపు డాక్ట‌ర్లు కూడా ఈ బ్లాక్ రైస్ తిన‌డం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తోంద‌ని అంటున్నారు. ముఖ్యంగా డ‌యాబెటీస్ త‌గ్గించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయ‌ని చెబుతున్నారు. “న‌ల్ల బియ్యంలో ఫైబ‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ‌రువు త‌గ్గాలనుకునేవారు వారు ఈ బియ్యం తింటే మెరుగైన ఫ‌లితాలు కనిపిస్తాయి. గుండెకు సంబంధించిన జ‌బ్బులు కూడా ఈ రైస్ తిన‌డం వ‌ల‌న ద‌రిచేర‌వు” అని న్యూస్ 18తో ప్ర‌ముఖ న్యూట్రీషియ‌న్ డా.అంజ‌న్ కుమార్ చెప్పారు.

హ‌లీమ్‌లో గోధుమలు నేరుగా వేయకుండా గోధమ రవ్వను నీటిలో నానబెట్టి మంచి రుచి కోసం మినపప్పు, శనగపప్పు, కందిపప్పును కలుపుతున్నారు. వీటితో పాటు మంచి అరుగుదలకు ఉపయోగపడే జిలకర్ర, షాజీరా, దాల్చిన చెక్క, తోక మిరియాలు, యాలకులు, వెల్లుల్లిలను యాడ్ చేస్తున్నారు. దాదాపు 8 గంటల పాటూ కట్టెల పొయ్యిపై వండుతూ హలీంను తయారు చేస్తారు. సాధారణ బాస్మతి బియ్యం స్థానంలో ఎన్నో ఔషధ గుణాలున్న నల్ల బియ్యాన్ని హలీం తయారీలో వాడ‌డం..ఇప్పుడు అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షిస్తోంది.

First published: May 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>