సోదరికి జీవితాంతం తోడుగా, రక్షణగా ఉంటానని సోదరుడు చేసే ప్రతిజ్ఞకు ప్రతీకగా రక్షా బంధన్(Raksha Bandhan) జరుపుకుంటారు. ఈ సందర్భంగా సోదరికి ప్రత్యేక బహుమతులు ఇచ్చి ప్రేమను తెలియజేస్తారు. అయితే సాధారణ బహుమతులకు భిన్నంగా వారికి ఆర్థిక స్వేచ్ఛను అందిస్తే.. భవిష్యత్తులో నిజమైన రక్షణ లభిస్తుంది. ఆమె పొదుపు చేస్తున్న ఆస్పిరేషన్ ఫండ్‌కు సహకారం అందించడం లేదా ఆమె కోసం సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయడం వంటి సాధారణ మార్గాల ద్వారా సిస్టర్స్ ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వొచ్చు. ఇవి శాశ్వతంగా కూడా ఉంటాయి. సోదరికి కానుకగా అందించగల బెస్ట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఏవో చూద్దాం.
సేవింగ్స్ అకౌంట్
సోదరికి బ్యాంక్ (Bank)అకౌంట్ లేకుంటే.. ఆమె కోసం ఓ సేవింగ్స్(Savings) అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. రాఖీ రోజు ఆమెకు ఇవ్వాలనుకుంటున్న మొత్తాన్ని ఆ అకౌంట్‌లో డిపాజిట్ చేయవచ్చు. అకౌంట్‌లో డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ లభిస్తుంది. అవసరాలకు ఆ రాబడిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) లేదా రికరింగ్ డిపాజిట్(RD)
మీ సిస్టర్స్‌కు రాఖీ రోజు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్న డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. దీనిపై ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. అదే విధంగా రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసి.. ప్రతి నెల కొంత మొత్తం డిపాజిట్ చేయవచ్చు. సేవింగ్స్ అకౌంట్ కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
ట్రెడిషనల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లే కాకుండా.. మ్యూచువల్ ఫండ్(Mutual Fund)లలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. గత ఐదేళ్లలో మంచి పనితీరు కనబరిచిన మ్యూచువల్ ఫండ్‌ను సెలక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయవచ్చు. సోదరి ఇన్వెస్టర్ కాకపోతే ఇది ఆమెకు ఉపయోగపడుతుంది. ఈక్విటీ, డెట్ బ్యాలెన్స్ ఉన్న ఫండ్‌ను సెలక్ట్ చేసుకోవడం బెస్ట్. లాక్-ఇన్ వ్యవధి లేని ఓపెన్-ఎండెడ్ ఫండ్‌ని ఎంచుకుంటే, సోదరి తన అవసరాలకు అనుగుణంగా మొత్తాన్ని రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
పేపర్ గోల్డ్
ఈ సంవత్సరం రక్షా బంధన్ కానుకగా సోదరి కోసం బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆభరణాలను కొనడానికి ఇష్టపడని వారు గోల్డ్ ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్ వంటి పేపర్ గోల్డ్ ఇన్‌స్ట్రుమెంట్‌లను సెలక్ట్ చేసుకోవచ్చు. పేపర్ గోల్డ్‌కొనుగోలు చేయడం అనేది ఫిజికల్‌గా బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే పేపర్ గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 25 శాతం మేకింగ్ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు.
గోల్డ్ ఈటీఎఫ్ అనేది గోల్డ్ అసెట్స్ ఓనర్‌షిప్‌ను సూచించే ఇన్‌స్ట్రుమెంట్. సోదరికి వీటిని బహుమతిగా ఇవ్వాలనుకుంటే.. ఆమెకు డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ అవసరం. ఇది కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆప్షన్‌లు కూడా ఉన్నాయి.
హెల్త్ ఇన్సూరెన్స్
సోదరి కోసం రక్షా బంధన్ రోజున హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది వైద్యపరమైన అత్యవసర సమయాల్లో ఆర్థిక భద్రతను అందిస్తుంది. మెడికల్ బిల్లుల గురించి చింతించకుండా సోదరికి వైద్య చికిత్స పొందడానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సహాయపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Financial support, Fixed deposits, Mutual Funds, Raksha Bandhan