Railway Bumper Offer : ఇకనుంచి రైళ్ళల్లో తక్కువ చెల్లించండి.. ఎక్కువ దూరం ప్రయాణించండి..

చాలా సందర్భాల్లో మనం రైల్వే సీజన్ టికెట్ ఇచ్చే గరిష్ఠ దూరం 150 కిలోమీటర్ల కన్నా ఎక్కువదూరం ప్రయాణిస్తుంటాం. ఇలాంటి సందర్భంలో మరో టికెట్ కొనాల్సి ఉంటుంది. అయితే రైల్వేశాఖ ఈ సమస్యను తొలగిస్తూ ప్రయాణికులకు తీపికబురు అందించింది.

Amala Ravula | news18-telugu
Updated: March 14, 2019, 8:29 AM IST
Railway Bumper Offer : ఇకనుంచి రైళ్ళల్లో తక్కువ చెల్లించండి.. ఎక్కువ దూరం ప్రయాణించండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మనం రైళ్ళల్లో ఎన్నో రూట్లల్లో ప్రయాణిస్తుంటాం. దూరపు ప్రయాణాలుంటాయి. ఇందులో రైల్వే సీజన్ టికెట్‌కి 150 కిలోమీటర్లు ఇస్తారు. ఒకవేళ ఇంతకు మించి కనీసం 2 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉన్నా మరో టికెట్ కొనాలి. కానీ, ఇకనుంచి ఇలాంటి ఇబ్బందులు ఉండవు. తెలుగురాష్ట్రాల పరిధిలో అనేక రూట్లల్లో ఈ సమస్యను తొలగిస్తూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సీజన్ టికెట్ల ప్రయాణ దూరం పరిమితిని పెంచింది.
ప్రస్తుతం మూడు నెలలు, ఆరు నెలల వ్యవధితో సీజన్ టికెట్లను రైల్వేశాఖ జారీ చేస్తోంది. ఇందులో గరిష్ఠ దూరం 150 నుంచి 160 కిలోమీటర్లకు పెంచింది. ప్రయాణికుల నుంచి డిమాండ్ అధికంగా ఉండడంతోనే 12 మర్గాలను ఎంపిక చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

రైల్వే ప్రకటించిన కొత్త మార్గాలు..
హైదరాబాద్ -వరంగల్ -152
మల్కాజిగిరి - నిజామాబాద్ -157
కాచిగూడ -వనపర్తి -159
లింగంపల్లి - కాజీపేట -155వరంగల్ -మధిర -153
జనగాం - మంచిర్యాల -155
యాద్గిరి - వికారాబాద్ -153
చిత్తూరు -రాజంపేట -156
గుంతకల్లు -పెనుకొండ -155
శ్రీకాళహస్తి -పెరంబూరు -159
సామర్లకోట -విశాఖపట్నం -151
First published: March 14, 2019, 8:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading